India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోజుకో అరటిపండు తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. సూపర్ ఫ్రూట్‌గా పిలిచే అరటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి శరీరానికి కావాల్సిన శక్తి అందేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గించి డయాబెటిస్ రోగులకు సహాయపడుతుంది. చర్మాన్ని సంరక్షించడంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
AP: రాష్ట్రంలో ఘోర విపత్తు సంభవించిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ‘ఇక్కడి ఎంపీల మద్దతుతోనే ప్రధాని అయ్యాననే సంగతి మోదీ మర్చిపోయారు. ఇంతటి విపత్తు సంభవిస్తే కనీస స్పందన లేదు. ప్రధాని స్పందించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
AP: కరకట్ట వెంబడి ఉన్న CM చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే బుడమేరు గేట్లు ఎత్తారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆ గేట్లను ఎవరు ఎత్తారని ఆయన ప్రశ్నించారు. ‘మా హయాంలో బాధితుల కోసం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం. వాలంటీర్లను ముందుగానే అప్రమత్తం చేశాం. కానీ తుఫాను వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
AP: ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి ఉంటే వరదలు తలెత్తేవి కావని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలపై సీఎం చంద్రబాబుకు కనీస కనికరం కూడా లేదని మండిపడ్డారు. విజయవాడలోని వరద బాధితులను జగన్ పరామర్శించారు. ‘వరదల ధాటికి 32 మంది మరణించారు. వీరందరి చావులకు చంద్రబాబే బాధ్యత వహించాలి. సీఎం పదవికి చంద్రబాబుకు అర్హత ఉందా? ఇంట్లో ఉండి కలెక్టరేట్‌లో ఉన్నట్లు సీఎం బిల్డప్ కొడుతున్నారు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
AP: టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి <<14017361>>కేసుల్లో <<>>వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ తమను అరెస్ట్ చేయకుండా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని వారు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు కొట్టేసింది. ఇదే కేసులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తనవంతు సాయం చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరు రూ.కోటి, పవన్ రూ.6 కోట్లు, అల్లు అర్జున్ రూ.కోటి ఇచ్చారు.
AP: రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, ప.గో, తూ.గో జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. సముద్రం తీరం వెంట 35-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
వచ్చే మూడు నెలలూ పండుగల సీజన్ కావడంతో కార్ల సంస్థలు కొత్త మోడళ్లను బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎస్‌యూవీ, ఎంపీవీ, సెడాన్ తదితర సెగ్మెంట్ల కార్లు వీటిలో ఉన్నాయి. అవి.. హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ విండ్సర్, కియా ఈవీ9, కియా కార్నివాల్, మారుతి సుజుకీ డిజైర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 ఈవీ, టాటా నెక్సాన్ సీఎన్‌జీ, బీవైడీ ఎం6, జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్.
దేశవ్యాప్తంగా 273 కిలోమీటర్ల పొడవైన 74 సొరంగ మార్గాల్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ. లక్ష కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగయ్యేందుకు ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 49 కిలోమీటర్ల పొడవైన 35 టన్నెల్స్‌ను కేంద్రం పూర్తి చేసింది. రూ.40 వేల కోట్ల విలువైన మరో 69 సొరంగాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
జర్మనీ పతనం వైపు పయనిస్తోంది. లాభాలు, అమ్మకాలు తగ్గిపోవడంతో కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. 87 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫోక్స్‌వాగన్ 3 లక్షల మంది పనిచేసే తమ ప్లాంట్లను మూసేయాలని యోచిస్తోంది. €10 బిలియన్లు ఆదా చేయాలని భావిస్తోంది. ఇంటెల్ సైతం €30 బిలియన్ల ఫ్యాక్టరీ ప్రణాళికలను ఆపేస్తున్నట్టు తెలిసింది. 2022 నుంచి జర్మనీ తయారీ రంగం మాంద్యంలోకి జారుకుంది.
Sorry, no posts matched your criteria.