news

News October 29, 2024

English Learning: Antonyms

image

✒ Alien× Native, Resident
✒ Ascend× Descend, Decline
✒ Alleviate× Aggravate, Enhance
✒ Allure× Repulse, Repel
✒ Arraign× Exculpate, Pardon
✒ Amplify× Lessen, Contract
✒ Axiom× Absurdity, Blunder
✒ Audacity× Mildness, Cowardice
✒ Authentic× Fictitious, unreal

News October 29, 2024

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ అణుబాంబుల తయారీ: నెతన్యాహూ

image

తమను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేయనుందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తాజాగా ఆరోపించారు. వాటిలో దీర్ఘ పరిధి క్షిపణులు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఇరాన్ మొత్తం ప్రపంచాన్ని బెదిరించే స్థాయికి చేరుకుంటోంది. ఆ దేశ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మా ప్రథమ లక్ష్యం. మా చర్యల గురించి ఇప్పుడే వెల్లడించలేను’ అని పేర్కొన్నారు.

News October 29, 2024

విద్యుత్ ఛార్జీల పెంపునకు వైసీపీ విధానాలే కారణం: అనగాని

image

AP: వైసీపీ నాయకులు కేసులు, బెయిల్ కోసం ఢిల్లీ వెళ్లేవారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ ‘రీసర్వే పూర్తయ్యాక జిల్లాల పునర్విభజనపై దృష్టిసారిస్తాం. పార్టీలో అర్హులైన వారికి త్వరలో నామినేటెడ్ పదవులు వస్తాయి’ అని తెలిపారు.

News October 29, 2024

సుమతీ నీతి పద్యం.. తాత్పర్యం

image

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
తాత్పర్యం: పాముకు తలలో విషం ఉంటుంది. తేలుకు తోకలో విషం ఉంటుంది. కానీ దుర్మార్గుడైన మనిషికి తల, పాదం అనే తేడా లేకుండా శరీరమంతా విషం ఉంటుంది.

News October 29, 2024

స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు మద్దతు: అదానీ గ్రూప్

image

AP: సీఎం చంద్రబాబుతో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ MD రాజేష్‌ అదానీ, అదానీ పోర్ట్స్‌ సెజ్‌ MD కరణ్‌ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఓడరేవులు, మైనింగ్‌, రింగ్‌రోడ్డు, IT, AI, టూరిజం రంగాల్లో గల అవకాశాలను సీఎంకు వివరించారు. అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని, స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

News October 29, 2024

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఇదే..?

image

‘విశ్వంభర’తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నెక్స్ట్ ఓ సందేశాత్మక కథను తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ కోవకు చెందిన ఠాగూర్, శంకర్‌దాదా, స్టాలిన్ వంటి సినిమాల్ని చిరు గతంలో చేశారు. ఇప్పుడు అలాంటి మరో కథను రైటర్ బీవీఎస్ రవి సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్‌ రాజా ఈ మూవీని డైరెక్ట్ చేయొచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

News October 29, 2024

అక్టోబర్ 29: చరిత్రలో ఈరోజు

image

✒ 1899: కవి, సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
✒ 1940: రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
✒ 1961: నిర్మాత, నటుడు నాగబాబు జననం
✒ 1971: ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ జననం
✒ 1976: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ జననం
✒ 1985: బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగర్ జననం
✒ 1986: హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ జననం

News October 29, 2024

త‌ల్లిదండ్రుల‌కు త‌లకొరివి పెట్ట‌ని దుర్మార్గుడు చంద్రబాబు: YCP

image

AP: జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లికీ వద్దని TDP చేసిన <<14477090>>విమర్శలపై<<>> వైసీపీ ఘాటుగా స్పందించింది. ‘క‌నిపెంచిన త‌ల్లిదండ్రుల‌కు త‌ల కొరివి పెట్ట‌ని దుర్మార్గుడు చంద్రబాబు. మామ‌కే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న నికృష్టుడు. సొంత త‌మ్ముడిని ఓడించాల‌ని కుట్ర‌లు చేసిన ఈ అప్రాచ్యుడు ఇప్పుడు నీతులు చెబుతున్నారు’ అని Xలో ఫైరయ్యింది. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసింది.

News October 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 29, 2024

నార్త్ కొరియా 10వేల సైనికుల్ని రష్యాకు పంపింది: అమెరికా

image

10వేలమంది ఉత్తర కొరియా సైనికులు రష్యాలో శిక్షణ పొందుతున్నారని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. ఉక్రెయిన్ సమీపంలోని రష్యా యుద్ధ శిబిరాల్లో ఉంటున్నారని పేర్కొంది. ‘నార్త్ కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధం చేసే అవకాశం ఉంది. మున్ముందు సంఖ్య మరింత పెరగొచ్చు. ప్రతిగా రష్యా నుంచి సైనిక సాంకేతికతను కొరియా పొందుతోంది. ఆ దేశపు బలగాలు రావడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచే ప్రమాదం ఉంది’ అని స్పష్టం చేసింది.