India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. బిందు సేద్యం పథకాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, నీటి ప్రాజెక్టులనూ పట్టించుకోలేదన్నారు. పంటలు కాపాడుకునేందుకు అప్పులు చేసి బోర్లు వేసిన రైతులు.. ఆ అప్పుల బాధతో మరణించారన్నారు. రైతన్నల మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆయన మండిపడ్డారు.
‘ఆహారాన్ని వేగంగా తినకుండా ఒక్కో ముద్దను 32 సార్లు నమలాలి’ అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివెనుక ఆహారం సులభంగా జీర్ణమయ్యే సిద్ధాంతం ఉందని నిపుణులు అంటున్నారు. ‘ఎక్కువసార్లు నమలడం వల్ల లాలాజలం ద్వారా నోటి నుంచే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రాధాన్యత చెప్పడానికే దంతాల సంఖ్య ఆధారంగా 32సార్లు నమిలి మింగాలని చెబుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి’ అని పేర్కొంటున్నారు.
TG: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండగా ఉండి ఒక్కసారిగా వాతావరణం మారడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, లక్డీకపూల్‌లో వర్షం పడుతోంది. మీ ప్రాంతంలో వర్షం కురుస్తోందా?
మధ్యతరగతి కుటుంబాల్లోని గృహిణులు రేషన్ కోసం క్యూలో నిలబడటం తననెప్పుడూ ఆకర్షించలేదని స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. తన సినిమాల్లో ఎక్కువగా సెక్స్ వర్కర్లు, డాన్స్ గర్ల్స్ పాత్రలు ఉండటంపై స్పందిస్తూ.. ‘వారు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు. డాన్స్ చేస్తారు.. పాటలు పాడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, దుస్తులు, ఆభరణాల వాడకం వారికి బాగా తెలుసు. వారిని అర్థం చేసుకోవడం కష్టం’ అని పేర్కొన్నారు.
RCB, RR ఎలిమినేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇరుజట్లు ఎలిమినేటర్లో తలపడటం ఇది రెండోసారి. 2015లో తొలిసారి ఈ జట్ల మధ్య నాకౌట్ పోరు జరగ్గా RCB విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో RR 109 రన్స్‌కే కుప్పకూలడంతో RCB 71 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఇక ఈ సీజన్‌లో RR మే గండం ఎదుర్కొంటోంది. ఈ నెలలో ఆ టీమ్‌కి అన్నీ పరాజయాలే. మరోవైపు మే నెలలో RCBకి ఓటమన్నదే లేదు. ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి.
పూరీ క్షేత్రం కిందిభాగంలో ఈ రత్న భాండాగారం ఉంటుంది. రాజులు, భక్తులు సమర్పించిన బంగారం, వజ్రాలు, వెండిని ఇక్కడ భద్రపరిచారు. 1978లో రూపొందించిన అంచనా ప్రకారం.. 12,831 భరీల బంగారం(ఒక భరీ-12 గ్రాములు), 22,153 భరీ వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ గదిని తెరవాలని 2018లో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తాళాలు కనపడలేదు. కొన్నాళ్లకు డూప్లికేట్ తాళాలు దొరికినా గదిని తెరవకపోవడంపై వివాదం కొనసాగుతోంది.
ప్రధాని మోదీ ఇవాళ ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ్ టెంపుల్‌కు BJD పాలనలో రక్షణ లేదని విమర్శించారు. అక్కడి ‘రత్న భండార్’ తాళాలు ఆరేళ్లుగా కనిపించడం లేదన్నారు. ఒడిశా గౌరవం, భాష, కల్చర్ ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.
AP: ఎన్నికల హింసకు బాధ్యుల్ని చేస్తూ ఈసీ సస్పెండ్ చేసిన పలువురు డీఎస్పీల స్థానంలో కొత్తవారిని సీఈవో నియమించారు. నరసరావుపేట- సుధాకర్‌రావు, గురజాల- శ్రీనివాసరావు, తాడిపత్రి- జనార్ధన్ నాయుడు, తిరుపతి- రవి మనోహరాచారి, తిరుపతి సీఐ- నాగేంద్రప్రసాద్.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణానికి తాము కారణమంటూ వస్తున్న వదంతులను ఇజ్రాయెల్ ఖండించింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. హమాస్ మిలిటెంట్లకు రైసీ సహాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే స్వతంత్ర పాలస్తీనా పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.
లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో మధ్యాహ్నం 1గంటలకు పోలింగ్ శాతం 36.72గా నమోదైంది. లద్దాఖ్‌లో గరిష్ఠంగా 52.02% పోలింగ్ నమోదు కాగా కనిష్ఠంగా మహారాష్ట్రలో 27.78% పోలింగ్ రికార్డ్ అయింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో బారాముల్లా నియోజకవర్గంలో ఈసారి రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదవుతోంది. 1 గంటకు ఇక్కడ 34.79% పోలింగ్ నమోదైంది. కాగా గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం 34.89కే పరిమితం అయింది.
Sorry, no posts matched your criteria.