India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించారు. 84 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు ఈ వర్గాలకు కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే, ఈసారి 4 సీట్లు ఎక్కువగా ఇచ్చారు. బీసీలకు 2019లో 41 సీట్లు కేటాయిస్తే, ఈసారి 48 సీట్లు కేటాయించారు.
తెలంగాణ ప్రజల సమస్యలు తన వరకు చేరాలంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 17కు 17 స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. ‘మార్పునకు మోదీ గ్యారంటీ అవసరం. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ’ అని అన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని BRS మోసం చేస్తే.. దళిత డిప్యూటీ సీఎంను కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు.
కవితను అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆమె లాయర్ వాదనలపై ఈడీ లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దు. సెప్టెంబర్ 15 నుంచి 10 రోజులు సమన్లు ఇవ్వం అని మాత్రమే చెప్పాం. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారు. వేరేవారికి ఇచ్చిన ఉత్తర్వులను మీకు అన్వయించుకోవద్దు. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదు’ అని జడ్జికి విన్నవించారు.
IIT, IIM వంటి టాప్ విద్యాసంస్థల్లో చదివిన వారు కూడా పని ఒత్తిడికి బలైపోతున్నారు. ఇటీవల ముంబైలోని మెక్‌కిన్సే & కంపెనీలో సౌరభ్ (25) ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు ఉదాహరణ. ఇతను ఐఐటీ మద్రాస్, ఐఐఎం కలకత్తాలో చదువుకున్నాడు. మనుషులను ఓ పని యంత్రంలా తయారు చేసే విద్యావ్యవస్థ మారాలని, కంపెనీలు ఉద్యోగులకు తగిన వాతావరణం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ కామెంట్?
మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే, అరెస్టులకు కల్వకుంట్ల కుటుంబం భయపడదని, పోరాటం వారి బ్లడ్‌లో ఓ పార్ట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నాయి. ‘కాళ్లు ముడుచుకొని కూర్చోవడం రాదు ఆ కుటుంబానికి.. కాలర్ ఎగరేయడం మాత్రమే వచ్చు. ఈ అరెస్టుకు BRS వణికిపోతుందని మీరు అనుకుంటే, మీ అంత పిచ్చోళ్లు లేరు’ అంటూ కవితకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
TG: గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి NDA ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రూపంలో రెండు విసురురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పొడి చేశాయి. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. గొయ్యిలో నుంచి బయటికి వస్తే నుయ్యిలోకి.. పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయ టీ20ల్లో 400 ఫోర్లు బాదిన తొలి బ్యాటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ రికార్డు సృష్టించారు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతను 401 ఫోర్లతో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బాబర్ ఆజమ్ (395), విరాట్ కోహ్లీ (361), రోహిత్ శర్మ (359, డేవిడ్ వార్నర్ (320) ఉన్నారు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ (190) తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
AP: దివంగత YS వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ నెలకొంది. నిన్న వివేకా వర్ధంతి కార్యక్రమంలో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కొద్దిరోజుల నుంచి సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ YCPపై విమర్శల డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో వీరి పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చని, త్వరలోనే స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే అన్ని వర్గాల మద్దతు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.
TG: ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే HYDలో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ED అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ED కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
పౌరసత్వ సవరణ చట్టం అమలును సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులను 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6బీ ప్రకారం స్వీకరించొద్దన్నారు. ప్రభుత్వం అఫ్గాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం ఇవ్వొచ్చు కానీ మతం ఆధారంగా ఇవ్వకూడదని ఒవైసీ ఇటీవల సూచించారు.
Sorry, no posts matched your criteria.