India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో సందడే కనిపించడంలేదు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తికావడంతో ఎంపీ ఎన్నికలను ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చాలామంది అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేయడంలేదు. దీంతో చాలామందికి తమ ఎంపీ అభ్యర్థులు ఎవరో తెలియని పరిస్థితి. గ్రామీణ ఓటర్లను ఎలక్షన్స్ గురించి ప్రశ్నిస్తే.. ‘అవును.. ఎంపీ ఎలక్షన్లంటగా’ అని దీర్ఘం తీస్తున్నారు.
ముందుగా ప్రకటించినట్లుగానే రఫాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఈజిప్టు, ఖతర్ రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్ నిరాకరించింది. ఆ ఒప్పందంలో తమ అసలైన డిమాండ్లను ప్రస్తావించలేదని తేల్చిచెప్పింది. నిరాకరించిన గంటల వ్యవధిలోనే దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం ట్వీటర్‌లో ఈ విషయాన్ని తెలిపింది. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని పలు దేశాలు ఖండిస్తున్నాయి.
బుమ్రా కుమారుడి ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. నిన్న SRHతో మ్యాచ్ చూసేందుకు ముంబై స్టార్ బౌలర్ బుమ్రా భార్య సంజన తన కుమారుడితో కలిసి వచ్చారు. అభిషేక్ శర్మను బుమ్రా ఔట్ చేయగానే స్టాండ్స్‌లో ఉన్న ఆయన భార్య, కుమారుడిని కెమెరామన్ చూపించారు. అంగద్ గతేడాది సెప్టెంబర్ 4న జన్మించాడు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి పెరిగిపోతున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ వెల్లడించింది. దీంతో చరిత్రలో అత్యంత వేడి సంవత్సరాల్లో తొలి ఐదు స్థానాల్లో 2024 నిలుస్తున్నట్లు తెలిపింది. 2023 జూన్ నుంచి 2024 మార్చి వరకు రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదైనట్లు పేర్కొంది. ఇక ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని వివరించింది.
నాయకుడిగా ఒక్కోసారి ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్ గంభీర్ అన్నారు. ‘జట్టును ముందుండి నడిపించేటప్పుడు దూకుడైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో అలాంటివి కొన్ని జరిగాయి. కానీ అలా చేసి ఉండకపోతే నా జట్లు దూకుడుగా ఆడి ఉండేవి కాదు. నిజ జీవితంలో ప్రవర్తనను బట్టే ఆటగాళ్లను అంచనా వేయాలి’ అని సూచించారు.
సిగరెట్ తాగనివారు ‘లూజర్స్’ అని సంభోదించిన ఓ యువతికి ఓ డాక్టర్ ట్విటర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఓ 23 ఏళ్ల యువతి ధూమపానం కారణంగా ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని, ఆరోగ్యంగా ఉండేందుకు లూజర్స్ అయినా పర్వాలేదంటూ కామెంట్ చేశారు. ఆమె గత 12 ఏళ్లుగా సిగరెట్ తాగుతోందని, ఇంట్లోవారికి ఈ అలవాటు లేదని చెప్పారు. ధూమపానం ఆపేసిన ఏడాది తర్వాత గుండె జబ్బుల రిస్క్ 50 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ మతిశా పతిరణ తొడ కండరాల గాయం కారణంగా IPL 2024 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో జట్టుకు వీడ్కోలు పలుకుతూ ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘2024 IPL ఛాంపియన్ ట్రోఫీని త్వరలోనే CSK గదిలో చూడాలనే ఏకైక కోరికతో జట్టుకు వీడ్కోలు పలుకుతున్నా. చెన్నై నుంచి నేను పొందిన ప్రేమ, ఆశీర్వాదాలకు CSK మేనేజ్మెంట్‌కు కృతజ్ఞతలు’ అని పతిరణ పేర్కొన్నారు.
మూడో దశ ఎన్నికల్లో భాగంగా నేడు యూపీలో 10 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వంద మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1.88 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మొయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్నారు. 2022లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం. రాష్ట్ర మంత్రి జయవీర్ సింగ్ ఆమెపై పోటీలో ఉన్నారు.
ఏపీలో పథకాల నిలుపుదల సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసన్నారు. తెలంగాణలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఈసీ అంగీకరించిందని దుయ్యబట్టారు. నిధుల విడుదలలో తెలంగాణకో న్యాయం.. ఏపీకో న్యాయమా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న నకిలీ వీడియోలు, ఫేక్ న్యూస్‌పై EC ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన 3గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని పేర్కొంది. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో EC ఈవిధంగా స్పందించింది.
Sorry, no posts matched your criteria.