news

News September 5, 2024

నేటి నుంచి దులీప్ ట్రోఫీ మ్యాచులు

image

దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ పోరు నేటి నుంచి జరగనుంది. తొలి రౌండ్‌లో భాగంగా ఇండియా-C, ఇండియా-D అనంతపురంలో, ఇండియా-A, ఇండియా-B బెంగళూరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ప్లేయర్లను సెలక్ట్ చేసే ఛాన్సుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా మినహా యువ ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో ఆడనున్నారు. పలువురు గాయాల కారణంగా తొలి రౌండ్‌కు దూరమయ్యారు.

News September 5, 2024

‘దేవర’ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

image

ఈనెల 27న విడుదల కాబోతున్న Jr.NTR దేవర మూవీ రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యి, సెన్సార్‌కు సబ్మిట్ చేసే ముందు నిడివి తగ్గొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ ఉండొచ్చని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘దావూదీ’ పాటకు మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

News September 5, 2024

ఏసీకి అతిగా అలవాటు పడ్డారా?

image

ఏసీకి అతిగా అలవాటుపడితే అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీని అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అతిగా వాడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, తల తిరగడం, చర్మం పొడిబారడం, మెదడు కణాలు బలహీనపడటం, అలెర్జిక్ రినైటిస్‌, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.

News September 5, 2024

పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం: CM

image

AP: వరద ప్రాంత ప్రజల కోసం భారీ <<14019137>>విరాళం<<>> ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు అభినందించారు. ‘సీఎం సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణకు మరో రూ.కోటి ఇవ్వడం పవన్ కళ్యాణ్‌ విశాల హృదయానికి అద్దం పడుతోంది. ఆయన సమాజంలో ఎందరికో స్ఫూర్తి. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు’ అని ట్వీట్ చేశారు.

News September 5, 2024

దులీప్ ట్రోఫీ: కిషన్, సూర్య దూరం.. సంజూకు ఛాన్స్

image

దులీప్ ట్రోఫీ స్క్వాడ్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ గాయాల కారణంగా తొలి రౌండ్ నుంచి వైదొలిగినట్లు వెల్లడించింది. కిషన్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఇండియా-డి జట్టుకు ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ క్లియర్ చేసుకుని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 4 <>జట్లు<<>> పాల్గొనే ఈ టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది.

News September 5, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 05, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు
అసర్: సాయంత్రం 4:40 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:26 గంటలకు
ఇష: రాత్రి 7.39 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 5, 2024

సెప్టెంబర్ 5: చరిత్రలో ఈరోజు

image

1888: భారత తొలి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం
1986: భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా జననం
1997: మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
2010: భారతీయ శాస్త్రవేత్త హోమీ సేత్నా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
* అంతర్జాతీయ ఛారిటీ దినోత్సవం

News September 5, 2024

పారాలింపిక్స్: చరిత్ర సృష్టించాడు

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో పోలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్‌పై 6-0 తేడాతో విజయం సాధించారు. దీంతో ఒలింపిక్స్/పారాలింపిక్స్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్‌లోనూ ఆర్చరీలో భారత్‌కు ఇప్పటివరకూ స్వర్ణ పతకం రాలేదు.

News September 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.