India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
AP: ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.15 వేలు ప్రభుత్వం జమ చేసింది. కాగా మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించి బటన్ నొక్కారు. ఈ పథకానికి మొత్తం రూ.629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డీబీటీ నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది.
APలో 2023-24కుగాను రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం(ఆస్తుల కల్పన) చేసినట్లు కాగ్ ప్రైమరీ అకౌంట్స్‌లో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ ఖర్చు రూ.87,972 కోట్లని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలకు రూ.52,010 కోట్లు, పెన్షన్లకు రూ.21,694 కోట్లు, సామాజిక రంగానికి(విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, SC, ST సంక్షేమం) రూ.1,10,375 కోట్లు, సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
AP: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అనంతరం డిశ్చార్జి సమయంలోనే జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి అమల్లోకి వచ్చిన కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా పత్రాలు ఎక్కడైనా, ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అంది వాయుగుండంగా మారి.. ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఒడిశా, ప.బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. అటు ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి.
TG: ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో వాహన ఫ్యాన్సీ నంబర్ రికార్డు ధర పలికింది. కొత్త సిరీస్ టీజీ 09 9999 నంబరుకి వేలంలో రూ.25.50లక్షల రాబడి వచ్చింది. సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్ క్రూజర్ కోసం ఈ నంబరు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు మరికొన్ని నంబర్ల వేలం ద్వారా ఒక్క రోజే రవాణా శాఖకు రూ.43,07,284ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీవో అధికారులు తెలిపారు.
TG: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రేపటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్‌కు ఎస్.వాణికి జూడాల సంఘం నేతలు నోటీసులు అందజేశారు. స్టైఫండ్స్ ప్రతి నెల సమయానికి ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని, అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని విన్నవించారు.
APలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదన్నారు. YCP తప్పుడు ఆరోపణలపైనా ఫిర్యాదు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో లోటుపాట్లను సీఈవో దృష్టికి తీసుకెళ్లామన్నారు.
AP: ఎన్నికలు ముగియడంతో తిరిగి వీఐపీల సిఫారసుపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలన్న టీటీడీ విజ్ఞప్తికి ఈసీ సానుకూలంగా స్పందించింది. సోమవారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులకు గతంలో మాదిరిగానే వారి కోటా మేరకు వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలపై జారీ చేస్తున్నారు.
టాల్కమ్ పౌడర్‌తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. జననాంగాలపై దీనిని తరచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువని USలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 50వేల మంది మహిళలపై పరిశోధనలు చేశారు. ఈ పౌడర్‌లోని ఆస్బెస్టాన్ అనే ఖనిజమే ఇందుకు కారణమని తేల్చారు. దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనట. ఆస్బెస్టాన్ లేని పౌడర్‌తో ప్రమాదం ఉండబోదని తెలిపారు.
Sorry, no posts matched your criteria.