India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ పారాలింపిక్స్ మెన్స్ సింగిల్స్ SL4 విభాగంలో షట్లర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈయన 2020 టోక్యో పారాలింపిక్స్‌లోనూ రజతం గెలిచారు. తద్వారా పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత పారా షట్లర్‌గా చరిత్ర సృష్టించారు. ఈయన IAS ఆఫీసర్ కూడా. 2007 యూపీ క్యాడర్‌కు ఎంపికైన సుహాస్ ప్రస్తుతం గౌతమ్ బుద్ద నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2021లో అర్జున అవార్డును పొందారు.
ఓ వైపు వరదలు మరోవైపు పురిటి నొప్పులు. అంబులెన్స్ రాలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో విజయవాడలో ఓ మహిళ ప్రసవించింది. దీంతో తల్లి, శిశువును సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్వయంగా పోలీసు ఉన్నతాధికారి రంగంలోకి దిగారు. అప్పుడే పుట్టిన శిశువుతో బోటులో వెళ్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
TG: ఆదిలాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించారు. వరద ముంపుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాణనష్టం జరిగిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు సాయం ఇస్తామన్నారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెన్‌గంగాను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సమయంలో రాజకీయాలకు చోటు లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.
హీరో తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘హనుమాన్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, సీక్వెల్‌కి బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి నిర్మాతలు తప్పుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
TG: KCR కుటుంబం దగ్గర ₹లక్ష కోట్లు ఉన్నాయని, CMRFకు ₹2వేల కోట్లు నిధులివ్వాలని CM రేవంత్ అన్నారు. చిట్‌చాట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విపత్తుపై ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. వరదల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని హెల్త్ మినిస్టర్ దామోదరను ఆదేశించినట్లు చెప్పారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయన్నారు.
TG: వరద బాధితుల కోసం ఒకరోజు బేసిక్ పేని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పేను సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. ఈ మొత్తం రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం.
తనకు విరాట్ కోహ్లీ ఎంతో ఇష్టమని, అతడిని ఆరాధిస్తానని యంగ్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వెల్లడించారు. ఇటీవల DPLలో 6 బంతుల్లో 6 సిక్సర్లు <<13985456>>కొట్టిన<<>> ఆర్య ఓ ఇంటర్వ్యూలో రన్ మెషీన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘కోహ్లీ అగ్రెషన్, క్రికెట్ ఆడే విధానం నాకెంతో ఇష్టం. అలాగే IPLలో నా ఫేవరెట్ టీమ్ RCB. ఆ జట్టుకు ఆడాలనుకుంటున్నా’ అని తెలిపారు. ఆర్య DPLలో 9 మ్యాచ్‌లలోనే 602 రన్స్ చేసి అగ్రస్థానంలో ఉన్నారు.
మనిషికి కనీసం 6 గంటల నిద్ర అవసరం. కానీ డైసుకే హోరీ(జపాన్) అనే వ్యక్తి 12ఏళ్లుగా 30నిమిషాలే నిద్రపోతున్నాడు. తక్కువ నిద్రతోనూ పనిచేసేలా 40ఏళ్లుగా శరీరం, మెదడుకు శిక్షణ ఇచ్చినట్లు అతను చెబుతున్నాడు. లాంగ్ స్లీప్ కంటే కొద్దిసేపు నాణ్యమైన నిద్రతో ఆరోగ్యానికి మేలని, ఏకాగ్రత పెరుగుతుందంటున్నాడు. ఇతడిని ఓ ఛానల్ నిర్వాహకులు 3రోజులు పరిశీలించగా 26నిమిషాలే నిద్రపోయాడు. లేచిన వెంటనే ఎనర్జీతో పనిచేశాడు.
AP: విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 15 ఏళ్లుగా డ్రోన్ టెక్నాలజీ ఉన్నా ఎవరూ వినియోగించుకోలేదని, తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, పండ్లు, పాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విపత్తుల్లో ఎలా స్పందించాలో సీఎం చంద్రబాబుకు తెలుసన్నారు. ఆయనకున్న అనుభవంతో ప్రజల్లోనే ఉంటూ అధికారులకు సూచనలిస్తున్నారని పేర్కొన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ AP&TG రాష్ట్రాలకు చెరో రూ.5లక్షల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నానని అన్నారు. తన అభిమాన హీరో అయిన జూ.ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కాసేపటికే విశ్వక్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.