news

News October 29, 2024

మంగళగిరిలో ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష

image

AP: వైద్యరంగంలో సరికొత్త సేవలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్ సేవలను ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి 12KM దూరంలోని నూతక్కి PHCకి డ్రోన్‌ని పంపారు. అక్కడ మహిళా రోగి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి తిరిగొచ్చింది. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల వాడకంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 11 చోట్ల ఈ సేవలను పరీక్షించారు.

News October 29, 2024

CO2ను O2గా మార్చే కృత్రిమ ఆకు!

image

చెట్లు ఆక్సిజన్‌ను అందించి, కార్బన్‌డయాక్సైడ్‌ను స్వీకరిస్తుంటాయన్న విషయం తెలిసిందే. అయితే, కృత్రిమంగా అభివృద్ధి చేసిన ఆకులు నిజమైన వాటికంటే పది రెట్లు అధికంగా CO2ను గ్రహించాయి. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీటిని రూపొందించారు. ఈ ఆకులోని ప్రత్యేకమైన పొర లోపల ఉన్న సాంకేతికత నీటి రూపంలో CO2ను గ్రహించి దీనిని ఆక్సిజన్‌గా మార్చుతుంది. ప్రస్తుతం ఇవి ప్రయోగదశలో ఉన్నాయి.

News October 29, 2024

రుణమాఫీ చేయకుండా నన్ను రాజీనామా చేయమంటున్నారు: హరీశ్

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా తనను రాజీనామా చేయమంటున్నారని BRS MLA హరీశ్‌రావు అన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రేవంత్ వచ్చాక పాత పథకాలు ఆపేశారని, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన గుర్తు హరీశ్ చేశారు.

News October 29, 2024

వారంతా ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి: PM

image

దేశంలో 70ఏళ్లు దాటిన వారంతా ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్డుతో వృద్ధులంతా ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చన్నారు. ఢిల్లీ, బెంగాల్‌ వంటి కొన్ని రాష్ట్రాలకు ఆయుష్మాన్ సేవలు అందడం లేదని, ఆయా రాష్ట్రాల వైఖరి వృద్ధులకు శాపంగా మారిందన్నారు. ఆ రాష్ట్రాల రాజకీయాల కారణంగా లబ్ధి పొందలేని వృద్ధులకు మోదీ క్షమాపణలు చెప్పారు.

News October 29, 2024

రేపు తెలంగాణ వ్యాప్తంగా BRS సంబరాలు

image

TG: రేపు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేయాలని BRS నిర్ణయించింది. తెలంగాణ ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపినందుకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని పిలుపునిచ్చింది. తాము ఈఆర్సీని ఒప్పించడం వల్లే డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించిందని BRS నేతలు అంటున్నారు.

News October 29, 2024

MICROSOFT, GOOGLE డిష్యూం.. డిష్యూం

image

ప్రపంచంలోనే 2 అతిపెద్ద టెక్ కంపెనీలు బహిరంగ విమర్శలకు దిగాయి. తమ క్లౌడ్ బిజినెస్ Azureను దెబ్బకొట్టేందుకు గూగుల్ షాడో క్యాంపెయిన్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఇందుకు ఓ యూరోపియన్ లాబీయింగ్ టీమ్‌తో జట్టు కట్టినట్టు తెలిపింది. సెప్టెంబర్లో EU రెగ్యులేటర్స్ వద్ద మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ యాంటీట్రస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. అక్రమ లైసెన్సింగ్ ప్రాక్టీసెస్ చేస్తోందని ఆరోపించింది. ఇది అగ్గి రాజేసింది.

News October 29, 2024

జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదు: జగదీశ్ రెడ్డి

image

TG: ప్రభుత్వ తీరుతో ఇంట్లో దావత్ చేసుకోవాలన్నా ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తమను జైల్లో పెట్టినా ప్రశ్నించడం ఆగదని మండిపడ్డారు. కేసీఆర్, మా ఇంటి మీద బాంబులు వేసి చంపుతారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంతో కొట్లాడి విద్యుత్ బాంబును ఆపేశామన్నారు. రోడ్ల ప్రైవేటైజేషన్ బాంబును కూడా ఆపి, ప్రజలను రక్షిస్తామని చెప్పారు.

News October 29, 2024

శిల్పాశెట్టి రెస్టారెంట్లో రూ.80లక్షల కారు చోరీ

image

బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన రెస్టారెంట్‌లో ఖరీదైన కారు మాయం కావడం చర్చనీయాంశమైంది. ముంబైలో దాదర్ వెస్ట్‌లోని కోహినూర్ స్క్వేర్‌ 48వ అంతస్తులో ఉన్న బాస్టియన్ ఎట్ ది టాప్ రెస్టారెంట్‌కు ఓ కస్టమర్ వచ్చారు. రూ.80లక్షల ఖరీదైన BMW Z4 కారును పార్క్ చేయమని రెస్టారెంట్ సిబ్బందికి కీస్ ఇచ్చారు. 1amకి భోజనం చేసి వచ్చేలోపు ఆ కారు మాయమైంది. ఇద్దరు దుండగులు కారు ఎత్తుకెళ్లినట్లు CCTV ఫుటేజ్‌లో తేలింది.

News October 29, 2024

బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తాం: బండి సంజయ్

image

TG: బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫామ్ హౌస్ పార్టీ కేసులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు. బీఆర్ఎస్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను ఇబ్బంది పెడితే కాంగ్రెస్‌ను వేటాడుతామని హెచ్చరించారు.

News October 29, 2024

షరియత్ కౌన్సిల్ విడాకుల సర్టిఫికెట్ ఇవ్వడం షాకింగ్: మద్రాస్ హైకోర్టు

image

షరియత్ కౌన్సిల్ ప్రైవేటు సంస్థ అని, అది మంజూరు చేసే విడాకులు చెల్లవని మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ తెలిపింది. వారు విడాకుల సర్టిఫికెట్ ఇవ్వడం షాకింగ్‌గా ఉందంది. అక్కడ ట్రిపుల్ తలాక్ చెప్పినప్పటికీ వివాహం మనుగడలో ఉన్నట్టేనని స్పష్టం చేసింది. తలాక్‌ను అంగీకరించని భార్యకు రూ.5L పరిహారం, నెలకు రూ.25వేలు చెల్లించాలని తిరునెల్వేలి కోర్టు 2021లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టుకు వెళ్లారు.