news

News March 20, 2024

కాంగ్రెస్‌లో చేరిన మాజీ MLA

image

AP: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు MLA ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ MLA పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మురళీకృష్ణ 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014లో మరోసారి బరిలోకి దిగగా.. ఓటమి చెందారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు.

News March 20, 2024

అభ్యర్థుల్ని ప్రకటించిన డీఎంకే

image

తమిళనాట 39 లోక్‌సభ సీట్లకు గాను అధికార డీఎంకే పార్టీ 21 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. కీలక అభ్యర్థుల్లో.. కనిమొళి తూత్తుకుడి నుంచి, దయానిధి మారన్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన సీట్లను ఇండియా కూటమికి కేటాయించనుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. అటు అన్నాడీఎంకే కూడా 16మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.

News March 20, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

image

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ప్రేమలు’ OTT రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. మార్చి 29 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను ఇటీవల తెలుగులో రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టింది. గిరీశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశారు.

News March 20, 2024

ఐపీఎల్, పీఎస్ఎల్ ప్రైజ్ మనీ ఎంతంటే…

image

IPLకు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు PSLను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు టోర్నీల్లో ప్రైజ్ మనీ తేడా ఎంత? ఐపీఎల్‌లో గత ఏడాది విజేతలకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌కు రూ.13 కోట్లు లభించాయి. అదే పీఎస్ఎల్‌లో ఇటీవల విజేతలుగా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు మన కరెన్సీలో రూ. 4.15 కోట్లు దక్కాయి. WPLలో ఆర్సీబీకి వచ్చిన ప్రైజ్‌మనీ(రూ.6 కోట్లు) అంతకంటే ఎక్కువే కావడం ఆసక్తికరం.

News March 20, 2024

జగన్, ఆయన సైన్యానికి ఇవే ఆఖరి రోజులు: లోకేశ్

image

AP: ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లాకు చెందిన మునయ్య అనే కార్యకర్తను వైసీపీ శ్రేణులు చంపేశాయని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ గొడ్డలి పార్టీకి రక్తదాహం మరింత పెరిగిపోయింది. ఓటమి భయంతో వైసీపీ సైకోలు మునయ్యను చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. జగన్, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు. దోషులను చట్టం ముందు నిలబెడతాం’ అని వెల్లడించారు.

News March 20, 2024

అతడి కోసం తూటాకైనా అడ్డునిలబడతా: గంభీర్

image

నెదర్లాండ్స్ ఆటగాడు ర్యాన్ టెన్ డొషేటేపై KKR మెంటార్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘నా కెరీర్‌ మొత్తంలో నేను చూసిన అత్యంత నిస్వార్థమైన ఆటగాడు ర్యాన్‌ టెన్ డొషేటేనే. 2011లో కేకేఆర్ కెప్టెన్‌గా నా తొలి గేమ్‌లో తనను పక్కన పెట్టాను. అయినా సరే ఏమాత్రం భేషజం లేకుండా నవ్వుతూ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించాడు. నిస్వార్థాన్ని తనే నాకు నేర్పాడు. అతడి కోసం నేను తూటాకైనా అడ్డు నిలబడతాను’ అని వెల్లడించారు.

News March 20, 2024

షాకింగ్: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ స్టోరీ ఇదేనా..?

image

శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోంది ‘గేమ్ ఛేంజర్. మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా స్టోరీని అమెజాన్ ప్రైమ్ తాజాగా రివీల్ చేసింది. పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయ అవినీతిపై ఎలా పోరాడారన్నదే కథ అని చెప్పింది. దీంతో స్టోరీ ఎందుకు చెప్పారంటూ చెర్రీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ దీనిలో తండ్రీకొడుకులుగా కనిపించనున్నట్లు టాక్.

News March 20, 2024

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌కు జీవితఖైదు

image

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు, ముంబై మాజీ పోలీస్ ప్రదీప్ శర్మకు బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. మాఫియా డాన్ చోటారాజన్ అనుచరుడు రామ్‌నారాయణ్ అలియాస్ లఖన్ భయ్యా ఫేక్ ఎన్‌కౌంటర్‌‌ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. చోటా రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, D-కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిక్ తదితరులను హతమార్చి ప్రదీప్ గుర్తింపు పొందారు. తాను 112 మంది గ్యాంగ్‌స్టర్లను హతమార్చినట్లు గతంలో ప్రదీప్ పేర్కొన్నారు.

News March 20, 2024

తెలియని వారి పెళ్లిళ్లకు వెళ్లి లాగించేస్తున్నారా?

image

నోరూరించే వంటకాలను లాగించేయొచ్చని కొంతమంది తెలియని వారి పెళ్లి వేడుకల్లోకి చొరబడిపోతుంటారు. కడుపారా అన్ని ఐటమ్స్ లాగించి కామ్‌గా బయటకొస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ పట్టుబడితే? కొందరైతే మందలించి వదిలేస్తారు లేదంటే.. మీ మీద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది! అవును పోలీస్ కంప్లైంట్ ఇస్తే IPC సెక్షన్ 441 ‘క్రిమినల్ ట్రెస్‌పాస్’ కింద మీకు 3 నెలల జైలు/ రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

News March 20, 2024

ఢిల్లీ లిక్కర్ కేసులో మరొకరికి బెయిల్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో HYD వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్‌కు బెయిల్ మంజూరైంది. అతనికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన 5 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలని, పాస్‌ పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.