news

News May 22, 2024

‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ అంటే?

image

బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో ఉండే ఈ జీవి నోరు/ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడును పనిచేయకుండా చేస్తుంది. అందుకే దీనిని మెదడును తినే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేరళలో 2017, 2023లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి.

News May 22, 2024

చిన్నారి ప్రాణం తీసిన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’

image

‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో కేరళలో ఓ బాలిక చనిపోయింది. ఈ నెల 1, 10వ తేదీల్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలిక చెరువులో స్నానానికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత అస్వస్థతకు గురై మృతిచెందింది. ఆమె శరీరంలోకి ఫ్రీ లివింగ్ అమీబా ముక్కుగుండా ప్రవేశించి, మెదడుపై తీవ్ర ప్రభావం చూపినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, వైద్య చికిత్స ఆలస్యమవడం వల్లే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు.

News May 22, 2024

అంచనాలకు మించి జీడీపీ వృద్ధి: నిపుణులు

image

FY24 చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాకు (6.8%) మించి నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గణనీయంగా పెరుగుతున్న డిమాండే ఇందుకు కారణమంటున్నారు. క్యూ4 ఫలితాల ప్రభావంతో FY24 GDP 7.8% రికార్డ్ కావొచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో కేంద్రం వేసిన అంచనా (7.6%) కంటే ఇది ఎక్కువ. మరోవైపు ఐఎంఎఫ్ 7.8% వృద్ధి సాధిస్తుందని అంచనా వేయడం గమనార్హం. కాగా ఈనెల 31న కేంద్రం FY24 జీడీపీ డేటా రిలీజ్ చేయనుంది.

News May 22, 2024

యాక్సిడెంట్‌కు ముందు బార్‌లో రూ.48 వేలు ఖర్చు చేసి..!

image

పుణేలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడైన టీనేజర్ ప్రమాదానికి ముందు ఓ బార్‌లో గంటన్నరలోనే రూ.48 వేలు ఖర్చు చేశాడు. అక్కడి నుంచి వెళ్లి మరో బార్‌లో కూడా తన స్నేహితులతో కలిసి మద్యం తాగి కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకూ డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వబోమని పోలీసులు తెలిపారు.

News May 22, 2024

పేటీఎంను వెంటాడుతున్న నష్టాలు

image

ఫిన్ టెక్ సంస్థ పేటీఎం FY24ను నష్టాలతో ముగించింది. చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.550 కోట్ల నష్టం వాటిల్లింది. అంతకుముందు ఏడాది క్యూ4 ఫలితాల్లో ఈ నష్టం రూ.169కోట్లకే పరిమితమైంది. మరోవైపు ఆపరేషన్స్ ద్వారా వచ్చే రెవెన్యూ (రూ.2,267కోట్లు) సైతం అంతకుముందు ఏడాదితో (రూ.2334 కోట్లు) పోలిస్తే 3శాతం తగ్గిపోయింది. యూపీఐ చెల్లింపులు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై RBI ఆంక్షలు క్యూ4 ఫలితాలపై ప్రభావం చూపించాయి.

News May 22, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA

image

ఐఎండీ ప్రకారం ఈరోజు ఉ.8 గంటలకు <<13291673>>అల్పపీడనం<<>> ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోందని పేర్కొంది. శుక్రవారం ఉదయానికి ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారే అంశంపై నేటి సాయంత్రానికి స్పష్టత రానుంది.

News May 22, 2024

‘పుష్ప-2’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. పుష్పరాజ్‌తో శ్రీవల్లి స్టెప్పులేసే సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను రేపు 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. DSP మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.

News May 22, 2024

ఎన్నికల సిత్రాలు.. బిహార్‌లో తుపాకులతో జనం

image

లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ ఈనెల 25న 57 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగనుంది. అయితే, బిహార్‌లో ఎన్నికల ప్రచారం, ఓటర్ల నాడి తెలుసుకునేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అక్కడి ప్రజలు యథేచ్ఛగా తుపాకీతో రోడ్లపై తిరుగుతుండటం ఆందోళనకు గురిచేసింది. ప్రజలు ఇలా ఉంటే బిహార్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.

News May 22, 2024

కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో?: KTR

image

TG: జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్‌బుక్‌లు క్యూలైన్‌లో పెట్టిన ఘటనపై KTR స్పందించారు. ‘6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమయ్యాయి. పదేళ్లుగా కనిపించని కరెంట్ కోతలు, నీరు లేక ఎండిన పంటలు, బోసిన చెరువులు, అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు, అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం. కాంగ్రెస్ తప్పులు-రైతుల తిప్పలు ఆగడం లేదు. ఈ పాలనలో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో?’ అని ఎద్దేవా చేశారు.

News May 22, 2024

చేపలు పట్టే వృత్తి వివాదంపై కమిటీ: హైకోర్టు

image

TG: చేపలు పట్టే వృత్తి వివాదంపై 3 నెలల్లోగా కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బెస్త/గాండ్ల/గంగపుత్ర-ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లు సంఘాల మధ్య విభేదాలకు పరిష్కారం చూపాలని స్పష్టం చేసింది. మత్స్యకారుల సహకార సంఘాలు బెస్త/భోయ్/గంగపుత్ర/గాండ్ల వారికి మాత్రమే చెందుతాయని.. ముదిరాజ్/ముత్రాస్/తెనుగోళ్లకు సభ్యత్వం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.