India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తికాగానే అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలవగానే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పదేళ్లలో తెలంగాణ విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
AP: వైసీపీ చీఫ్, సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నరసాపురంలో ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం 3 గంటలకు కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
TG: ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. ఈ విషయంలో తాను చెప్పిన దాంట్లో తప్పుందని తేలితే చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఒకవేళ రేవంత్‌ది తప్పైతే ఆయనను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని ట్వీట్ చేసినందుకు తమ నేత క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని KTR అన్నారు.
TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ ఈరోజు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ధర్మపురి, సాయంత్రం 4గంటలకు సిరిసిల్లలో జరిగే జన జాతర బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30గంటలకు ఉప్పల్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని, ఆ తర్వాత కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతారు.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిని ఇంటింటికి ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, ఇంటింటికి ఉచిత సోలార్ సిస్టమ్ వంటి హామీలు ఉన్నట్లు సమాచారం.
బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె తన ఆస్తుల విలువ రూ.97.17 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.51.20 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.45.97 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తుల విలువ రూ.55.69 కోట్లు ఉండగా.. ఐదేళ్లలో 43శాతం పెరిగింది.
బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఛేదనలో 18.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అందుకుంది. భారత ప్లేయర్లు షెఫాలి వర్మ(51), స్మృతి మంధాన(47) రాణించారు.
తమిళ దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను గతంలో చూసిన తెలుగు సినిమాలు కొన్ని తమిళ్ నుంచి కాపీ కొట్టారని అన్నారు. తాను తీసిన మూవీ కంటెంట్‌ను కూడా కాపీ చేశారని ఆరోపించారు. ఆ పగతోనే గత ఏడాది తెలుగు సినిమాలను కాపీ కొట్టి ‘విన్నర్’ మూవీ తీశానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘బాక్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
TG: హైకోర్టుకు సమ్మర్ వెకేషన్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి 31 వరకు సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కేసులు, పిటిషన్ల కోసం ప్రతి గురువారం బెంచ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అయితే దీని కోసం రెండు రోజుల ముందే పిటిషన్లు ఫైల్ చేయాలని పేర్కొన్నారు.
వారసత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి వాళ్ల అమ్మ(ఇందిరా గాంధీ)నుంచి ఆస్తికి బదులు మరణమే వారసత్వంగా వచ్చిందన్నారు. కాంగ్రెస్ బర్రెలు తీసుకుంటుందని ప్రధాని అబద్దాలు చెప్పడం మానేసి.. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆవులు, గేదేలకు షెల్టర్లు నిర్మించాలన్నారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.