India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైదరాబాద్‌లో మెట్రో లేని రూట్లలో ప్రతి 10 నిమిషాలకో బస్సు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో రైళ్ల తరహాలోనే బస్సులు కూడా సమయపాలనతో నడిచేలా చూడాలని సంస్థ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్-మణికొండ రూట్(47ఎల్ బస్సులు)లో నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యతో మెట్రోకు దీటుగా బస్సుల్లో రద్దీ పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన డెంగీ టీకా(TAK-003)కు WHO ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపునిచ్చింది. ఈ హోదా లభించిన రెండో టీకా ఇదే కావడం విశేషం. దీనివల్ల యునిసెఫ్, పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఈ వ్యాక్సిన్‌ను సేకరిస్తాయి. HYDలోని బయోలాజికల్ ఇ.లిమిటెడ్ యూనిట్లలో ఈ టీకా 5 కోట్ల డోసులు ఉత్పత్తి కానున్నాయి. కాగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల డెంగీ కేసులు నమోదవుతున్నాయి.
కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల తొలి వారం అండమాన్ దీవుల్లో మొదలవనుంది. తొలి షెడ్యూల్ దాదాపు 40 రోజులు సాగుతుందని వార్తలు వస్తున్నాయి. లవ్, యాక్షన్ అంశాలతో రూపొందే ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
యుద్ధకాంక్షతో రగిలిపోయే పొరుగుదేశాలు, మనకు సహకరించని అగ్రదేశాలకు భారత్ ‘అణు’ సత్తాతో హెచ్చరికలు జారీ చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యింది. 1974 మే 18న రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్ష నిర్వహించింది. ఈ విషయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సాహసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రపంచదేశాల ఒత్తిళ్లను ఎదుర్కొని మొండిగా అడుగు ముందుకేసి భారత్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లారు.
ముంబై ఇండియన్స్ మరోసారి చివరి స్థానంలో నిలిచి చెత్త రికార్డు మూటగట్టుకుంది. 2022లోనూ 10వ స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి కూడా పదో స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు ఈసారి ఫైనల్ చేరి కప్పు కొడుతుందని ముంబై అభిమానులు ఆశించారు. కానీ.. ముంబైకు గత మూడేళ్లుగా కలిసి రావడం లేదు. 2013 నుంచి 2020 మధ్య 8ఏళ్లలో ఏకంగా 5 టైటిల్స్ గెలిచిన ఆ జట్టు ఆ తర్వాత కనీసం ఫైనల్ చేరలేకపోయింది.
TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. వానాకాలం వచ్చేలోగా ఈ మూడు బ్యారేజీల పరిరక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన విషయం తెలిసిందే.
కొవిడ్ సమయంలో రద్దయిన ముంబై- విజయవాడ విమాన సర్వీసులను జూన్ 15 నుంచి పున:ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. రోజూ మ.3.55కు ముంబై నుంచి బయలుదేరి సా.5.45కు గన్నవరానికి విమానం చేరుకుంటుందని తెలిపింది. అలాగే ఇక్కడి నుంచి రా.7.10కి బయలుదేరి రా.9 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందని పేర్కొంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ఆయుధ ప్రయోగాల్లో ఉత్తర కొరియా దూకుడును కొనసాగిస్తోంది. బాలిస్టిక్ క్షిపణిని జపాన్ సముద్రంలోకి ప్రయోగించామని తాజాగా ప్రకటించింది. అటు.. తమ తీరంలోకి స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణులు వచ్చి పడ్డాయంటూ దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. గత కొంతకాలంగా క్రూయిజ్, హైపర్‌సోనిక్, బాలిస్టిక్ క్షిపణుల్ని వరసగా పరీక్షించి ప్యాంగ్యాంగ్ దక్షిణ కొరియాను కలవరపెడుతోంది.
AP: ఖరీఫ్-2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.
AP: కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు నేటి నుంచి ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. ఇవాళ సాయంత్రం అనంతలక్ష్మీ సత్యవతీ దేవి, సత్యదేవుడిని వధూవరులను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు రాత్రి 9 గంటలకు కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం తర్వాత 10వేల మంది భక్తులకు ప్రసాదం, అక్షతలు పంపిణీ చేస్తామని ఆలయ ఈవో రామచంద్ర తెలిపారు.
Sorry, no posts matched your criteria.