news

News April 7, 2024

పుష్ప-2 నుంచి క్రేజీ అప్‌డేట్

image

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. రేపు ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రేపు టీజర్ విడుదల టైమ్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 11.07 గంటలకు పుష్పరాజ్ వస్తాడని పేర్కొన్నారు. దీంతో పుష్ప-2 టీజర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న టీజర్ నెట్టింట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

News April 7, 2024

KL రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు: సిద్ధు

image

టీమ్ ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటి వాడని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నారు. ‘రాహుల్‌ను ఏ స్థానంలోనైనా ఆడించవచ్చు. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా ఉపయోగించుకోవచ్చు. అతడిలో తప్ప మరెవరిలోనూ ఈ సత్తా లేదు. అతడో బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలాంటి వారు ప్రస్తుతం ప్రపంచంలో ఎవరూ లేరు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News April 7, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

News April 7, 2024

హాట్ సమ్మర్‌లో కూల్ కాటన్

image

వేసవిలో కారిపోతున్న చెమటలు, ఉక్కపోత చికాకు పెట్టిస్తుంటాయి. మధ్యాహ్న సమయంలో బయట అడుగు పెట్టాలన్నా, ప్రయాణాలు చేయడమంటే సాహసమే. ఇలాంటి సందర్భాల్లో ఎండ నుంచి తట్టుకునేందుకు కాటన్‌ దుస్తులు ధరించాలని పెద్దలు చెబుతున్నారు. ఇవి ఒంటిపై చెమటను పీల్చి, చల్లదనాన్ని అందిస్తాయి. అయితే ప్యూర్‌ కాటన్‌ వస్త్రాలు మాత్రమే వాడటం మంచిదట. ఇక వేసవిలో డార్క్, బ్లాక్ కలర్ డ్రెస్సులు వాడకపోవమే మంచిది.

News April 7, 2024

బెదరగొట్టేలా ముంబై లైనప్.. కానీ..!

image

ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్‌లో ఢిల్లీతో ముంబై తలపడుతోంది. సూర్యకుమార్ సహా రోహిత్, ఇషాన్, తిలక్, పాండ్య, డేవిడ్, నబీ, షెపర్డ్‌తో కూడిన ముంబై బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే, ఇలాంటి లైనప్‌తోనే ముంబై పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉండటం గమనార్హం. క్రికెట్‌ను టీమ్ గేమ్ అనేది ఇందుకేనని, స్టార్లు ఎంతమంది ఉన్నా కలసికట్టుగా ఆడితేనే గెలుపు సాధ్యమని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

News April 7, 2024

డబ్బుల కోసం పవన్ డాన్సులు: అంబటి

image

డబ్బుల కోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డాన్సులు వేస్తున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘చంద్రబాబు ఓ పొలిటికల్ డాన్సర్. అన్ని పార్టీలతోనూ ఆయన స్టెప్పులు వేస్తారు. డబ్బుల కోసం పవన్ కూడా డాన్స్ వేస్తున్నారు. చంద్రబాబును నేను విమర్శించాను తప్ప తిట్టలేదు. తిట్టినవారంతా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. కేవలం బాబు అసమర్థత వల్లే పోలవరం పూర్తికాలేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

News April 7, 2024

తల్లయిన హీరోయిన్ ఆర్తి చబ్రియా

image

హీరోయిన్ ఆర్తి చబ్రియా 41 ఏళ్ల వయసులో తల్లి అయ్యారు. గత నెల 4న బాబుకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపారు. బాబుకు యువాన్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. గతంలో తాను ప్రెగ్నెన్సీని కోల్పోయానని, అందుకే ఈసారి బాబు పుట్టే వరకు ఈ విషయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆమె 2019లో చార్టెడ్ అకౌంటెంట్ విశారద్‌ను పెళ్లాడారు. ఆర్తి తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి వంటి సినిమాల్లో నటించారు.

News April 7, 2024

ఆప్ నేతల సామూహిక నిరాహార దీక్షలు

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు ఇవాళ జంతర్‌మంతర్ వేదికగా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. అమెరికాలోని హార్వర్డ్ స్క్వేర్, హాలీవుడ్ సైన్, భారత రాయబార కార్యాలయం, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, లండన్, మెల్‌బోర్న్‌లోనూ తమ మద్దతుదారులు దీక్షలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

News April 7, 2024

సుశాంత్ సింగ్ ఇంటిని నేను కొనలేదు: ఆదా శర్మ

image

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని తాను కొనుగోలు చేసినట్లు వస్తోన్న వార్తలను హీరోయిన్ ఆదా శర్మ ఖండించారు. ‘నేను ఆయన ఇంటిని కొనలేదు. కేవలం చూడటానికే అక్కడికి వెళ్లాను. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రస్తుతం నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అందుకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

News April 7, 2024

సుజనా చరిత్రను బయటపెడతా: కేశినేని నాని

image

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చరిత్రను బయటపెడతానని కేశినేని నాని హెచ్చరించారు. ‘సుజనా పదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్నా విజయవాడ కోసం రూపాయైనా ఖర్చుపెట్టారా? ఏ అర్హత ఉందని పోటీ చేస్తున్నారు? అతడి చరిత్రను బయటపెడతా. నా సవాలును స్వీకరించేందుకు సుజనా సిద్ధమా?’ అని ప్రశ్నించారు. కాగా.. విజయవాడకు నాని ఏం చేశారంటూ కేశినేని చిన్ని విమర్శించారు. తాను బయటపెట్టిన నాని చరిత్రపై ఆయన జవాబివ్వాలని డిమాండ్ చేశారు.