India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SRHపై ఓటమి అనంతరం LSG కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు ఓనర్ గోయెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏమన్నారన్నదానిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ నివేదిక విడుదల చేసింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు విలయతాండవం చేసిన అదే పిచ్‌పై రాహుల్ 33 బంతుల్లో 29 రన్స్ చేయడం, ఆటగాళ్లలో గెలవాలన్న కసి కనిపించకపోవడం, అత్యంత పేలవమైన బౌలింగ్.. ఈ అంశాలపై గోయెంకా రాహుల్‌ను నిలదీసినట్లు నివేదిక పేర్కొంది.
TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ ఫరిధిలోని వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఫరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. అతణ్ని ఆ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రేక్షకుల ముందు అవమానించడాన్ని ఆ టీమ్ ప్లేయర్లే తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్.. రాహుల్‌కు మద్దతుగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. రాహుల్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న అతడు ‘బ్లాక్ హార్ట్’ను క్యాప్షన్ ఇచ్చారు. యశ్ ఠాకూర్, మోసిన్ ఖాన్, యుధ్వీర్ సింగ్ కూడా ఇలాంటి పోస్టులే పెట్టారు.
IPLలో రూ.20 కోట్లు ఇచ్చినా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆడరని ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నారు. అతడు దేశానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రమీజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కోహ్లీకే రూ.15 కోట్లు ఇస్తుంటే.. బాబర్‌కు రూ.20 కోట్లు ఇస్తారా? అని ఎద్దేవా చేస్తున్నారు. బాబర్ చిన్న దేశాలపైనే ఆడతారని కామెంట్లు చేస్తున్నారు.
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరునాటికి ఆయన తన 21 ఏళ్ల కెరీర్‌కు తెరవేయనున్నట్లు ఇంగ్లండ్ పత్రిక ‘ది గార్డియన్’ తెలిపింది. తాను యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నానని కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అండర్సన్‌కు చెప్పినట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రెండన్ ఈ సూచన చేసినట్లు సమాచారం.
త్వరలోనే పేటీఎంలో క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ దిశగా పేటీఎం యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ద్వారా ఈ సేవలు అందించనుంది. మొదట ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ రైడ్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తోందని తెలుస్తోంది. పేటీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓలా, ఉబర్ వంటి సంస్థలకు పోటీ ఏర్పడనుంది.
పొట్టి ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు రెండు బ్యాచులుగా అమెరికా వెళ్లనున్నారు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన టీమ్‌లలో ఉన్న క్రికెటర్లు తొలి విడతలో పయనం కానున్నారు. ఇప్పటికే ముంబై, పంజాబ్ జట్లు ఎలిమినేట్ కావడంతో రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, అర్షదీప్ ఈ నెల 24న అమెరికాకు పయనమవుతారని జైషా చెప్పారు. మిగిలిన ఆటగాళ్లు మే 27 లేదా 28న బయలుదేరే అవకాశముంది.
1895: తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జననం
1922: సింగర్ మాధవపెద్ది సత్యం జననం
1961: హైదరాబాద్‌లో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభం
1980: టాలీవుడ్ హీరో పోసాని సుధీర్ బాబు జననం
1992: హీరోయిన్ ఆదాశర్మ జననం
2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరిన రోజు
జాతీయ సాంకేతిక దినోత్సవం
మాల్దీవుల నుంచి భారత సైన్యం ఉపసంహరణ పూర్తైంది. చివరి బ్యాచ్ ఇటీవలే స్వదేశానికి వెళ్లిపోయిందని మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయ ప్రతినిధి ఓ వార్తాసంస్థకు తెలిపారు. మే 10కల్లా తమ దేశాన్ని వీడాలంటూ అధ్యక్షుడు ముయిజ్జు గతంలోనే భారత్‌కు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఒకరోజు ముందుగానే భారత సైన్యం వీడినట్లు తెలుస్తోంది. 89మంది భారత సైనికులు విడతలవారీగా ఆ దేశాన్ని విడిచి స్వదేశానికి చేరారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.