India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* రూ.50,000 పూచీకత్తు చెల్లించాలి.
* ఢిల్లీ CM ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లకూడదు.
* ప్రస్తుత కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు.
* ఈ కేసుకు సంబంధించి సాక్షులతో మాట్లాడకూడదు.
* గవర్నర్ క్లియరెన్స్ కోసం తప్ప అధికారిక ఫైళ్లపై సంతకం చేయరాదు.
>> ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమ్ ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. ‘విరాట్ తిరుగులేని ఫామ్‌లో కనిపిస్తున్నారు. అత్యుత్తమంగా ఆడుతున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫునా ఇదే ఫామ్‌ను కొనసాగించాలి’ అని అభిలషించారు.
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కెరీర్‌తో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. 2020లో ‘గో డిజిట్’ అనే ఇన్సూరెన్స్ స్టార్టప్‌లో ఈ జంట రూ.2.5కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈనెల 15-17 తేదీల్లో ఆ సంస్థ IPO అందుబాటులోకి రానుంది. ఒక్కో షేర్ ధర రూ.258-272 మధ్య ఉండటంతో వీరి సంపద రూ.9.06 కోట్లకు (రూ.6.56కోట్ల లాభం) చేరనుంది. కాగా కోహ్లీ 2,66,667 షేర్లు, అనుష్క 66,667 షేర్లు కొనుగోలు చేశారు.
✒ ప్రతి నెలా ₹లక్ష జీతం(అలవెన్సులు ₹1.30 లక్షలు).
✒ MP, ఆయన భార్యకు ఏటా 34సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఫస్ట్ క్లాస్ AC కోచ్‌లో ఫ్రీ జర్నీ. రోడ్డు రవాణా అయితే కి.మీకు ₹16 చొప్పున అందుతుంది.
✒ పాథాలాజికల్ లాబొరేటరీ, ECG, డెంటల్, చర్మ, కంటి ఆరోగ్య సేవలు ఉచితం. ఢిల్లీలో నివాస వసతి కల్పిస్తారు.
✒ 3 టెలిఫోన్లను వాడుకోవచ్చు. ఏడాదిలో 50వేల ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.
✒ పదవి అనంతరం ₹50వేల పింఛన్.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: దేశం ఏమైపోయినా కాంగ్రెస్‌కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి కావాలని PM మోదీ విమర్శించారు. నారాయణపేట సభలో మాట్లాడుతూ.. ‘మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయి. BCలకు రిజర్వేషన్లు పెంచేటప్పుడు అడ్డుపడింది కాంగ్రెస్సే. SC, STల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని ఆ పార్టీ ప్రయత్నించింది. ముస్లింల కోసం ఎంతో కృషి చేస్తోన్న INC.. ఎస్సీల రిజర్వేషన్లను పట్టించుకోవట్లేదు’ అని మండిపడ్డారు.
TG: హిందువులను రెండో తరగతి పౌరులుగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని PM మోదీ మండిపడ్డారు. హిందూ దేవుళ్లను పూజించడం, అయోధ్యకు వెళ్లడం అంటే ఆ పార్టీకి నచ్చడం లేదని విమర్శించారు. నారాయణపేట సభలో మాట్లాడుతూ.. ‘దేశాన్ని ముక్కలు చేసేలా రాహుల్ మాట్లాడుతున్నారు. ఈ యువరాజుకు USలో ఒక రాజగురువు(శ్యామ్ పిట్రోడా) ఉన్నారు. ఆయన జాతి వివక్ష చూపిస్తున్నారు. భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చుతున్నారు’ అని ఫైరయ్యారు.
TG: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ అని ప్రధాని మోదీ చెప్పారు. నారాయణపేట సభలో మాట్లాడుతూ.. ‘పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చాం. అయితే ఈ నిధులు అవినీతి ATMలోకి వెళ్లాయి. గతంలో బీఆర్ఎస్ కాళేశ్వరం పేరిట లూటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ RR ట్యాక్స్ వసూలు చేస్తోంది. నేను ఎవరి పేరూ చెప్పకుండా RR ట్యాక్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు?’ అని ప్రశ్నించారు.
AP: ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పలువురు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన RK సెలూన్ ఓనర్ రాధాకృష్ణ ఓటు వేసిన వారికి ఫ్రీగా హెయిర్ కట్ చేయనున్నట్లు తెలిపారు. ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికే ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఓటు వేసిన తర్వాత ముత్యాలమ్మ ఆలయం, కంచరపాలెం మెట్టుకు ఎదురుగా ఉన్న తమ సెలూన్ షాప్‌కు వస్తే ఫ్రీగా హెయిర్ కట్ చేస్తామన్నారు.
ఈ నెల 13న ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారికి బస్సు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. HYD నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు RTC ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సాధారణ ఛార్జీల మీద రూ.1000- రూ.1500 వరకు అధికంగా వసూలు చేస్తున్నాయి. HYD నుంచి VJA, విశాఖ, రాజమండ్రికి టికెట్ గరిష్ఠంగా రూ.3000 ఉంది. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు.
Sorry, no posts matched your criteria.