news

News September 4, 2024

ఓవైపు దోపిడీ.. మరోవైపు మానవత్వం

image

AP: విజయవాడలోని పరిస్థితులు కొందరిలోని డబ్బు ఆశను, మరికొందరిలోని మానవత్వాన్ని బయటపెడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు కొందరు ప్రైవేటు బోట్ల ఓనర్లు ₹10,000-₹20,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు సత్యనారాయణపురం నుంచి రైల్వే స్టేషన్‌కు రూ.30కి బదులు ₹.200 తీసుకుంటున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు మాత్రం బాధితుల్ని ఫ్రీగా తరలిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

News September 4, 2024

బుడమేరుకు గండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన

image

AP: విజయవాడలోని బుడమేరు వాగుకు గండి పడింది. దేవీనగర్ వద్ద గండి పడటంతో నీరు గట్టుపై ఉన్న ఇళ్లల్లోకి చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

News September 4, 2024

ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

image

ఇవాళ NTR జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని స్కూళ్లకు హాలిడే ఇచ్చారు. తెలంగాణలో ఏ జిల్లాలోనూ సెలవు ఇవ్వలేదు. అయితే ఇవాళ విజయవాడ, ప.గో. తదితర ప్రాంతాలతో పాటు తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశముందని అంచనా. దీంతో స్కూళ్లకు సెలవుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

News September 4, 2024

రికార్డు.. దీప్తికి బ్రాంజ్

image

పారిస్ పారాలింపిక్స్: తెలుగు అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్ హిస్టరీలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డులకెక్కారు. నిన్న రాత్రి జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఆమెకు కాంస్య పతకం వచ్చింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మం. కల్లెడ.

News September 4, 2024

నేడు డీఎస్సీ ఫైనల్ కీ విడుదల?

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే ఛాన్సుంది. దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికివారు తెలుసుకోవచ్చు. తుది కీ విడుదలైన తర్వాత 2, 3 రోజుల్లో డీఎస్సీ మార్కులకు (80%), టెట్ మార్కులు (20%) కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు.

News September 4, 2024

రూ.5 లక్షలు విరాళమిచ్చిన అనన్య నాగళ్ల

image

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం యువ నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రూ.2.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, బాలకృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ విరాళాలు ఇచ్చారు.

News September 4, 2024

1,53,278 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 1,53,278 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయని, పంట నష్టం 4 లక్షల ఎకరాలకు పెరగొచ్చని అన్నారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు.

News September 4, 2024

అక్టోబర్ 18 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11

image

ప్రో కబడ్డీ లీగ్(PKL) సీజన్ 11 అక్టోబర్ 18న ప్రారంభం కానుంది. మొత్తం 3 వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. 18వ తేదీ నుంచి HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో, నవంబర్ 10 నుంచి నోయిడాలో, డిసెంబర్ 3 నుంచి పుణేలో మ్యాచులు నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ గేమ్స్ వేదికలు ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. గత సీజన్‌లో పుణేరి పల్టాన్ విజేతగా నిలిచింది.

News September 4, 2024

బుడమేరు వాగు గురించి తెలుసా?

image

విజయవాడలో ముంపునకు కారణమైన ‘బుడమేరు’ మైలవరం కొండల్లో పుట్టింది. ఆరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలవుతుంది. కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేస్తుంది. దీనిలో ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో నీళ్లుంటాయి. సాధారణంగా ఏటా గరిష్ఠంగా 10,000-11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుంది. ఇది చాలా మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండడంతో ఎక్కువ ప్రవాహం వస్తే నీరు గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తుంది.

News September 4, 2024

గూగుల్ క్రోమ్‌ యూజర్లకు అలర్ట్

image

డెస్క్‌టాప్ యూజర్లు గూగుల్ క్రోమ్‌ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది. క్రోమ్ బ్రౌజర్‌లో బగ్స్ ఉన్నాయని, వాటితో హ్యాకర్లు క్రోమ్‌లోని డేటాను కాపీ చేయొచ్చని తెలిపింది.
☛క్రోమ్ అప్‌డేట్ చేసేందుకు రైట్ సైడ్ టాప్‌లో ఉన్న 3 వర్టికల్ డాట్స్‌పై క్లిక్ చేసి HELPపై నొక్కాలి. తర్వాత about google chromeపై నొక్కితే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. తర్వాత రీలాంచ్‌ చేయాలి.