India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించే కుట్ర దేశంలో జరుగుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. తాండూరు జనజాతర సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. దేశప్రజల సమస్యలు వినడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. BJP పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేవీ లేవని విమర్శించారు. సామాన్య జనంపై ట్యాక్స్ పెంచి.. కార్పొరేట్లపై తగ్గిస్తున్నారని ఆరోపించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను ప్రధాని మోదీ నేర్చుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సూచించారు. మహారాష్ట్ర నందుర్బార్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రధాని గారడీ మాటలు చెబుతున్నారని.. వాటిలో ఎటువంటి దమ్ము లేదని దుయ్యబట్టారు. కోటీశ్వరులకు రక్షకుడిగా మారి ప్రధాని ఆ పదవికి అన్యాయం చేశారన్నారు.
AP: YCP మళ్లీ అధికారంలోకి రాదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని, ఆ పార్టీకి ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. కొన్ని విషయాల్లో YCP MPలు తమకు మద్దతిచ్చారని, అయినా.. CM జగన్‌ను తామెప్పుడూ మిత్రపక్షంగా భావించలేదని మోదీ చెప్పుకొచ్చారు. తాము రాజకీయ ప్రత్యర్థులమేనని స్పష్టం చేశారు. ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాల్లాగే AP అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానన్నారు.
AP: అభ్యర్థుల ఎంపికలో టీడీపీ, జనసేన సామాజిక న్యాయం పాటించాయని చంద్రబాబు చెప్పారు. చిత్తూరు సభలో మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయ జన్మ ఇచ్చిన జిల్లా ఇది. ఇక్కడి ప్రజలు 45 ఏళ్లుగా నన్ను ఆదరించి, ముందుకు నడిపించారు. చిత్తూరును అగ్రస్థానంలో పెట్టాలని జీవితాంతం పనిచేశా. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చా. అపోలో నాలెడ్జ్ సిటీని తెచ్చా. IIT, ఐసర్ సంస్థలు ఏర్పాటు చేశా’ అని తెలిపారు.
AP: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడం ఖాయమని సీఎం జగన్ చెప్పారు. TDP అధినేత గతంలో మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారన్నారు. పిఠాపురం సభలో మాట్లాడుతూ.. ‘మేం మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఈ 59 నెలల కాలంలో వివిధ పథకాలకు 130 సార్లు బటన్ నొక్కా. అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశా’ అని గుర్తు చేశారు.
AP: మంగళగిరిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్ది.. పేదరికం లేకుండా చేస్తానంటూ నారా లోకేశ్ ఆ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. ‘2019లో స్వల్ప తేడాతోనే ఓడినా.. ఆ తర్వాతి రోజు నుంచే ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యాను. ఐదేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యా. పాదయాత్రతో ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. ఈ ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి’ అని కోరారు.
ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
TG: ‘మోదీ గ్యారంటీ’ అనే బీజేపీ నినాదం నవ్వు తెప్పిస్తోందని కేటీఆర్ అన్నారు. 2014లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ‘2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేశారా? యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? బుల్లెట్ ట్రైన్స్ తీసుకొచ్చారా? నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇచ్చారా? మోదీ జీ.. మీ గ్యారంటీకి ఏమయ్యిందో దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.
తాను పలుమార్లు అడిగినా తోటి ప్లేయర్ కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో తనకు బౌలింగ్ చేయడని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ స్టబ్స్ వెల్లడించారు. అతడి బౌలింగ్‌ను మిస్టరీగా ఉంచుకోవడానికే ఇలా చేస్తున్నాడేమోనని స్టబ్స్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టబ్స్ త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా నుంచి బరిలోకి దిగనున్నారు. కుల్దీప్ కూడా ఇండియన్ టీమ్‌లో ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానం రాజమండ్రి. 1998, 1999లో ఇక్కడ BJP గెలిచింది. టీడీపీ, జనసేన సపోర్ట్‌తో ఎలాగైనా ఈ సీటుని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ప్రయత్నిస్తోంది. ఇటు BC నేత గూడూరు శ్రీనివాస్‌ని YCP బరిలోకి దింపింది. కాగా ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీలుస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.