India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని ఆయనకు ఈడీ నిన్న సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఆయన విచారణకు వెళ్లడం లేదని ఆప్ వెల్లడించింది. ‘కోర్టులో బెయిల్ వచ్చాక మళ్లీ నోటీసులు ఎందుకు పంపారు? ఈడీ సమన్లు చట్టవిరుద్ధం’ అని ప్రకటనలో పేర్కొంది.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బీజేపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘420(మోసాలు) పనులు చేసిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపుపై మాట్లాడుతున్నారు. వారు ఏ పార్టీ అయినా కావొచ్చు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. ఒక పార్టీ 400 సీట్లలో గెలవడం సాధ్యం కాదు’ అని స్పష్టం చేశారు. కాగా తాము సింగిల్‌గా 370 సీట్లు, NDA కూటమికి 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.
AP: చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిన్న జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ‘అందరం కలిసి సమిష్టిగా ఏపీని తిరిగి గాడిలో పెట్టేందుకు కలిసి పనిచేద్దాం. నిన్నటి సభ ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పం మరింత బలపడింది. కలిసికట్టుగా మనం విజయం సాధిస్తున్నాం’ అని వెల్లడించారు.
TG: ఖమ్మంలో దారుణం జరిగింది. చెవి కమ్మలు కొనలేదనే కోపంతో భర్తకు భార్య నిప్పంటించింది. తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు చెవి కమ్మలు కొనివ్వాలని భర్త యాకూబ్ పాషాతో సమీనా నిత్యం గొడవ పడుతూ ఉండేదని పోలీసులు తెలిపారు. తన దగ్గర డబ్బు లేదని, కొనలేనని పాషా చెప్పడంతో భార్య ఆగ్రహానికి గురై నిప్పంటించిందని చెప్పారు.
NEET UG-2024 దరఖాస్తులను సవరించుకునేందుకు NTA అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈనెల 20న రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్స్‌లో కరెక్షన్స్ చేసుకోవచ్చని తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ పరీక్షను మే 5న ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈనెల 8తో నీట్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన సంగతి తెలిసిందే.
AP: చిలకలూరిపేటలో TDP-JSP-BJP మీటింగ్ విఫలమైందని, ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘గతంలో ఇచ్చిన హామీల పరిష్కారంపై మాట్లాడలేదు. కొత్త హామీల ఊసెత్తలేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ విజన్ గురించి ప్రస్తావించలేదు. వారికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని Xలో మండిపడ్డారు.
హోరా హోరీగా సాగిన WPL ఫైనల్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. అయితే లీగ్ విన్నర్, రన్నరప్ అందుకునే ప్రైజ్ మనీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. RCB జట్టు ట్రోఫీతో పాటు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్ DCకి రూ.3 కోట్లు వచ్చాయి. ఇక ఆరెంజ్ క్యాప్ విన్నర్ పెర్రీ రూ. 5లక్షలు గెలుచుకున్నారు. కాగా, IPL-2023 విన్నర్ CSKకి రూ.20 కోట్లు వచ్చాయి.
AP: ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2023-24లో 1.81 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1.42 లక్షల టన్నులు), UP(1.27 లక్షల టన్నులు) ఉన్నాయని తెలిపింది. దేశంలో ఉత్పత్తి 11.20 లక్షల టన్నులు కాగా, AP వాటా 16.16 శాతమని పేర్కొంది. అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలోనూ రాష్ట్రం తొలి స్థానంలో నిలవడం విశేషం.
తన ప్రియుడు మైఖేల్‌ను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేనని హీరోయిన్ ఇలియానా అన్నారు. ‘నా గురించి ఎవరేం మాట్లాడినా తట్టుకున్నా. నెటిజన్లు నన్న ఘోరంగా ట్రోల్ చేశారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నా కాబట్టి భరించా. కానీ నా భాగస్వామి, కుటుంబంపై విమర్శలు వస్తే భరించలేను. నా కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ రాకతో మా జీవితం మారిపోయింది. గతేడాది ఎంతో సంతోషంగా గడిచింది’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Sorry, no posts matched your criteria.