India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. కాగా గతంలో ఇదే ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ టవర్‌లో శ్రీదేవి కుటుంబం నివసించడంతోనే స్థానికులు ఆమె పేరు పెట్టారు.
AP: నేడు చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సా.3.30 నుంచి 4.30 గంటల వరకు చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి బయల్దేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్న వారు 30 లక్షల వరకు ఉంటారని అంచనా. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.
AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.
ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. KKR వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో చెన్నై ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, లక్నో, గుజరాత్ జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఈ నాలుగు జట్లకూ ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటివరకు 59 మ్యాచ్‌లు ముగిసినా ఒక్క జట్టు కూడా ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా చేరుకోలేదు. ముంబై, పంజాబ్‌కు తప్ప అన్ని జట్లకూ ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు భారత్‌లో జరుగుతుంటే బీజేపీ పాకిస్థాన్ ప్రస్తావనెందుకు తీసుకొస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఎన్నికలు కులమతాల ప్రాతిపదికన జరగాలని ప్రజలు కోరుకోవట్లేదు. స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉండాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజలు విసిగిపోయారు’ అని పేర్కొన్నారు.
SRHపై ఓటమి అనంతరం LSG కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు ఓనర్ గోయెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏమన్నారన్నదానిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ నివేదిక విడుదల చేసింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు విలయతాండవం చేసిన అదే పిచ్‌పై రాహుల్ 33 బంతుల్లో 29 రన్స్ చేయడం, ఆటగాళ్లలో గెలవాలన్న కసి కనిపించకపోవడం, అత్యంత పేలవమైన బౌలింగ్.. ఈ అంశాలపై గోయెంకా రాహుల్‌ను నిలదీసినట్లు నివేదిక పేర్కొంది.
TG: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ ఫరిధిలోని వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఫరిధిలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Sorry, no posts matched your criteria.