news

News May 12, 2024

BREAKING: ఎల్లుండి వరకు వైన్స్‌ బంద్

image

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు రాత్రికి కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు వైన్స్‌ బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా దాన్ని ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు పొడిగించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News May 12, 2024

ఢిల్లీ 30 రన్స్‌కే 4 వికెట్లు

image

ఢిల్లీతో మ్యాచులో RCB బౌలర్లు చెలరేగుతున్నారు. 188 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన DC 30 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. వార్నర్(1), ఫ్రేజర్(21), పొరెల్(2), కుశాగ్ర(2) వెంటవెంటనే ఔటయ్యారు. RCB బౌలర్లు స్వప్నిల్, సిరాజ్, యశ్ దయాల్ తలో వికెట్ తీశారు.

News May 12, 2024

వైసీపీకి రాజీనామా.. పోలీసులకు బొత్స ఫిర్యాదు

image

AP: తాను వైసీపీకి రాజీనామా చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ లేఖ ఫేక్ అని కొట్టిపారేశారు. దీనిపై విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

News May 12, 2024

ఈ సమయంలో వెళ్తే త్వరగా ఓటేయొచ్చు

image

మనలో చాలామంది ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం క్యూలో నిలబడడానికి బద్దకం. కానీ ఉదయం 7-9 గంటల మధ్య వెళితే 10-15నిమిషాల్లో ఓటేసి వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ సమయంలో పెద్దగా లైన్లు ఉండవు. సరైన పత్రాలు తీసుకెళ్లి నేరుగా ఓటేయొచ్చు. 11గంటల తర్వాత ఎలాగూ ఎండ దంచికొడుతోంది. అందుకే 9 లోపు వెళ్లి ఓటేసి వచ్చేయండి. మరో విషయం.. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతించరు. అందుకే ఇంట్లోనే పెట్టి వెళ్లండి.

News May 12, 2024

IPLలో చెత్త రికార్డ్

image

ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ డకౌట్లతో చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(17), మ్యాక్స్‌వెల్(17), నరైన్(16), చావ్లా(16) ఉన్నారు.

News May 12, 2024

IPL: RCB స్కోర్ 187

image

ఢిల్లీతో మ్యాచులో RCB 187/9 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టులో తొలుత కోహ్లీ 27, జాక్స్ 41, పటీదార్ 52 ధాటిగా ఆడారు. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లోమ్‌రోర్(13) దినేశ్ కార్తీక్(0), స్వప్నిల్ సింగ్(0) నిరాశపరిచారు. చివర్లో కామెరూన్ గ్రీన్(32*) పర్వాలేదనిపించారు. దీంతో 200 స్కోర్ దాటుతుందనుకున్న RCB.. 187 రన్స్‌కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, రసిక్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

News May 12, 2024

సినీతారలు ఓటు వేసేది ఇక్కడే

image

TS: రేపు రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో HYDలో సినీతారలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్‌- చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్, ఉపాసన, ఓబుల్ రెడ్డి స్కూల్-జూ.NTR, ప్రణతి, జూబ్లీహిల్స్ BSNL సెంటర్- అల్లు అర్జున్, స్నేహారెడ్డి, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్-మహేశ్ బాబు, నమ్రతా, విజయ్ దేవరకొండ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌- నాగార్జున దంపతులు ఓటు వేయనున్నారు.

News May 12, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని APSDMA తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పొలాల్లో పనిచేేసే రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు 18 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది.

News May 12, 2024

పులివెందులకు చేరుకున్న సీఎం

image

AP: రేపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎం జగన్ పులివెందులలోని సొంత నివాసానికి చేరుకున్నారు. ఇవాళ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం భాకరాపురంలోని పోలింగ్ కేంద్రంలో జగన్ దంపతులు ఓటు వేయనున్నారు.

News May 12, 2024

ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థానీ నినాదాలు

image

ఎన్నికల వేళ ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థానీ నినాదాలు కనిపించడం కలకలం రేపింది. కరోల్‌భాగ్, ఝండేవాలన్ ప్రాంతాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. వెంటనే వాటిని చెరిపేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలోనూ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి నినాదాలను దుండగులు రాశారు.