news

News April 10, 2024

IPL: నేడు GTతో RR ఢీ

image

IPL-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా GT 4 మ్యాచుల్లో గెలిచింది. RR కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో RR టాప్‌లో ఉండగా, GT 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. నేడు ఏ టీమ్ గెలుస్తుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

News April 10, 2024

సీఎం జగన్ బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటి నుంచి యథావిధిగా కొనసాగనుంది. ఇవాళ పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ఆయన ఉ.9కి బయల్దేరుతారు. పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సా.3:30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.

News April 10, 2024

TS EAPCET: సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు!

image

TS EAPCETకు ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు మే 1 వరకు గడువు ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,49,247 దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తుండడంతో JNTU అధికారులు కొత్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెంటర్లను ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News April 10, 2024

హెపటైటిస్ వైరస్‌లతో రోజుకు 3,500 మరణాలు: WHO

image

ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల వల్ల రోజుకు 3,500 మరణాలు సంభవిస్తున్నాయని WHO వెల్లడించింది. హెపటైటిస్ మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్లుగా ఉండగా, 2022లో 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. మొత్తం హెపటైటిస్ కేసుల్లో మూడింట రెండొంతులు బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, రష్యా, వియత్నాంలో నమోదవుతున్నట్లు WHO నివేదిక పేర్కొంది.

News April 10, 2024

రోహిత్‌ను అన్ని ఫ్రాంచైజీలు కోరుకుంటాయి: రాయుడు

image

IPLలో అన్ని జట్లు రోహిత్ శర్మను కెప్టెన్ చేయడానికి ఇష్టపడతాడని అంబటి రాయుడు అన్నారు. 2025 సీజన్‌లో ఏ జట్టుకు ఆడాలనేది రోహిత్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ముంబై కంటే బెటర్‌గా ట్రీట్ చేసే ఫ్రాంచైజీకి వెళ్లాలని అతను అనుకుంటాడని చెప్పారు. RCBకి హిట్‌మ్యాన్ అవసరం ఉందా అని ఓ రిపోర్టర్ అడగగా.. ‘ఆ విషయం నాకు తెలియదు. కానీ మీకు ఒక హెడ్‌లైన్ కావాలనే విషయం అర్థం అవుతోంది’ అని సరదాగా బదులిచ్చారు.

News April 10, 2024

సినీ పరిశ్రమలో విషాదం.. ‘బాషా’ మూవీ నిర్మాత కన్నుమూత

image

సినీపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ (97) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటుడు ఎంజీఆర్‌కు ఆయన సన్నిహితుడు. ఎంజీఆర్, కమల్‌హాసన్, రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్స్‌తో ఆయన పలు సినిమాలను నిర్మించారు. రజనీకాంత్ ‘బాషా’ మూవీకి కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇవాళ సాయంత్రం నుంగంబాకంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

News April 10, 2024

నేటితో ముగియనున్న NEET(UG) రిజిస్ట్రేషన్ గడువు

image

దేశవ్యాప్తంగా MBBS, BDSకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. రాత్రి 11:50 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ ఫీజు చెల్లించవచ్చని NTA పేర్కొంది. గత నెల 16న రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపింది.

News April 10, 2024

చంద్రయాన్-4పై అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్

image

చంద్రయాన్-4 అభివృద్ధి దశలో ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ గొప్ప పురోగతి సాధిస్తోందని అన్నారు. పంజాబ్ రాష్ట్రం లుధియానాలోని ఓ స్కూల్‌లో జరిగిన ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ఇస్రో చేపడుతున్న ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా చంద్రయాన్-4తో చంద్రుడి నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి పైకి తేవాలని ఇస్రో భావిస్తోంది.

News April 10, 2024

మరో ఏడాదిలో మనుషుల కంటే స్మార్ట్‌గా ఏఐ: మస్క్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో లేదా రెండేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందన్నారు. అయితే ఏఐకి అబద్ధం చెప్పడం నేర్పించకూడదని ఒకసారి దానికి అది అలవాటు పడితే ఇక ఆపడం చాలా కష్టం అవుతుందని హెచ్చరించారు. ట్రైనింగ్ చిప్స్‌ కొరత, విద్యుత్ డిమాండ్ AIకి సవాల్‌గా మారుతాయనే టాక్ నడుస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

News April 10, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 10, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:50
సూర్యోదయం: ఉదయం గం.6:04
జొహర్: మధ్యాహ్నం గం.12:17
అసర్: సాయంత్రం గం.4:43
మఘ్రిబ్: సాయంత్రం గం.6:31
ఇష: రాత్రి గం.07.45
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.