news

News September 5, 2024

గూగుల్ మ్యాప్స్ కంటే ముందే యాప్ కనుగొన్న ఇండియన్ కపుల్!

image

తెలియని ప్రాంతానికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం. ఇది 2005లో అందుబాటులోకి రాగా అంతకుముందే 1995లో భారతీయ జంట రాకేశ్ వర్మ, రష్మీ వర్మ ‘మ్యాప్ మై ఇండియా’ను స్థాపించారు. అప్పట్లో టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉండటంతో ఇబ్బందిపడ్డారు. 7,268 నగరాల్లో స్ట్రీట్ లెవెల్‌లో మ్యాపింగ్ చేశారు. 2.20M KMS రహదారి మ్యాపింగ్‌ను లింక్ చేశారు. ఇందులో 3D మ్యాప్స్, GIS మ్యాప్‌, రియల్ టైమ్ ట్రాఫిక్ చూడొచ్చు.

News September 5, 2024

ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు: Dy.CM పవన్

image

AP: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా Dy.CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘సమున్నత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పాత్ర అనిర్వచనీయం. దేశానికి జ్ఞాన సంపన్నులైన, అంకితభావం కలిగిన యువతను అందించేందుకు పాఠశాల, కళాశాల దశల నుంచే బోధన బాధ్యతల్లో ఉన్నవారు తపిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుల గౌరవమర్యాదలను ఈ ప్రభుత్వం కాపాడుతుంది’ అని ప్రకటన విడుదల చేశారు.

News September 5, 2024

ఇతర ఇండస్ట్రీల వారెందుకు విరాళమివ్వట్లేదని నెటిజన్లు ఫైర్

image

భారీ వర్షాలకు తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టాలీవుడ్ నటులు తోచిన సాయం చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రం నోరు మెదపట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా కేరళలో వరదలొస్తే చిరు, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర టాలీవుడ్ నటులు రూ.కోట్లు సాయం ఇచ్చారని, కర్ణాటక, తమిళనాడులో ఏం జరిగినా మనోళ్లు ముందుంటారని ట్వీట్స్ చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాలకు జరిగినప్పుడు ఎవరూ ఇవ్వట్లేదని ఫైరవుతున్నారు. మీరేమంటారు?

News September 5, 2024

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బిగ్ షాక్

image

కెనడా PM జస్టిన్ ట్రూడోకు భారీ షాక్. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడింది. జగ్మీత్ సింగ్ నాయకత్వంలోని న్యూడెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం. ‘సాధారణ ప్రజల్ని లిబరల్స్ పట్టించుకోవడం లేదు. వారికి దక్కాల్సిన ప్రయోజనాలను జస్టిన్ ట్రూడో కార్పొరేట్లకు మళ్లిస్తున్నారు. మరోసారి అధికారానికి వారు అనర్హులు. భారీ యుద్ధం ముందుంది’ అంటూ NDP వీడియో రిలీజ్ చేసింది.

News September 5, 2024

రేపటి నుంచి వారి ఖాతాల్లో రూ.10,000

image

TG: రేపటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రూ.10వేల నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదన్నారు. వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని పది బృందాలు రంగంలోకి దిగి ఇంటింటి సర్వే చేస్తున్నాయని పేర్కొన్నారు.

News September 5, 2024

ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు చేరి..

image

AP: విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన యువకుడు చంద్రశేఖర్(32) అనంతలోకాలకు చేరాడు. ఇద్దరు సోదరులు, మరో ఇద్దరితో కలిసి అతను సింగ్ నగర్‌లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు. తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని భార్య 8 నెలల గర్భిణి.

News September 5, 2024

‘సింబా ఈజ్ కమింగ్’.. ప్రశాంత్ వర్మ క్రేజీ అప్డేట్

image

హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తాజాగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమాకు ఈయనే దర్శకత్వం వహిస్తారని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 1.33 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రశాంత్ ట్వీట్ చేశారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అని ట్యాగ్ ఇచ్చారు. దీంతో మోక్షజ్ఞతో సినిమా గురించే ఈ అప్డేటా అని సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

News September 5, 2024

Record: 9 దేశాల జనాభాను దాటేసిన డీమ్యాట్లు

image

దేశంలో డీమ్యాట్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారిగా 17.11 కోట్లు దాటేసింది. ఆగస్టులో కొత్తగా 42.3 లక్షల ఖాతాలు తెరవడంతో ఇది సాధ్యమైంది. భారత్‌లోని మొత్తం డీమ్యాట్ల సంఖ్య బంగ్లాదేశ్ జనాభాకు దాదాపు సమానం. రష్యా, ఇథియోపియా, మెక్సికో, జపాన్ సహా 9 దేశాల జనాభా కన్నా ఎక్కువ. సరళమైన e-KYC రూల్స్, బుల్‌రన్, స్టాక్ మార్కెట్లపై పెరిగిన అవగాహన, రిటైల్ పార్టిసిపేషన్, పెట్టుబడికి భద్రత ఇందుకు కారణాలు.

News September 5, 2024

విజయ్ ‘ది గోట్’ మూవీ రివ్యూ & రేటింగ్

image

అనుకోని పరిస్థితుల్లో శత్రువులుగా మారిన తండ్రీ కొడుకుల కథే ‘ది గోట్’. విజయ్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు, కామెడీ, జయం రవి, ప్రశాంత్, ప్రభుదేవా పాత్రలు సినిమాకు ప్లస్. హీరోయిన్ మీనాక్షి చౌదరీ గ్లామర్ షోకే పరిమితమయ్యారు. సినిమా సాగదీతగా ఉండటం, ఎలివేషన్లు లేకపోవడం, ఊహించే సీన్లు, మ్యూజిక్ మైనస్.
రేటింగ్: 2.5/5

News September 5, 2024

పన్ను చెల్లింపుల్లోనూ ‘కింగే’

image

దేశంలోని సినీ స్టార్లలో FY24కు గాను అత్యధిక ట్యాక్స్(₹92 కోట్లు) చెల్లించిన వ్యక్తిగా కింగ్‌ఖాన్ షారుఖ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దళపతి విజయ్(₹80కోట్లు), సల్మాన్ ఖాన్(₹75కోట్లు), అమితాబ్ బచ్చన్(₹71కోట్లు), అజయ్ దేవగణ్(₹42కోట్లు), రణ్‌బీర్ కపూర్(₹36కోట్లు), హృతిక్ రోషన్(₹28కోట్లు), కపిల్ శర్మ(₹26కోట్లు), కరీనా కపూర్(₹20కోట్లు), మోహన్ లాల్(₹14కోట్లు), అల్లు అర్జున్(₹14కోట్లు) ఉన్నారు.