news

News May 23, 2024

సంజూ, పరాగ్ అరుదైన ఘనతలు

image

రాజస్థాన్ రాయల్స్‌కు అత్యధిక విజయాలు(31) అందించిన కెప్టెన్‌గా షేన్ వార్న్ సరసన సంజూ శాంసన్ చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్(18), స్టీవెన్ స్మిత్(15) ఉన్నారు. అలాగే ఈ సీజన్‌లో అత్యధిక రన్స్(567) చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రియాన్ పరాగ్ ఘనత సాధించారు. ఓవరాల్‌గా యశస్వి జైస్వాల్ 625 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. అతను 2023లో ఈ ఫీట్ నమోదు చేశారు.

News May 23, 2024

భారత్‌లో నర్సుల కొరత

image

విదేశాలకు నర్సులు వలస వెళ్తుండటంతో భారత్‌లో వారి సంఖ్య తగ్గిపోతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నమోదు చేసుకున్న నర్సింగ్ సిబ్బంది సంఖ్య 33 లక్షలుగా కాగా.. 140 కోట్ల ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ఈ సంఖ్య సరిపోదని చెబుతున్నారు. 1000 మంది జనాభాకు 1.96శాతం(దాదాపు 20 మంది) నర్సులు అవసరమని WHO సిఫార్సు చేసింది. కానీ భారత్‌లో ఈ జనాభాకు ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారు.

News May 23, 2024

MS సుబ్బలక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేశ్?

image

సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో మెప్పించిన కీర్తి సురేశ్.. ఇప్పుడు లెజెండరీ సింగర్ దివంగత MS సుబ్బలక్ష్మి జీవిత కథలో నటించనున్నారని తెలుస్తోంది. తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుబ్బలక్ష్మి గొప్ప గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, జీవితంలో విషాద ఘటనలన్నీ ఇందులో ఉంటాయని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవుతాయని టాక్.

News May 23, 2024

నేడు ఎడ్‌సెట్.. రేపు పాలిసెట్

image

TG: రాష్ట్రంలో బీఈడీ సీట్ల భర్తీకి నేడు ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకోగా, 79 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ రేపు జరగనుంది. ఈ పరీక్షకు 92,808 మంది అప్లై చేసుకోగా, మొత్తం 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News May 23, 2024

ఛలో మాచర్లకు టీడీపీ పిలుపు

image

AP: టీడీపీ నేతలు ఇవాళ మాచర్లలో పర్యటించనున్నారు. పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఉదయం 9గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, జీవీ ఆంజనేయులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

News May 23, 2024

BRS ఎమ్మెల్సీ అభ్యర్థికి సీబీఐ మాజీ జేడీ మద్దతు

image

TG: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికల్లో BRS అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యావంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేశ్‌ను గెలిపించాలని ఎక్స్(ట్విటర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నీతి, నిజాయతీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. పట్టభద్రులు రాకేశ్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News May 23, 2024

మా ఓటమికి కారణం అదే..: డుప్లెసిస్

image

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని RCB కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. మరో 20 పరుగులు చేసి ఉంటే టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకునే ఛాన్స్ ఉండేదన్నారు. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు పెద్ద ఉపయోగపడలేదని చెప్పారు. పాయింట్ల పట్టికలలో అట్టడుగు స్థానం నుంచి ఎలిమేటర్ మ్యాచ్‌ వరకు రావడం గర్వంగా ఉందన్నారు. కాగా RCB విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని RR 19 ఓవర్లలోనే చేధించింది.

News May 23, 2024

హోటల్ పరిశ్రమలో 11శాతం ఆదాయ వృద్ధి

image

ఈ ఏడాది జనవరి- మార్చిలో భారత హోటల్ పరిశ్రమలో 11శాతం ఆదాయ వృద్ధి నమోదైనట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. వ్యాపార, విశ్రాంతికి అధిక గిరాకీ ఉన్న ప్రాంతాల్లో హోటల్ గదులకు ఏర్పడిన డిమాండ్‌తో ఈ వృద్ధి సాధ్యమైనట్లు పేర్కొంది. కార్పొరేట్ల ప్రయాణాలు, పెళ్లిళ్లు, సమావేశాలు, ఎగ్జిబిషన్లు వంటివి ఆదాయ వృద్ధికి దోహదపడినట్లు నివేదిక తెలిపింది. ఆక్యుపెన్సీ స్థాయి సుమారు 70 శాతంగా నమోదైంది.

News May 23, 2024

బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు. జులై 4న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. పార్లమెంట్ రద్దుకు రాజు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారమే వర్షాకాలంలో ఎన్నికలకు వెళ్తామని చెబుతూ వచ్చిన ఆయన అకస్మాత్తుగా ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

News May 23, 2024

ENGLISH LEARNING: IDIOMS

image

Hang in there: Stay strong in a difficult situation
Call it a day: To stop doing something
Better late than never: To do something rather than not doing
Clouds on the horizon: Problems/ Trouble
Blue in the face: To be exhausted due to strain or anger
Pretty penny: Expensive