news

News February 9, 2026

అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

image

నటి, డాన్సర్ సుధా చంద్రన్‌ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.

News February 9, 2026

అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

image

నటి, డాన్సర్ సుధా చంద్రన్‌ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.

News February 9, 2026

జోరుగా ప్రచారం.. ఎవరిదో పీఠం!

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తరఫున స్వయంగా CM రేవంత్ సహా మంత్రులు బరిలోకి దిగారు. అటు KTR, హరీశ్ రావు, కీలక నేతలు BRS కోసం ఓట్లు అభ్యర్థించారు. BJP నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా MPలు ప్రచారం చేశారు. ఎల్లుండి 52.43 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి.

News February 9, 2026

ఆంజనేయ పూజలో పాటించాల్సిన నియమాలు

image

మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో పూజలో కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు. ‘మహిళలు స్వామి పాదాలు తాకకూడదు. అభిషేకం చేయకూడదు. దూరంగా ఉండి నమస్కరించుకోవాలి. భక్తితో హనుమాన్ చాలీసా పఠించాలి. వినడం వల్ల కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఉపవాసం ఉంటే ఉప్పు లేని తీపి ప్రసాదాలను స్వీకరించాలి’ అని సూచిస్తున్నారు.

News February 9, 2026

IIM లఖ్‌నవూలో ఉద్యోగాలు

image

<>IIM <<>>లఖ్‌నవూ ఎంటర్‌ప్రైజ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ 4 అసిస్టెంట్ మేనేజర్ ప్రోగ్రామ్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in

News February 9, 2026

భవిష్యత్ తరాల కోసం ఫండ్.. నార్వే విజన్ సూపర్!

image

క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చే రాబడిని ఎలా ఉపయోగించాలనే విషయంలో నార్వే ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1969లో చమురు నిల్వలు కనుగొన్నాక భారీగా వచ్చే డబ్బు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల కోసం లాభాల్లోంచి కొంత పక్కనపెట్టి $2T ఫండ్‌ను(₹180 లక్షల కోట్లు) ఏర్పాటు చేసింది. ఈ నిధిని విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి, వచ్చే లాభాలలో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తూ వస్తోంది.

News February 9, 2026

ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ పెరగాలంటే?

image

ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ సరిగా లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఖర్జూరాలు, అంజీర్, బ్లాక్ రైజిన్స్, బీట్‌రూట్, ఉసిరి రసం, కొబ్బరి, బెల్లం లడ్డూలు, కొబ్బరినీరు, బాదంపప్పు, గుమ్మడిగింజలు, వేయించిన శనగలు, రాగులు, దానిమ్మగింజలు, పెసలు, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News February 9, 2026

ఎల్లుండి వరకు వైన్స్, బార్లు బంద్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాల బంద్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

News February 9, 2026

మున్సి‘పోల్స్‌’కు ముగిసిన ప్రచారం

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై SEC నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష/జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

News February 9, 2026

రియల్ ఎస్టేట్.. టైర్-2 సిటీల్లో పెట్టుబడులతో లాభాలు!

image

టైర్-2 సిటీల్లో రియల్ ఎస్టేట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను పెట్టుబడిదారులు లాభదాయకంగా చూస్తున్నారు. మెట్రో సిటీల కంటే తక్కువ ధరలు, మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్థిరమైన డిమాండ్&రాబడి, ఎక్కువ భూమి అందుబాటులో ఉండటం, పరిశ్రమల వృద్ధి, కనెక్టివిటీ పెరుగుదల వంటివి కారణాలుగా చెబుతున్నారు. RBI క్లాసిఫికేషన్ ప్రకారం 50,000-99,999 మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్-2గా పరిగణిస్తారు.