news

News September 19, 2024

సౌదీ అరేబియాలో ఐపీఎల్ మెగా వేలం?

image

ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ సారి భారత్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వేలం నిర్వహించేందుకు ఆ దేశం కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15లోగా రిటెన్షన్ల ప్రక్రియ పూర్తి చేసి అదే నెల మూడు లేదా నాలుగో వారంలో వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రిటెన్షన్లపై బీసీసీఐ ఇంకా ఫ్రాంఛైజీలకు క్లారిటీ ఇవ్వలేదు.

News September 19, 2024

దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం: ఎన్ని రోజులంటే?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయి.

News September 19, 2024

స్కిల్ యూనివర్సిటీకి సహకరించండి: రేవంత్

image

TG: స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని CM విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.

News September 19, 2024

‘లారెన్స్ బిష్ణోయ్‌ని పిలవాలా?’.. సల్మాన్ తండ్రిని బెదిరించిన మహిళ

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను ఓ మహిళ బెదిరించింది. ముంబైలోని కార్టర్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ ఆయనను అడ్డగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్‌ని పిలవాలా?’ అంటూ ఆమె బెదిరించింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, కామెడీగా అలా అన్నట్లు వారు తెలిపారు. గతంలో సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.

News September 19, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జెడ్డా నుంచి వచ్చిన సకీనా అస్వస్థతకు గురై ఎయిర్‌పోర్టులోనే కుప్పకూలారు. సిబ్బంది వారిని అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు.

News September 19, 2024

రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమం

image

AP: రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు.

News September 19, 2024

హాఫ్ సెంచరీతో మెరిసిన జడేజా

image

భారత స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి బ్యాటు ఝళిపించారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో క్లిష్ట సమయంలో హాఫ్ సెంచరీ 50 (73బంతుల్లో) చేశారు. 144 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మరో సీనియర్ ఆల్‌రౌండర్ అశ్విన్‌తో (73*) కలిసి ఆదుకున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 272/6గా ఉంది.

News September 19, 2024

నాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఇవ్వాలి: జెత్వానీ

image

AP: తనకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి సినీ నటి జెత్వానీ ధన్యవాదాలు తెలిపారు. హోంమంత్రి అనితతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిస్థితులు మరెవ్వరికీ రాకూడదన్నారు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని పరిహారం కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జెత్వానీ వ్యవహారంలో ముగ్గురు IPSలపై ప్రభుత్వం వేటు వేసింది.

News September 19, 2024

కాసేపట్లో పవన్‌తో బాలినేని, ఉదయభాను భేటీ?

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మరికాసేపట్లో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను కలవనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ అనుచరులతో విజయవాడకు చేరుకున్నారు. పవన్‌తో భేటీ అనంతరం జనసేనలో చేరేదానిపై వీరు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.

News September 19, 2024

Stock Market: ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు

image

ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 316 పాయింట్ల లాభంతో 83,264 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 25,445 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ లాభాలను సూచీలు నిలుపుకోలేకపోయాయి. నిఫ్టీ 25,612 వ‌ద్ద‌- సెన్సెక్స్ 83,773 వ‌ద్ద రివ‌ర్స‌ల్‌ తీసుకున్నాయి. సూచీలు ఏ సెషన్‌లోనూ Day High క్రాస్ చెయ్య‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.