news

News May 21, 2024

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు..!

image

UPలోని ఓ చెప్పుల వ్యాపారి ఇంట్లో IT అధికారులు రూ.100 కోట్లు గుర్తించారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు చేసింది. మొత్తం 14 ప్రాంతాల్లో రెండు రోజులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంచాలు, అల్మారాలు, బ్యాగుల్లో నోట్ల కట్టలు కుక్కారు. వాటిని లెక్కించేందుకు క్యాష్ మెషిన్లు కూడా మొరాయించాయి.

News May 21, 2024

‘గాడ్‌ఫాదర్’ కాంబో రిపీట్?

image

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి మరో మూవీ చేయనున్నట్లు సమాచారం. డైరెక్టర్ చెప్పిన కథకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చిరు కుమార్తె సుస్మిత నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులో గాడ్‌ఫాదర్ పేరుతో చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2022లో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.

News May 21, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.68,300గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 తగ్గి రూ.74,510కు చేరింది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.2000 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

News May 21, 2024

ఆ హెలికాప్టర్ 45 ఏళ్ల నాటిది: నిపుణులు

image

ఇబ్రహీం రైసీ మరణంతో ఇరాన్ వాయు రవాణా భద్రతపై మళ్లీ చర్చ జరుగుతోంది. దౌత్య విబేధాలతో ఇరాన్‌కు ఏవియేషన్ పరికరాలు అమ్మడంపై USA ఆంక్షలు విధించింది. దీంతో ఆ దేశం తమ పాత చాపర్లలోని భాగాలు విడదీసి, కొన్ని సొంతంగా తయారుచేసుకుని వాడుతోంది. వీటి నాణ్యత అంతంతమాత్రమే. అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ 1979కి ముందు కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ దేశ వాయు రవాణా ప్రమాణాలు, పరిస్థితులకు ఓ ఉదాహరణ.

News May 21, 2024

పాపం పంజాబ్.. బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్..!

image

ఈ IPL సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దారుణ ప్రదర్శన చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుసగా పదేళ్లపాటు ప్లే ఆఫ్స్‌కు దూరమైన జట్టుగా నిలిచింది. 2014లో ఫైనల్స్‌కు చేరి KKRపై ఓడింది. అప్పటి నుంచి ఆ జట్టు రాత మారడం లేదు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లే గెలిచి నాకౌట్ రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు 5 సార్లు చివరి ఓవర్‌లో ఓడిపోయింది. విజయావకాశాలు తమ వైపు ఉన్న మ్యాచ్‌లు కూడా చేజార్చుకుంది.

News May 21, 2024

రైసీ మరణంలో కుట్రకోణాలు ఉన్నాయా?

image

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై పలు ప్రచారాలు మొదలయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్థానాన్ని ఆశిస్తున్న అతని కొడుకు ముజ్తబా వారసత్వ పోరు రైసీ మరణం వెనుక ఉండొచ్చనే కథనాలు వస్తున్నాయి. రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ముజ్తబాకు దక్కుతుందని USA మాజీ సలహాదారు గాబ్రియన్ అన్నారు. అంతరిక్ష లేజర్ సాయంతో రైసీ విమానం కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఇరాన్ ప్రభుత్వం ఇలాంటిది ఏమీ లేదంటోంది.

News May 21, 2024

సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని పక్కనబెట్టారు: గంభీర్

image

అండర్-14 క్రికెట్ ఆడే సమయంలో సెలక్టర్ కాళ్లు మొక్కలేదని తనను జట్టులోకి ఎంపిక చేయలేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఈవెంట్‌లో ఆయన తెలిపారు. ‘కెరీర్‌లో ఎదగాలని ఆ సమయంలోనే ప్రతిజ్ఞ చేసుకున్నా. నేను ఎవరి కాళ్లూ పట్టుకోకూడదని, నా కాళ్లనూ ఎవరితో పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. నన్ను నేను నిరూపించుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటా’ అని చెప్పారు.

News May 21, 2024

కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్: కేటీఆర్

image

కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు. ‘కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం. ప్రతీ గింజకు బోనస్ అని.. ఇప్పుడు సన్న వడ్లకే అంటారా? రైతుభరోసా, రుణమాఫీ ఏమయ్యాయి? నమ్మి ఓట్లేసిన ప్రజల గొంతు కోస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News May 21, 2024

గొప్పలేనా? 4 నెలలుగా జీతాలు ఇవ్వరా?: హరీశ్‌రావు

image

TG: నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘మా హయాంలోని రిక్రూట్‌మెంట్‌ను మీ ఖాతాలో వేసుకున్నారు. అట్టహాసంగా నియామక పత్రాలు ఇచ్చి.. జీతభత్యాలను పట్టించుకోలేదు. జీతాలు అందక 4వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న నేతలు వాస్తవాలు గుర్తించాలి. వెంటనే జీతాలు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.

News May 21, 2024

‘బ్రిక్స్’కు ప్రాధాన్యత ఎందుకు?

image

2023 DEC నాటికి బ్రిక్స్‌లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. GDP 26 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతానికి సమానం. IMF, ప్రపంచ బ్యాంకుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం రూ.20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(NDB)ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి బలంగా మారడంతో ఇందులో చేరడానికి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.