India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసులు ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేశారు. ఉప్పల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీమాధవి కారులో తీసుకెళ్లారు. ఆమె తాను సీటు బెల్ట్ ధరించడంతో పాటు వినాయకుడికి కూడా బెల్టు పెట్టడం విశేషం. అంతటి గణపయ్యనే సేఫ్టీ కోసం సీటు బెల్టు ధరించినప్పుడు మనమెందుకు అలా చేయకూడదు అని పోలీసులు ట్వీట్ చేశారు.
స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ రికార్డులు బద్దలు కొట్టాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. NSE నిఫ్టీ ఏకంగా 470 పాయింట్లు లాభపడి 25,388 వద్ద ముగిసింది. 15 నిమిషాల్లోనే 193 పాయింట్లు ఎగిసింది. BSE సెన్సెక్స్ 1439 పాయింట్లు ఎగిసి 82,962 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్ల మేర సంపద పోగేశారు. నిఫ్టీలో నెస్లే తప్ప అన్ని షేర్లూ పెరిగాయి. హిందాల్కో, ఎయిర్‌టెల్, NTPC టాప్ గెయినర్స్.
ఉద్యోగులుగా కాదు ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని Gen Z యువత కోరుకుంటోంది. 1997-2012లో జన్మించిన వారిని జనరేషన్ Z అని పిలుస్తారు. 77% మంది తామే బాస్‌లుగా ఉండాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వీరిలో 39% మంది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలమని నమ్ముతున్నారు. ఆవిష్కరణ, సాంకేతికత, స్వాతంత్య్రమే భవిష్యత్తు అని ఈ తరం నిరూపిస్తోంది.
TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఆయన భారత్‌ను విడిచి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు. దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించిన విషయం తెలిసిందే.
వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.
AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
AP: వరద బాధితుల్ని ఆదుకోకుండా జైలులో ఉన్న పార్టీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారని MLA గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బాధితులకు GOVT అందిస్తున్న సాయంపై ఆరోపణలు చేస్తే చరిత్రహీనులుగా మారుతారు. ఎన్నికల్లో YCPని ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌లో మార్పు రాలేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారు. కూటమి సర్కార్ గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారు’ అని అన్నారు.
భారత NSA అజిత్ ధోవల్, రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ సెర్గీ షోయిగు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఓవైపు బ్రిక్స్ NSAల సమావేశాలు జరుగుతుండగానే వీరిద్దరు భేటీకావడం గమనార్హం. పరస్పరం లబ్ధిచేకూర్చే అంశాలపై వీరు మాట్లాడుకున్నారని తెలిసింది. భారత్ తమలాగే ఆలోచించే భాగస్వామి అని, విశ్వాస ఆధారిత రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారని ఢిల్లీలోని రష్యా ఎంబసీ ప్రకటించింది.
TG: MLA కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని KTR ఖండించారు. ‘పట్టపగలే MLAపై హత్యాయత్నమా? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్‌ను గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? పార్టీ ఫిరాయించిన MLAలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్‌ను టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా CM చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని మండిపడ్డారు.
పెద్దపేగు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, 45 ఏళ్లు వచ్చాక ఈ వ్యాధి బారిన పడొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి పెద్దపేగు క్యాన్సర్‌కు కారకం కావొచ్చని సూచించారు. ‘శారీరక శ్రమ లేకపోవడం. పండ్లు&కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం. తక్కువ ఫైబర్ – అధిక కొవ్వు ఆహారం. ప్రాసెస్ చేసిన మాంసాలు అధికంగా ఉండే ఆహారం తినడం. ఊబకాయం, ఆల్కహాల్ తీసుకోవడం’ వంటివి క్యాన్సర్ కారకాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.