India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. మాచర్లలో పథకం ప్రకారమే పిన్నెల్లి దాడులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై ఎమ్మెల్యే రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితమైన మెజార్టీతో INDIA కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ అభ్యర్థే PM అవుతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గెలిచిన 2 రోజుల్లోనే పీఎం అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. మరోవైపు మోదానీ స్కామ్‌పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హరియాణాలో రైతులు కోపంతో ఉన్నారని BJP ప్రచారం చేయట్లేదని దుయ్యబట్టారు.
తనపై దాడి కేసును పారదర్శకంగా విచారించాలన్న ఢిల్లీ CM కేజ్రీవాల్ వ్యాఖ్యల కంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? అని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ప్రశ్నించారు. మాటలు, చేతలు ఒకేలా ఉండాలని ఆమె సూచించారు. ‘స్వయంగా సీఎం డ్రాయింగ్ రూమ్‌లోనే నన్ను కొట్టారు. అప్పటి నుంచి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ఇప్పుడు సీఎం పారదర్శక విచారణ కోసం అడుగుతున్నారు. దీన్ని నేను నమ్మను’ అని స్వాతి ట్వీట్ చేశారు.
ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. RRతో జరుగుతున్న మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. IPL కెరీర్‌లో కోహ్లీ 8 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. పరుగుల పరంగా కోహ్లీ దరిదాపుల్లో ఏ ప్లేయర్ లేకపోవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో శిఖర్ ధవన్(6,769) ఉన్నారు. మరోవైపు ఈ సీజన్‌లో లీడింగ్ స్కోరర్‌గా కోహ్లీ ఉన్నారు.
2019లో సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. మైనర్‌కు వాహనం ఇస్తే ఆ తర్వాతి పర్యవసానాలకు దాని యజమాని బాధ్యులవుతారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.25వేల ఫైన్ పడే అవకాశం ఉంటుంది. భారతదేశంలో జువెనైల్స్ వల్ల ట్రాఫిక్ నేరాలు పెరగడంతో ఈ సవరణను తీసుకొచ్చారు. పుణేలో 17ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన కేసులో అతడి తండ్రి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
AP: నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆదేశించింది. ఇప్పటికే రూ.203 కోట్లు విడుదల చేశామని, త్వరలోనే మిగతా పెండింగ్ బకాయిలు రిలీజ్ చేస్తామని పేర్కొంది. కాగా గత ఆగస్టు నుంచి రూ.1500 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళలు 10శాతం కన్నా తక్కువేనని ADR నివేదిక పేర్కొంది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది మహిళలు ఉన్నారని.. ఇది కేవలం 9.5 శాతమేనని తెలిపింది. దీంతో లింగ వివక్షకు చోటివ్వకుండా స్త్రీలకు తగిన సంఖ్యలో ప్రాధాన్యం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
రోమ్‌లో బుల్గారీ 140వ వార్షికోత్సవ ఈవెంట్‌కు హాజరైన నటి ప్రియాంకా చోప్రా తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన ఖరీదైన నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 140 క్యారెట్ల డైమండ్స్‌తో తయారు చేసిన ఆ నెక్లెస్ విలువ దాదాపు రూ.358 కోట్లు ఉంటుందని ఓ రిపోర్ట్ పేర్కొంది. 698 బాగెట్ వజ్రాలను ఉపయోగించి ఆ నెక్లెస్ తయారు చేయడానికి 2,800 గంటల సమయం పట్టినట్లు తెలిపింది.
T20 WC వేళ నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచానేకు వీసా ఇచ్చేందుకు యూఎస్ ఎంబసీ నిరాకరించింది. ఇటీవల లైంగిక వేధింపుల కేసులో సందీప్‌కు క్లీన్ చిట్ రావడంతో జట్టులో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఎంబసీ నిర్ణయం ఆయనను షాక్‌కు గురిచేసింది. 2019లోనూ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ ఇలాగే చేసినట్లు సందీప్ ట్వీట్ చేశారు. ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే వీసా నిరాకరణకు కారణాలను ఆయన వెల్లడించలేదు.
కోహ్లీ భద్రతకు <<13294410>>ముప్పుపై<<>> గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(GCA) స్పందించింది. కేవలం ఎండ వేడిమి వల్లే ప్రాక్టీస్ సెషన్‌కు RCB దూరంగా ఉందని పేర్కొంది. ‘ఉగ్రవాదుల ముప్పు వంటిదేం లేదు. గుజరాత్ కాలేజీ గ్రౌండ్‌లో RCB, RR జట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇప్పించాం. కానీ వేడి వల్ల ఇండోర్ ప్రాక్టీస్‌కే RCB మొగ్గు చూపింది’ అని GCA వెల్లడించింది. కాగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో RR బౌలింగ్ ఎంచుకుంది.
Sorry, no posts matched your criteria.