news

News September 12, 2024

23 దంతాలు తొలగించి 12 ఇంప్లాంట్ చేశారు.. చివరికి!

image

సాధారణంగా ఒక్క దంతాన్ని తొలగించి మరొకటి ఇంప్లాంట్ చేసిన నొప్పినే భరించడం కష్టం. కానీ, చైనాకు చెందిన హువాంగ్ సమ్మతితో 23 దంతాలను తీసివేసి 12 దంతాలను ఇంప్లాంట్ చేయడంతో చనిపోయారు. చికిత్స తర్వాత హువాంగ్ నిరంతరం తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆపరేషన్ పూర్తయిన 13 రోజుల తర్వాత గత నెల 28న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.

News September 12, 2024

కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం ఏచూరి ప్రస్థానమిదే..

image

★1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిక
★1977-78లో మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నిక
★1978లో SFI అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక
★1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నిక
★2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
★2015, 18, 22లో సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా ఎన్నిక

News September 12, 2024

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్: పంకజ్ జైన్

image

డిసెంబర్ 2021 తర్వాత తొలిసారి క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. మరికొన్నాళ్లు ఇదే రేటు కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. చమురు ఉత్పత్తిని పెంచాలని OPEC+ దేశాలను ఇండియా కోరడంతోపాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.

News September 12, 2024

చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగి..

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో ఈ కమ్యూనిస్టు దిగ్గజం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1974లో SFIలో చేరిన సీతారాం, ఏడాది తర్వాత CPM పార్టీలో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.

News September 12, 2024

నూడిల్స్ తింటున్నారా?

image

నూడిల్స్‌ను తినడం మానుకోవడం మంచిదని ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బరా ఓ’నీల్ తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం అందించడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. నూడుల్స్‌లో పోషకాలు శూన్యమని, గోధుమ, సింథటిక్ & MSG, కార్సినోజెనిక్ ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుందని చెప్పారు. నూడుల్స్ తినడం వల్ల జీర్ణాశయంలో మంటగా ఉంటుందని, క్రమంగా రుచిని గుర్తించే స్వభావం తగ్గుతుందన్నారు.

News September 12, 2024

కాబోయే భర్తకు రూ.30 లక్షల జీతం ఉండాలి.. డివోర్స్‌డ్ మహిళ పోస్ట్!

image

నాగ్‌పూర్‌కు చెందిన డివోర్స్‌డ్ మహిళ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్‌ గురించి చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది. ‘నాకు 39 ఏళ్లు. ఏడాదికి రూ.1.3లక్షలు సంపాదిస్తా. కాబోయే భాగస్వామి అవివాహితుడై ఉండాలి. ఏడాదికి రూ.30 లక్షల జీతం రావాలి. 3BHK ఫ్లాట్ ఉండాలి. నాతోపాటే నా తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇంటి పనుల కోసం పనిమనిషిని ఉంచాలి. అత్తామామలతో ఉండలేను. వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాలి’ అని ప్రకటనలో ఉంది.

News September 12, 2024

స్టాక్ మార్కెట్ల జోష్‌కు కారణాలివే

image

* US CPI డేటా అంచనాలను మించి మెరుగ్గా ఉండటం * US ఫెడ్ వడ్డీరేట్లను 200 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తుందన్న అంచనాలు * 2026 ఆగస్టు నాటికి ఆర్బీఐ రెపోరేటును 4 సార్లు తగ్గిస్తుందన్న అంచనాలు * క్రూడాయిల్ ధరలు మూడేళ్ల కనిష్ఠానికి చేరడం, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ సగటు ధర 70 డాలర్లే * బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్, ఆటో, మెటల్ షేర్లలో ర్యాలీ * బూస్ట్ ఇచ్చిన FIIలు, పాజిటివ్ సెంటిమెంట్ * డాలర్ సూచీ బలహీనత

News September 12, 2024

BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

News September 12, 2024

మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News September 12, 2024

చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.