news

News May 23, 2024

బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. జులై 4న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. పార్లమెంట్ రద్దుకు రాజు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారమే వర్షాకాలంలో ఎన్నికలకు వెళ్తామని చెబుతూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

News May 23, 2024

ENGLISH LEARNING: IDIOMS

image

Hang in there: Stay strong in a difficult situation
Call it a day: To stop doing something
Better late than never: To do something rather than not doing
Clouds on the horizon: Problems/ Trouble
Blue in the face: To be exhausted due to strain or anger
Pretty penny: Expensive

News May 23, 2024

దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు

image

AP: బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు. రోజుకు 50 వేల మంది వరకు వస్తున్నారని.. రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

News May 23, 2024

మే 23: చరిత్రలో ఈరోజు

image

1942: ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు జననం
1945: నటుడు చంద్రమోహన్ జననం
1965: దర్శకుడు వై.వి.యస్. చౌదరి జననం
1984: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత మహిళ బచేంద్రీపాల్
ప్రపంచ తాబేలు దినోత్సవం

News May 23, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 23, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:44 గంటలకు
ఇష: రాత్రి 08.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 23, 2024

ప్రధాని కావాలనే ఉద్దేశం లేదు: కేజ్రీవాల్

image

విపక్షాల కూటమి ‘ఇండియా’ 300 స్థానాల వైపు దూసుకెళ్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. తమ కూటమి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ఎవరనే దానిపై ఫలితాల తర్వాత కూటమి నిర్ణయిస్తుందని.. తనకు మాత్రం ప్రధాని కావాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. PMగా రాహుల్ గాంధీని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అలాంటి చర్చ జరగలేదు. అది ఊహాజనిత ప్రశ్న’ అని అన్నారు.

News May 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 23, 2024

చర్చలు విఫలం.. ఆరోగ్య శ్రీ సేవల బంద్ కొనసాగింపు

image

AP: ప్రభుత్వంతో ప్రైవేట్ ఆస్పత్రుల చర్చలు మరోమారు విఫలమయ్యాయి. రూ.1500 కోట్ల బకాయిల్లో రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO రూ.203 కోట్లు విడుదల చేస్తామన్నారని పేర్కొన్నాయి. దీంతో స్కీమ్ సేవల బంద్ కొనసాగిస్తున్నట్లు చెప్పాయి. అయితే ఆస్పత్రుల్లో పథకం సేవలు కొనసాగేలా చూడాలని కలెక్టర్లను CEO ఆదేశించారు. బకాయిలు త్వరలో విడుదల చేస్తామన్నారు.

News May 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 23, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 23, గురువారం
శు.పౌర్ణమి: రాత్రి 07:22 గంటలకు
విశాఖ: ఉదయం 09:14 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 09:55 నుంచి 10:47 వరకు తిరిగి మధ్యాహ్నం 03:03 నుంచి 03:55 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:24 నుంచి 03:03 వరకు