India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హీరో సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ మూవీ రిలీజైన వారం రోజులకే ఓటీటీకి వచ్చేసింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెద్దగా లేకపోవడంతో మేకర్స్ దీన్ని ఓటీటీలో విడుదల చేశారు. కొరటాల శివ సమర్పణలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇవాళ్టి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు.
AP: పోలింగ్ రోజున తనకు రావాల్సిన 1000 ఓట్లను వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ రాకుండా చేశారని పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఆరోపించారు. తాను ఆరోజు ఒక్క మాట చెప్పి ఉంటే జోగి రమేశ్ పోరంకి దాటేవారు కాదన్నారు. మైలవరం నుంచి తొత్తులను తెచ్చుకుని పెనమలూరులో గెలవాలనుకుని విఫలయత్నం చేశారని దుయ్యబట్టారు. జూన్ 4న ఆట ప్రారంభం అవుతుందని చెప్పారు.
ఢిల్లీ CM కేజ్రీవాల్ కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని BJP నేత, హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’ అని కేజ్రీవాల్ అన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. ఇంతకు మించి కోర్టు ధిక్కరణ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పులిస్తుందనేదే కేజ్రీవాల్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు.
ఈసారి IPL ట్రోఫీని ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో RCB ఆడుతోందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అన్నారు. ‘కప్ కోసం గత 16 ఏళ్లుగా RCB పోరాడుతోంది. కానీ దురదృష్టం ఆ జట్టును వీడట్లేదు. ఈసారి బెంగళూరు ప్లేఆఫ్స్ చేరేందుకు మంచి అవకాశాలున్నాయి. గత 4 మ్యాచుల్లో ఆడిన కసితోనే CSKపైనా ఆడాలి. జట్టు ఫామ్‌లో ఉండటం RCBకి కలిసొస్తుంది’ అని లారా తెలిపారు.
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికపై గతంలోనూ విమర్శలు వచ్చాయని BCCI సెక్రటరీ జైషా అన్నారు. ఈసారి సెలక్షన్ కమిటీ సమతూకమైన జట్టును ప్రకటించిందని, కేవలం IPL ఫామ్‌నే ప్రామాణికంగా తీసుకోకుండా.. విదేశాల్లో అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లను ఎంపిక చేశామన్నారు. కార్యదర్శిగా తన పాత్ర కేవలం సమాచారం ఇవ్వడమేనని, జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ నిర్ణయమన్నారు.
CM మమతా బెనర్జీపై మాజీ జడ్జీ, BJP నేత అభిజిత్ గంగోపాధ్యాయ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభిజిత్ ‘సందేశ్‌ఖాలీ BJP అభ్యర్థి రేఖా పాత్రను రూ.2000కి కొనుగోలు చేశామని తృణమూల్ అంటోంది. మమతా బెనర్జీ.. మరి మీ రేటెంత? రూ.10 లక్షలా?’ అని వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన TMC.. ఆయన హద్దులు మీరారంటూ ECకి ఫిర్యాదు చేసింది.
TG: నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయాలని HYD పోలీసులు నిర్ణయించారు. నిన్న ఒక్కరోజే 20కి పైగా బైక్‌లను జప్తు చేశారు. కొత్త నంబర్ ప్లేట్ బిగించిన తర్వాతే వాటిని తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల HYDలో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు CC కెమెరాలను పరిశీలించగా.. వారు ఉపయోగించిన బండ్లకు నంబర్ ప్లేట్లు లేవు. దీంతో అలాంటి వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టారు.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రేయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మనం’ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 23న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘నువ్వే మా స్ఫూర్తివి. నువ్వే మా ఆర్తివి. తెలుగు వారి గుండెల్లో శాశ్వతమైన కీర్తివి’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.73,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.67,600గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేటు రూ.92.500గా ఉంది.
AP: జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు చూసి సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయని ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీకి 25 అసెంబ్లీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇవాళ తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.