news

News May 3, 2024

విషాదం.. 20 ఏళ్ల యువ క్రికెటర్ మృతి

image

ఇంగ్లండ్ యువ క్రికెటర్ జోష్ బేకర్ (20) కన్నుమూశారు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కౌంటీ జట్టు వోర్సెస్టర్‌షైర్ ప్రకటించింది. కానీ అతని మరణానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 47 మ్యాచులు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొత్తం 70 వికెట్లు తీశారు. బుధవారం వోర్సెస్టర్‌షైర్ తరఫున బరిలోకి దిగి 3వికెట్లు పడగొట్టిన బేకర్.. ఆకస్మికంగా మృతి చెందారు.

News May 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 3, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 3, శుక్రవారం
బ.దశమి: రాత్రి 11:24 గంటలకు
శతభిష: అర్ధరాత్రి 00:06 గంటలకు
దుర్ముహూర్తం:1.ఉదయం 08:16 నుంచి 09:07 గంటల వరకు
2.మధ్యాహ్నం 12:29 నుంచి 01:19 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 08:30 నుంచి 09:59 గంటల వరకు

News May 3, 2024

టుడే హెడ్‌లైన్స్

image

* కాంగ్రెస్, BRS పార్టీలు ప్రభుత్వాన్ని మా చేతిలో పెడతాయి: మోదీ
* కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి: రేవంత్
* బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోంది: కేటీఆర్
* AP: ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* టీడీపీతో పొత్తును ఎన్నికలకు పరిమితం చేయొద్దు: మోదీ
* IPL: రాజస్థాన్‌పై SRH విజయం

News May 2, 2024

IPL: రాజస్థాన్‌కు షాక్.. SRH విజయం

image

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR 200 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్(77), జైస్వాల్(67) అర్ధసెంచరీలు చేశారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.

News May 2, 2024

మిగతావారికి ఎల్లుండి పింఛన్ డబ్బులు: పంచాయతీరాజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో 65,49,864 మంది పెన్షనర్లలో 63,31,470 మందికి పింఛన్ పంపిణీ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. 15,13,752 మందికి ఇంటికి వెళ్లి నగదు అందజేసినట్లు చెప్పింది. బ్యాంకు ఖాతాలకు మొబైల్ నంబర్ అనుసంధానం కాని 74,399 మందికి డబ్బులు జమ కాలేదని పేర్కొంది. వారందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా ఈనెల 4న పంపిణీ చేస్తామని వెల్లడించింది.

News May 2, 2024

నితీశ్ రెడ్డి అరుదైన ఘనత

image

RRతో మ్యాచ్‌లో అదరగొట్టిన తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి(42 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 76*) ఓ అరుదైన ఘనత సాధించారు. 20 ఏళ్లలోపు ఒక ఇన్నింగ్సులో అత్యధిక సిక్సులు(8) కొట్టిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. 2017లో రిషభ్ పంత్ గుజరాత్ లయన్స్‌పై అత్యధికంగా 9 సిక్సర్లు బాదారు. అతనే 2018లో RCB, SRHలపై ఏడు సిక్సుల చొప్పున కొట్టారు.

News May 2, 2024

జగనన్న బాణం రివర్స్ అయింది: CBN

image

AP: జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయింది. అన్న, చెల్లి ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే. జగన్ అరాచక పాలన వల్ల అమరరాజా, లులూ వంటి పరిశ్రమలు పారిపోయాయి’ అని చంద్రబాబు తెలిపారు.

News May 2, 2024

TDPతో పొత్తుపై మోదీ కీలక వ్యాఖ్యలు

image

ఏపీలో TDPతో పొత్తు పెట్టుకోవడంపై PM మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పొత్తును ఎన్నికలకు పరిమితం చేయొద్దు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది మా సిద్ధాంతం. అందుకే మాకు మెజార్టీ ఉన్నా TDPని చేర్చుకున్నాం. లాభనష్టాలను లెక్కలేసుకుని రాజకీయాలు చేయం. ఆచరణ సాధ్యమైన చోటే పొత్తులు కుదుర్చుకుంటాం. ఇటీవల CBN-పవన్‌తో కలిసి పెద్ద ర్యాలీలో పాల్గొన్నా’ అని పేర్కొన్నారు.

News May 2, 2024

రోడ్డు ప్రమాదంలో రైనా కజిన్ బ్రదర్ మృతి

image

హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కజిన్ బ్రదర్ సౌరభ్ మృతి చెందారు. కాంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయం సమీపంలో సౌరభ్, అతని ఫ్రెండ్ శుభమ్ బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. పరారైన కారు డ్రైవర్ షేర్ సింగ్‌ను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.