news

News May 1, 2024

స్మార్ట్ మిస్సైల్ ప్రయోగం సక్సెస్

image

DRDO పరీక్షించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో(SMART) ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు. DRDO-ఇండియన్ నేవీ సంయుక్తంగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ఇది శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంలో సాధారణ టార్పిడోల కంటే చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది.

News May 1, 2024

పెళ్లిలో డ్రై ఐస్ తిని బాలుడి మృతి

image

డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఫంక్షన్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించిన డ్రై ఐస్‌ని తిన్న బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్‌గా పిలిచే డ్రై ఐస్ ఎంతో ప్రమాదకరం. ఐస్ క్రీమ్, ఇతర ఆహారాన్ని నిల్వ చేసేందుకు దీన్ని వాడుతారు. ముఖ్యంగా పిల్లలను దీనికి దూరంగా ఉంచాలి.

News May 1, 2024

ప్రజ్వల్‌ను రప్పించండి.. మోదీకి సిద్దరామయ్య లేఖ

image

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను విదేశం నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. ప్రజ్వల్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దుకు ఆదేశించాలని కోరారు. కాగా హసన్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్.. ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే అతడు జర్మనీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News May 1, 2024

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్

image

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక జనతాదళ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ‘నేను బెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నాను. నాకు వారం సమయం కావాలి. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తా. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది’ అని తెలిపారు. కాగా, ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలు, యువతులను ప్రజ్వల్ లైంగికంగా వేధించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

News May 1, 2024

మాడుగుల హల్వా గెలుపు రుచి చూసేదెవరో?

image

అనకాపల్లి(D) మాడుగులలో పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. YCP నుంచి మంత్రి బూడి ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె అనురాధను బరిలోకి దించారు. దీంతో ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు. ఇటు అనకాపల్లి MPగా ముత్యలానాయుడు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు, కుమార్తె పోరు ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మరోవైపు TDP నుంచి సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ రంగంలోకి దిగారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 1, 2024

దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట

image

TG: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో ఏడుగురు పోలీసులకు ఊరట లభించింది. నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు స్టే విధించింది. పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్కర్ కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నివేదిక సరిగా లేదని వాదించారు. వాదనల అనంతరం పోలీసులు, షాద్ నగర్ తహసీల్దార్‌పై చర్యలు వద్దంటూ కోర్టు ఆదేశించింది.

News May 1, 2024

సిద్ధూ మూసేవాలా హంతకుడు హతం!

image

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హతమయ్యాడు. బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఒకడైన బ్రార్‌ను USలో దల్లా లఖ్‌బీర్ అనే గ్యాంగ్ కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కాగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల పోలీసుల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో గోల్డీ బ్రార్ ఉన్నాడు. బ్రార్‌పై మరెన్నో కేసులు కూడా ఉన్నాయి. సత్వీందర్ సింగ్‌గా పిలిచే ఇతడు బాబర్ ఖల్సా అనే ఉగ్రవాద సంస్థకు పనిచేసినట్లు సమాచారం.

News May 1, 2024

LS ELECTIONS: భువనగిరిలో గెలుపెవరిది?

image

TG: భువనగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా, ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(INC) 2009లో గెలిచి, 2014లో ఓడారు. 2014లో గెలిచిన బూర నర్సయ్య గౌడ్ (BRS) 2019లో వెంకట్‌రెడ్డి (INC) చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కిరణ్ కుమార్(INC), బూర నర్సయ్య (BJP), క్యామ మల్లేశ్(BRS), జహంగీర్ (CPM) పోటీలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

News May 1, 2024

పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు దొంగతనం

image

AP: ఓ హోంగార్డు పోలీస్ స్టేషన్‌లోనే చోరీకి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని రెండో టౌన్ PSలో హోంగార్డు మనోజ్ దొంగతనం చేశాడు. నకిలీ తాళంతో బీరువాలోని రూ.5.63 లక్షలు కాజేశాడు. పోలీసులు అతడి నుంచి రూ.3 లక్షలు రికవరీ చేసి, రిమాండ్‌కు తరలించారు.

News May 1, 2024

ఈనెల 8,10న రాష్ట్రంలో మోదీ సభలు

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 8న వేములవాడ, వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. 10న మహబూబ్‌నగర్, HYDలోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోదీ ప్రసంగిస్తారు. అందుకు రాష్ట్ర బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.