news

News September 8, 2024

రేపు కాకినాడలో డిప్యూటీ సీఎం పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి బయల్దేరి 9.45 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లి ఏలేరు రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి, జిల్లాలో వరద ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

News September 8, 2024

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

image

AP: వరద బాధితుల సహాయం కోసం CM రిలీఫ్ ఫండ్‌కు దానం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. AP పోలీస్ అధికారుల సంఘం రూ.11.12 కోట్లు, దీపక్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సుబ్రహ్మణ్యం రూ.కోటి, వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.10లక్షలు సహా మరికొందరు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. తోచిన సాయం చేసిన దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.

News September 8, 2024

రేపు మోదీతో అబుదాబి యువరాజు భేటీ

image

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అబుదాబి యువరాజు షేక్ ఖాలెద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఖాలెద్ బిన్ రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఖాలెద్ బిన్ రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఎల్లుండి ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరమ్‌లో ఆయన పాల్గొంటారు.

News September 8, 2024

కమలా హారిస్‌తో డీకే శివకుమార్ భేటీ?

image

కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ ఆహ్వానం మేరకు ఆయన తన కుటుంబంతో కలిసి ఇప్పటికే US బయల్దేరారు. ఆ ఈవెంట్‌లో కమలతో పాటు US మాజీ అధ్యక్షుడు ఒబామాతో విడివిడిగా సమావేశం అవుతారని సమాచారం. అయితే ‘నా పర్యటన ప్రత్యేకం ఏమీ కాదు’ అని US బయల్దేరే ముందు డీకే తెలిపారు.

News September 8, 2024

అధికారులను అలర్ట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్

image

AP: కాకినాడ జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా వరద వస్తుండటంతో కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో ఆయన సమీక్షించారు. ’24 TMCల కెపాసిటీ ఉన్న జలాశయంలో నీటిమట్టం 21 TMCలకు చేరింది. ఇవాళ రాత్రికి వరద మరింత పెరుగుతుంది. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ అని పవన్ ఆదేశించారు.

News September 8, 2024

BIG ALERT.. అతి భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ASF, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, జగిత్యాల, KRMR, పెద్దపల్లి, సూర్యాపేట, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 8, 2024

స్పోర్ట్స్ బడ్జెట్ మూడింతలు పెంచినందునే మెడల్స్: కేంద్ర మంత్రి

image

2014 నాటికి 143 మిలియన్ డాలర్లుగా ఉన్న క్రీడల బడ్జెట్‌ను బీజేపీ హయాంలో మూడింతలు పెంచి నేడు 470 మిలియన్ డాలర్లకు తీసుకొచ్చామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అందుకే భారత్ ఆసియా క్రీడల్లో 117 పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో 111 మెడల్స్ గెలిచిందని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో క్రీడలకు సౌకర్యాల్ని, శిక్షణను, అవకాశాల్ని తమ సర్కారు గణనీయంగా మెరుగుపరిచిందని మంత్రి వివరించారు.

News September 8, 2024

ఈనెల 20న ఓటీటీలోకి తంగలాన్?

image

చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘తంగలాన్’ త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన తంగలాన్‌ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ విభిన్నమైన గెటప్‌లో అద్భుతంగా నటించారు.

News September 8, 2024

పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు: కురసాల

image

AP: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ‘CM చంద్రబాబు మీడియా పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీరు వదులుతున్న సమాచారం ముందే తెలిసినా ప్రజల్ని గాలికి వదిలేశారు. సుమారు 20 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. 45 మంది చనిపోయినా సిగ్గు అనిపించట్లేదా? 2 లక్షలకు పైగా రైతులు నష్టపోతే సమీక్ష చేయలేదు’ అని దుయ్యబట్టారు.

News September 8, 2024

9 కిలోల బంగారం సీజ్ చేసిన ఈడీ

image

బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో ఓ ఇంట్లో సోదాలు చేస్తున్న ED అధికారులు కళ్లు చెదిరే బంగారం డంప్‌ను గుర్తించారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసంలో ED సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.6.5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని గుర్తించింది. దీనికి సంబంధించి సాహా సరైన పత్రాలను చూపకపోవడంతో సీజ్ చేసింది. తదుపరి విచారణ నిమిత్తం సాహాను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది.