news

News April 7, 2024

వివాదంలో మంత్రి పొంగులేటి కుమారుడు!

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఖరీదైన ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్‌ వాచ్‌లను ఆయన స్మగ్లర్ ముబిన్ ద్వారా తెప్పించినట్లు సమాచారం. ఒక్కో వాచ్ విలువ ₹1.75 కోట్లు ఉంటుందట. అతడిని చెన్నై కస్టమ్స్ అధికారులు ప్రశ్నించడంతో హర్షారెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో APR 4న విచారణకు రావాలని ఆదేశించగా, తాను 27వ తేదీన హాజరవుతానని రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది.

News April 7, 2024

BIG BREAKING: సీఎం జగన్‌కు ఈసీ నోటీసులు

image

AP: సీఎం జగన్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ చేసిన ఫిర్యాదుతో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్‌కు సీఈవో మీనా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 3న పూతలపట్టు సిద్ధం సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

News April 7, 2024

టాస్ గెలిచిన ఢిల్లీ.. టీమ్‌లోకి కొత్త ప్లేయర్లు

image

ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ ప్లేయర్లు రిచర్డ్‌సన్, కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు.
MI: రోహిత్, కిషన్, సూర్య, తిలక్, హార్దిక్, డేవిడ్, నబీ, షెపర్డ్, చావ్లా, కోయెట్జీ, బుమ్రా
DC: వార్నర్, పృథ్వీ, అభిషేక్, పంత్, స్టబ్స్, అక్షర్, లలిత్ యాదవ్, రిచర్డ్‌సన్, నార్ట్జే, ఇషాంత్, ఖలీల్

News April 7, 2024

మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం: లోకేశ్

image

AP: పాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చెప్పారు. బైక్ మెకానిక్‌లు, కార్మికులతో మాట్లాడుతూ.. ‘జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులే. పనుల్లేక వందల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మేం అధికారంలోకి రాగానే మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. బైక్ మెకానిక్‌లకు అధునాతన వాహనాలపై శిక్షణ ఇప్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

News April 7, 2024

ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే అనర్హులు అయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెప్పారు. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించారు. తాజాగా మరో ఎమ్మెల్యేకి కాంగ్రెస్ కండువా కప్పారు. ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News April 7, 2024

ELECTIONS: ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చంటే?

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రూ.49వేలకు మించి డబ్బులు తీసుకెళ్తే పోలీసులు సీజ్ చేస్తారు. అలాగే ఒక తులం బంగారం వరకు తీసుకెళ్లొచ్చు. వీటికి మించితే సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఉండాలి. లేదంటే డబ్బు/బంగారం స్వాధీనం చేసుకుని, ఎన్నికలు ముగిశాక తిరిగి అందిస్తారు. ఒకవేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలితే సంబంధిత వ్యక్తిపై FIR నమోదు చేస్తారు.

News April 7, 2024

HEART BREAKING PHOTO.. పాపం విరాట్ కోహ్లీ

image

IPL: RRతో ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ దిగాలుగా కూర్చొని ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. జట్టు కోసం సెంచరీ చేసినా కోహ్లీ శ్రమ వృథా అయింది. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడం, బౌలర్లు తేలిపోవడంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది. కోహ్లీని ఇలా చూడలేకపోతున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 7, 2024

నా కుటుంబసభ్యులందరి ఫోన్లను ట్యాప్ చేశారు: ఈటల

image

TG: ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి బాధితుడిని తానేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తన కుటుంబసభ్యులందరి ఫోన్లు ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్ర చర్చ జరగాలని, మళ్లీ జరగకుండా చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

News April 7, 2024

మేనమామపై వైఎస్ షర్మిల ఆగ్రహం

image

AP: తన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ‘అవినాశ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటానికి సిగ్గు లేదా? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చింది’ అని మండిపడ్డారు. తెలంగాణలో KCRను ఓడించానని, ఏపీలో పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చానని షర్మిల వ్యాఖ్యానించారు.

News April 7, 2024

రోహిత్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

image

రోహిత్ శర్మ మైదానంలో అలవోకగా సిక్సర్లు బాది విధ్వంసం సృష్టిస్తారు. దీని వెనుక అతడి ఫిట్‌నెస్ పాత్ర ఎంతో ఉంది. రోహిత్ కచ్చితంగా డైట్ పాలో అవుతారు. ఉదయాన్నే గుడ్లు, ఓట్స్, పండ్లు తీసుకుంటారు. మధ్యాహ్నం బ్రౌన్ రైస్, చికెన్, వెజిటబుల్స్ తింటారు. రాత్రి పూట గ్రిల్డ్ ఫిష్, సలాడ్, బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకుంటారు. కాగా రోహిత్ శాకాహార కుటుంబంలో జన్మించినా.. ఫిట్‌గా ఉండేందుకు నాన్‌వెజ్ తీసుకోక తప్పట్లేదు.