India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 67వేల మంది నష్టపోయినట్లు సమాచారం. మొత్తం 117 గ్రామాల్లో ఈ నష్టం వాటిల్లింది. బాధితుల్లో ఖమ్మం జిల్లాలోనే 49వేల మంది ఉన్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 44 ఇళ్లు పూర్తిగా మరో 600 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 51 వంతెనలు, 249 కల్వర్టులు, 166 చెరువులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 13,342 జీవాలు మృతి చెందాయి.
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను కలిచివేస్తున్నాయని ట్వీట్ చేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
AP: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో స్కూళ్లకు హాలీడే ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు TGలోని ఖమ్మం జిల్లాలోనూ ఇవాళ హాలిడే ఇచ్చారు. మరిన్ని జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
TG: వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ <<14008928>>ఉద్యోగ<<>> సంఘాల జేఏసీలు ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన 5 డీఏలు, 4 సరెండర్ లీవుల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీస్తున్నారు.
TG: వరద ప్రభావిత ప్రాంతాల్లో BJP నేతలు నేటి నుంచి పర్యటించనున్నారు. MPలు, MLAలు, ముఖ్య నేతలు వరద బాధితులను పరామర్శించాలని పార్టీ నిర్ణయించింది. అధిక నష్టం వాటిల్లిన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తొలి విడత పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు. రెండో విడతలో కోదాడ, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అటు సభ్యత్వ నమోదును ఈ నెల 7 నుంచి కొనసాగించనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
వర్షాలు, వరదల కారణంగా మరో నాలుగు రోజుల పాటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 88 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ఒక రైలును దారి మళ్లించినట్లు తెలిపింది. రేపు 61, ఎల్లుండి 13, మరుసటి రోజున 3 రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ట్రాక్ మరమ్మతులు చివరి దశకు చేరుకున్నాయి.
TG: రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన ₹10వేలు దేనికి సరిపోతాయని వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబం సగటున ₹2లక్షలు నష్టపోయిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే సర్వే చేసి నష్టాన్ని అంచనా వేశాక సాయంపై నిర్ణయం తీసుకుంటామని CM చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆ సర్వే పూర్తయ్యేదెప్పుడో అని ప్రజలు సందేహిస్తున్నారు.
వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. పలు థీమ్‌లతో తయారు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ముంబై వంటి నగరాల్లో వరల్డ్ కప్ థీమ్‌తో వినాయకులను రూపొందించారు. తాజాగా ‘పుష్ప-2’ మూవీలో అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్న విగ్రహం వైరల్‌గా మారింది. అయితే అభిమానం పేరుతో దేవుళ్ల విగ్రహాలను ఇలా తయారు చేయవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ప్రకటనలో తెలిపారు. గుంటూరులోనూ ప్రైవేటు, ప్రభుత్వ విద్యాలయాలకు హాలిడే ఇచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ జిల్లాలోనూ సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సెలవుపై ఇంకా ప్రకటన రాలేదు.
Sorry, no posts matched your criteria.