India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమ్మర్‌లో ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని పండ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తింటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. దోసకాయ తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీరు తీసుకుంటే డీహైడ్రేషన్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అలాగే టమాటాలు, బూడిదగుమ్మడి, నారింజ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్స్ తినాలి.
AP: వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. వైసీపీ, టీడీపీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. రెండు పార్టీలకూ సమాన దూరం పాటిస్తానన్నారు. చీరాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న టర్కీ, తాజాగా ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షల్ని విధించింది. సిమెంట్, ఉక్కు సహా 54 ఉత్పత్తులపై నేటి నుంచి ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి, పాలస్తీనావాసులకు సహాయాన్ని వెళ్లనిచ్చేవరకూ వీటిని సడలించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఒక ఉగ్రదేశంలా మారిందంటూ టర్కీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
AP: ఎన్నికల వేళ YCPకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన త్వరలో YCPకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో TDPలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే డొక్కా ప్రస్తుతం తటస్థంగా ఉన్నారని, ఏ పార్టీ వైపు చూడట్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈయన 2004, 2009లో తాడికొండ MLAగా గెలిచారు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్నట్లు ఓలా క్యాబ్స్ ప్రకటించింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఓలా సేవలు ఈనెలాఖరుతో ముగియనున్నట్లు తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో పర్సనల్ వెహికల్స్‌కే పరిమితం కాకుండా క్యాబ్ సేవలకూ విస్తరిస్తాయి. భారత్‌లో మార్కెట్ విస్తరణకు మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే దీనిపై దృష్టిపెట్టాలని నిర్ణయించాం’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
AP CS జవహర్‌రెడ్డిపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి NDA కూటమి ఫిర్యాదు చేసింది. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని కూటమి నేతలు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. వాలంటీర్లను పక్కనపెట్టి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలన్న EC ఆదేశాలు పాటించకపోవడంతో 33 మంది మరణించారన్నారు. కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని YCP ప్రచారం చేసిందని వివరించారు.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. నిన్న నిజామాబాద్‌లో వర్షాలు కురిశాయి.
తప్పుడు ప్రచారంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దిగజార్చారని MLC కవిత లేఖలో పేర్కొన్నారు. తన మొబైల్ నంబర్‌ను మీడియాలో ప్రసారం చేసి ప్రైవసీకి భంగం కలిగించారన్నారు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరయ్యానని.. అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు. BJPలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంటులో విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే EDని పంపుతామని BJP నేతలన్నారని తెలిపారు.
AP: ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలి. రైతులకు మేలు జరగాలి’ అని ఆకాంక్షించారు.
TG: ఎన్నికల కోడ్ ఉల్లంఘించి BRS మీటింగ్‌లో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్సన్ వేటు పడింది. వీరిలో 38 మంది సెర్ప్, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నెల 7న సిద్దిపేటలో ఉద్యోగులతో స్థానిక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ విషయం ఇటీవల బహిర్గతం కావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
Sorry, no posts matched your criteria.