news

News April 8, 2024

కవిత బెయిల్ పిటిషన్ విచారణ తేదీ మార్పు

image

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ తేదీలో మార్పు చోటు చేసుకుంది. మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో సాధారణ బెయిల్‌పై విచారణ త్వరగా చేయాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ఈనెల 20న జరగాల్సిన విచారణను 16కు కోర్టు వాయిదా వేసింది.

News April 8, 2024

టీడీపీలోనే కొనసాగుతా: మహాసేన రాజేశ్

image

టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ట్విటర్ వేదికగా మహాసేన రాజేశ్ ప్రకటించారు. ‘అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నామీద నమ్మకముంచిన చంద్రబాబుకి ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరొక 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని ఆయన కోరారు. అందుకు మహాసేన కూడా సిద్ధం’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

News April 8, 2024

IPL: టాస్ గెలిచిన చెన్నై

image

ఐపీఎల్‌లో ఈరోజు తమ హోం గ్రౌండ్‌లో కోల్‌కతాతో చెన్నై తలపడుతోంది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై చివరిగా ఆడిన రెండు మ్యాచులూ ఓడిపోవడం గమనార్హం.

చెన్నై: రుతురాజ్, రచిన్, రహానే, మిచెల్, రిజ్వీ, జడేజా, ధోనీ, తీక్షణ, ముస్తాఫిజుర్, శార్దూల్, దేశ్‌పాండే

కోల్‌కతా: సాల్ట్, నరైన్, వెంకటేశ్, శ్రేయస్, రఘువంశీ, రస్సెల్, రింకూ, రమణ్‌దీప్, స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

News April 8, 2024

రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు

image

TG: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంకితభావం, సేవతో మెరుగైన భవిష్యత్తుకు కట్టుబడి ఉందామని గవర్నర్ పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలకు శుభం కలగాలని రేవంత్ ఆకాంక్షించారు. సమృద్ధిగా వానలు కురిసి, రైతులు ఆనందంగా ఉండాలన్నారు.

News April 8, 2024

ఆఫీసులో ఓ కునుకు తీస్తున్నారా?

image

చాలా మంది ఉద్యోగులకు మధ్యాహ్నం అయ్యే సరికి చిన్న కునుకు తీస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇది మంచిదే అంటున్నారు పరిశోధకులు. తరచూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోయే వారి మెదడు మిగతా వారితో పోలిస్తే చురుకుగా పనిచేస్తుందట. అంతేకాదు వీరికి 6.5 ఏళ్లు ఆలస్యంగా వృద్ధాప్యం వస్తుందట. క్రియేటివిటీ పెరిగి, మెరుగైన పనితీరు కనబరిచే అవకాశాలు ఎక్కువ ఉండటంతో పలు ఆఫీసులు స్లీప్ టైమ్‌ను కూడా కేటాయిస్తున్నాయి.

News April 8, 2024

BREAKING: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

TG: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఉగాది పండగ సందర్భంగా ప్రయాణ రాయితీల రద్దుపై నిర్ణయాన్ని మెట్రో అధికారులు వెనక్కి తీసుకున్నారు. హాలీడే కార్డు, మెట్రో స్టూడెంట్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ కార్డులను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం ఈ కార్డులను మెట్రో రద్దు చేయగా.. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే.

News April 8, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడి‌గా ఉన్న ప్రణీత్ రావు SIB సేకరించిన పాత డేటాను ధ్వంసం చేసినట్లు సమాచారం. దాదాపు 4 దశాబ్దాల కీలక నిఘా డేటాను ధ్వంసం చేసి మూసీలో వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో ప్రణీత్ రావు గ్యాంగ్ 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

News April 8, 2024

తమ్ముడి లక్ష్యం కోసం నేను సైతం: చిరంజీవి

image

జనసేన పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించా’ అని పేర్కొన్నారు.

News April 8, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోగా.. కేవలం 20 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు.

News April 8, 2024

రతన్ టాటా మాటలు తనను మార్చేశాయన్న మయాంక్.. కానీ..!

image

లక్నో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరలవుతోంది. రతన్ టాటా చెప్పిన ఓ సూక్తి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన తెలిపారు. ‘సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలను సరైన నిర్ణయాలుగా మార్చుతా’ అని రతన్ టాటా చెప్పినట్లు మయాంక్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని టాటా గతంలో క్లారిటీ ఇచ్చారు.