India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: సెప్టెంబర్ 04, బుధవారం
భాద్రపద శుద్ధ పాడ్యమి ఉ.9.47 గంటలకు,
ఉత్తర: తె.5.18 గంటలకు
వర్జ్యం: ఉ.11.17-మ.1.05 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.11.41-మ.12.31 గంటల వరకు
రాహుకాలం: మ.12.00-మ.1.30 గంటల వరకు
TG: మహబూబాబాద్‌లో పర్యటించిన సీఎం రేవంత్
* పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: రేవంత్
* అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని పర్యటిస్తారు: కిషన్ రెడ్డి
* ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి: హరీశ్ రావు
AP: బాధితులు సంయమనం పాటించాలి: సీఎం చంద్రబాబు
* సహాయక చర్యలకు ఆటంకం కలగొద్దని వరద ప్రాంతాల్లో పర్యటించలేదు: పవన్
* తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్, జగన్ విరాళాలు
బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా భారత మాజీ ఆటగాడు అజయ్ రాత్రా నియమితులయ్యారు. ప్రస్తుత మెంబర్ సలీల్ అంకోలా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని అజయ్‌తో భర్తీ చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. కాగా రాత్రా భారత్ తరఫున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడారు. అస్సాం, పంజాబ్, యూపీకి హెడ్ కోచ్‌గా పనిచేశారు.
AP: విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ రాలేదని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ‘కాలువలు, నదులు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు కడితే ఇలాంటివే జరుగుతాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ సరికొత్త లుక్‌లో మెరిశారు. చీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు చీరలో మహాలక్ష్మిలా ఉందంటూ పొగుడుతున్నారు. కాగా అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఈ లుక్‌లో కనిపించారు. ఈ ఎపిసోడ్ ఎల్లుండి ప్రసారం కానుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర ఎంతో అవసరం. ఉద్యోగ అవసరాలు, ఇతర పనుల్లో పడి చాలా మంది నిద్రను నెగ్లెక్ట్ చేస్తున్నారు. పెద్దలకు 8 గంటల నిద్ర అవసరం కాగా 5 నుంచి 6 గంటలే పడుకుంటున్నారు. దీనివల్ల స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, వీటి నుంచి బయటపడేందుకు వారాంతంలో ఓ రెండు గంటలు ఎక్కువగా పడుకోవాలని సూచిస్తున్నారు. వారంతంలో లేటుగా లేవటం మంచిదేనంటున్నారు.
మొబైల్ ఫోన్ వాడకానికి, బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని WHO అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలో వైర్‌లెస్ టెక్నాలజీ గణనీయంగా పెరిగినా బ్రెయిన్ క్యాన్సర్ల పెరుగుదల ఆ స్థాయిలో లేదంది. సుదీర్ఘంగా ఫోన్ మాట్లాడేవారు, దశాబ్దానికి పైగా మొబైల్ వాడే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. 1994 నుంచి 2022 వరకు చేసిన 63 అధ్యయనాలను 11 మంది పరిశోధకులు విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చారు.
సందర్శకులు, తాత్కాలిక నివాసితులకు కెనడా తలుపులు మూసేస్తోంది. కెనడాలో వలసదారుల వల్లే గృహాల కొరత ఏర్పడి అధిక ధరలు పలుకుతున్నట్టు స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల ముందస్తు సర్వేల్లో PM జస్టిన్ ట్రూడో లిబరల్ ప్రభుత్వం వెనుకబడినట్టు తేలింది. దీంతో తాత్కాలిక నివాసితుల్లో కొద్ది మందికి మినహా మిగిలి వారికి కెనడా నో ఎంట్రీ అంటోంది.
బ్రూనై పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రాజధాని బందర్ సేరి బెగవాన్‌లోని చారిత్రక సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. అక్కడ కొంతసేపు గడిపి మసీదు చరిత్ర వివరాల వీడియోను వీక్షించారు. అనంతరం ఇమామ్‌తో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. బ్రూనై ప్రస్తుత సుల్తాన్ హస్సనల్ బోల్కియా తండ్రి పేరు మీదుగా ఈ మసీదును 1958లో నిర్మించారు. సుల్తాన్ సైఫుద్దీన్‌ను ఆధునిక బ్రూనై రూపశిల్పిగా పరిగణిస్తారు.
ఆసక్తి ఉంటే టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మంచి అంపైర్ అవుతారని అంపైర్ అనిల్ చౌదరి అన్నారు. DRS విషయంలో ఆయన అంచనాలు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పారు. ‘ధోనీ రివ్యూలకు సానుకూల నిర్ణయాలే ఎక్కువగా వస్తాయి. సహచరులు అనవసరంగా రివ్యూలకు అప్పీల్ చేయకుండా ఆపుతారు. ధోనీకి ఆటపై ఎంతో అవగాహన ఉంది. 7 గంటలు ఆయన మైదానంలో గడిపేందుకు సిద్ధమైతే బెస్ట్ అంపైర్‌గా నిలుస్తారు’ అని అనిల్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.