India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 339/6 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమైనా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (102) సెంచరీతో చెలరేగారు. రవీంద్ర జడేజా (86) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (56) అర్ధ సెంచరీతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మొహమూద్ 4, రానా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ/టీ తాగడం వల్ల గుండె, జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. చైనాలోని సూచౌ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ చౌఫు కే బృందం 1.80 లక్షల మందిపై అధ్యయనం జరిపింది. మితంగా తీసుకొనే కెఫిన్ (3 కప్పుల కాఫీ/టీ) కార్డియోమెటబోలిక్ మల్టీమోర్బిడిటీ, కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో సాయపడుతుందని వెల్లడించింది.
బంగ్లాదేశ్‌తో తన హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. కీలక ఆటగాళ్లు ఔటైన టైమ్‌లో 108 బంతుల్లో సెంచరీ చేసి జట్టును ఆదుకున్నారు. ఇది ఆయనకు 6వ సెంచరీ కావడం విశేషం. అశ్విన్‌కు తోడుగా ఉన్న మరో ఆల్‌రౌండర్ జడేజా సైతం సెంచరీని(79) సమీపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరి కౌంటర్ ఎటాక్‌కు బంగ్లా బౌలర్ల వద్ద సమాధానం కరవైంది.
TG: అత్యాచారం ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. గోవాలో అరెస్ట్ చేసి, స్థానిక కోర్టులో ఆయన్ను హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2020లో లైంగిక దాడి చేశారని బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా ఆమె అప్పటికి మైనర్ కావడంతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
బాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ సింగం అగైన్‌లో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దబాంగ్‌లో సల్మాన్ చేసిన చుల్‌బుల్ పాండే పాత్రనే ఈ చిత్రంలో కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న అజయ్ దేవగణ్, కరీనా, దీపిక, రణ్‌వీర్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లకు తోడు సల్మాన్ కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే.
మాజీ CM YS జగన్‌పై టీడీపీ ట్విటర్‌లో మండిపడింది. స్వామి వారి విగ్రహాన్ని నల్ల రాయి అని పగలగొడతా అని చెప్పిన అన్యమతస్థుడైన భూమనకు TTD ఛైర్మన్ పదవి ఇచ్చారంటూ ఆరోపించింది. ‘ జగన్ రెడ్డీ.. తిరుమల గురించి నువ్వు, నీ సైకో బ్యాచ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడివి కాకపోతే తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు. ఆయనే చూసుకుంటాడు’ అని హెచ్చరించింది.
ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ సారి భారత్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఆక్షన్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. వేలం నిర్వహించేందుకు ఆ దేశం కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 15లోగా రిటెన్షన్ల ప్రక్రియ పూర్తి చేసి అదే నెల మూడు లేదా నాలుగో వారంలో వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా రిటెన్షన్లపై బీసీసీఐ ఇంకా ఫ్రాంఛైజీలకు క్లారిటీ ఇవ్వలేదు.
TG: రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయి.
TG: స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తామని CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో భేటీలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో సహకరించాలని CM విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ విజన్ ఉన్న నాయకుడని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌ను ఓ మహిళ బెదిరించింది. ముంబైలోని కార్టర్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ ఆయనను అడ్డగించారు. ‘లారెన్స్ బిష్ణోయ్‌ని పిలవాలా?’ అంటూ ఆమె బెదిరించింది. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, కామెడీగా అలా అన్నట్లు వారు తెలిపారు. గతంలో సల్మాన్‌ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.