news

News May 23, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 23, గురువారం
శు.పౌర్ణమి: రాత్రి 07:22 గంటలకు
విశాఖ: ఉదయం 09:14 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 09:55 నుంచి 10:47 వరకు తిరిగి మధ్యాహ్నం 03:03 నుంచి 03:55 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01:24 నుంచి 03:03 వరకు

News May 23, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఏపీలో కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుతా: రేవంత్
* సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం విడ్డూరం: కిషన్ రెడ్డి
* కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు: KTR
* AP: టీడీపీతో ఈసీ అధికారుల కుమ్మక్కు: అంబటి
* వైసీపీ ఎమ్మెల్యే PRK అరెస్టుకు ఈసీ ఆదేశాలు
* జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం: టీడీపీ నేతలు
* IPL: రాజస్థాన్ విజయం.. ఆర్సీబీ ఇంటికి

News May 22, 2024

IPL: ఆర్సీబీ ఇంటికి..

image

IPL: లీగ్ స్టేజీలో వరుసగా 6 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ.. కీలక పోరులో నిరాశపరిచింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. తొలుత ఆర్సీబీ 172/8 రన్స్ చేయగా.. RR 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన శాంసన్ సేన.. 24న SRHతో తలపడనుంది. అందులో గెలిచిన జట్టు 26న ఫైనల్‌లో KKRతో అమీతుమీ తేల్చుకోనుంది.

News May 22, 2024

అందుకే సన్న వడ్లకు రూ.500 బోనస్: మంత్రి సీతక్క

image

TG: సన్న వడ్ల ఉత్పత్తిని పెంచేందుకే రూ.500 బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి సీతక్క తెలిపారు. ‘తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనానికి వినియోగించేవారు. మేము రేషన్ దుకాణాల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది’ అని చెప్పారు.

News May 22, 2024

ర్యాష్ డ్రైవింగ్ కేసులో మైనర్‌కు బెయిల్ రద్దు

image

ర్యాష్ డ్రైవింగ్‌తో పుణేలో ఇద్దరి మరణానికి కారణమైన 17 ఏళ్ల బాలుడికి జస్టిస్ జువైనల్ బోర్డు బెయిల్ రద్దు చేసింది. మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన మైనర్‌ని పిల్లల పరిశీలన కేంద్రానికి పంపనున్నట్లు పేర్కొంది. జూన్ 5 వరకు నిందితుడిని రిమాండ్ హోమ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. నేరం తీవ్రత కారణంగా అతడిని పెద్దవాడిగానే పరిగణనలోకి తీసుకోవాలని పుణే పోలీసులు కోర్టును కోరుతున్నారు.

News May 22, 2024

ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: CM

image

TG: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పరిధిలోని అన్ని బూత్‌లను ఎమ్మెల్యేలు సందర్శించాలని, కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు.

News May 22, 2024

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి

image

AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని 236, 237, 253, 254 బూత్‌లలో పోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈసీ, సీఈవోతో పాటు మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై రేపు కోర్టు విచారణ చేపట్టనుంది.

News May 22, 2024

ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా?

image

మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంతగా ఫోన్‌ను దూరంగా ఉంచాలి. అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు.

News May 22, 2024

IPL: మ్యాక్స్‌‌వెల్ చెత్త రికార్డు

image

ఈ సీజన్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సున్నాకే వెనుదిరిగారు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్సుల్లో 5.77 సగటుతో 59 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా కార్తీక్(18) రికార్డును మ్యాక్సీ సమం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(17), పియూష్ చావ్లా(17), నరైన్(16) ఉన్నారు.

News May 22, 2024

మ్యాక్సీ.. ఏం ఆటయ్యా బాబూ!!

image

IPL: అంతర్జాతీయ మ్యాచుల్లో అదరగొట్టే మ్యాక్స్‌వెల్.. IPLలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ విమర్శలకు అతడి గణాంకాలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. గత 9 అంతర్జాతీయ టీ20ల్లో 60.50 సగటు, 192 SRతో 363 రన్స్ చేసిన ఈ ఆసీస్ ప్లేయర్.. ఆర్సీబీ తరఫున 9 మ్యాచుల్లో 5.77 సగటుతో 52 రన్స్ మాత్రమే చేశారు. మరి రాబోయే టీ20 WCలో మ్యాక్సీ ఎలా ఆడతారో చూడాలి.