India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టార్ హీరోల సినిమాల్లో ‘దేవా’ పేరు మారుమోగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్’లో ఆయన పేరు ‘దేవా’నే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘దేవర’లోనూ హీరో ‘దేవా’గా కనిపించనున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దేవా’ రోల్ పోషిస్తున్నారు. దీంతో ‘దేవా’ పేరుకు ఇంత క్రేజ్ ఏంటని నెట్టింట చర్చ జరుగుతోంది.
‘డీజే టిల్లు’ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరద బాధితుల కోసం రూ.30లక్షలు ప్రకటించారు. APకి రూ.15లక్షలు, TGకి రూ.15లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని డబ్బుతో పూడ్చలేమన్న హీరో ఏదో ఒక రూపంలో ఇది బాధితులకు ఉపయోగపడాలని ప్రార్థిస్తున్నా అన్నారు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైళ్లు చూడకుండా క్షణం గడవని పరిస్థితి. స్క్రీన్ టైమ్‌తో ఒత్తిడి పెరిగి కళ్లు అలసిపోతాయి. దీంతో తలనొప్పి, కంటిచూపు తగ్గడం, పొడిబారడం, ఎరుపెక్కడం, దురద వంటి సమస్యలు వేధిస్తాయి. అందుకే 20-20-20 సూత్రం అనురించాలని వైద్యులు చెబుతున్నారు. 20ని. స్క్రీన్ చూశాక ముఖం తిప్పుకొని 20 ఫీట్ల దూరం 20 సెకన్లు చూస్తే నేత్రాలపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. అయితే, థియేటర్లలో అదరగొడుతోన్న ఈ సినిమా మరో నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘దేవర’ విడుదల రోజే ఈనెల 27న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
TG: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో పుట్టినరోజు వేడుకలు విషాదంతో ముగిశాయి. ఐటీ సంస్థలో మేనేజర్ శ్రీకాంత్ తన బర్త్ డే సందర్భంగా 20 ఉద్యోగులతో ఓ విల్లాలో పార్టీ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో అజయ్ అనే ఉద్యోగిని సహచరులు స్విమ్మింగ్‌పూల్‌లో తోసేశారు. అతను ఈత రాదని అరుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో నీటమునిగి అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘IC-814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీసులో నెట్‌ఫ్లిక్స్ వాడిన బోలా, శంకర్ పేర్లు కోడ్‌వర్డ్స్ అని సమాచారం. విమానంలోని ప్రయాణికులకు తెలియకుండా టెర్రరిస్టులు మారు పేర్లు వాడినట్టు తెలిసింది. చీఫ్‌గా సున్నీ అహ్మద్ ఖాజీ, డాక్టర్‌గా షకీర్, బర్గర్‌గా మిస్త్రీ జహూర్, బోలాగా షాహిద్ అక్తర్, శంకర్‌గా ఇబ్రహీం అథర్ మార్చి పెట్టుకున్నారు. అసలు పేర్లను నాటి హోంమంత్రి LK అద్వానీ 2000, జనవరి 6న ప్రకటించడం గమనార్హం.
AP: రాష్ట్రంలో కుట్రలు జరుగుతున్నాయని CM చంద్రబాబు ఆరోపించారు. ‘వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఘటనను రైజ్ చేస్తారా? బుద్ధి, జ్ఞానం ఉందా? ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనపైనా విచారణ చేస్తాం. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటాం. బాబాయిని చంపి నారాసుర రక్తచరిత్ర అని రాసినవారు ఉన్నప్పుడు అనుమానాలొస్తాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై అధికారులు జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP: వైసీపీ చీఫ్ జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘విపక్ష నేత నిన్న 5 నిమిషాలు షో చేసి వెళ్లారు. ఆయన ఒక్కరికైనా భోజనం సరఫరా చేశారా? ఒక్కరినన్నా పరామర్శించారా? సపోర్ట్ చేశారా? అందుకే ఆయన్ను ఎస్కోబార్ అంటున్నా’ అని మండిపడ్డారు.
ప్రజల సెంటిమెంటును అనుసరించి ఇకపై కంటెంటును జాగ్రత్తగా సమీక్షిస్తామని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. MIB అధికారులతో ఆ సంస్థ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ సమావేశం ముగిసింది. ‘<<14001258>>IC 814: కాందహార్ హైజాక్<<>>’ వెబ్ సిరీస్‌లో టెర్రరిస్టులకు శివుడి పేర్లు బోలా, శంకర్ అని వాడటంపై ఆమెకు మినిస్ట్రీ నోటీసులు ఇచ్చింది. భారత సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, తప్పుడు కోణంలో చూపొద్దని సీరియస్ అయింది.
Sorry, no posts matched your criteria.