India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కజిన్ బ్రదర్ సౌరభ్ మృతి చెందారు. కాంగ్రా జిల్లాలోని గగ్గల్ విమానాశ్రయం సమీపంలో సౌరభ్, అతని ఫ్రెండ్ శుభమ్ బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ మృతిచెందారు. పరారైన కారు డ్రైవర్ షేర్ సింగ్‌ను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని లాన్సెట్ జర్నల్‌లో పరిశోధకులు వెల్లడించారు. ‘పురుషులతో పోలిస్తే మహిళలకు దీర్ఘాయువు ఉన్న మాట నిజమే. కానీ మహిళలకే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. కండరాలు, ఎముకల సంబంధిత సమస్యలు సహా మానసిక వ్యాధులతో ఎక్కువగా బాధపడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యపరంగా పురుషులు, మహిళల మధ్య భేదం పెరుగుతుంటుంది’ అని పేర్కొన్నారు.
అవినీతిలో పతకాలు ఇస్తే కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్, బీఆర్‌ఎస్‌కు సిల్వర్ మెడల్ వస్తుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘CM రేవంత్ నన్ను బడే భాయ్ అని పిలవడం సంతోషకరం. కానీ పెద్దల నుంచి చిన్నవాళ్లు మంచి విషయాలు నేర్చుకోవాలి కదా? CMగా, PMగా అందరికంటే ఎక్కువ కాలం ఒక్క మచ్చా లేకుండా పనిచేశా. దీన్ని తమ్ముడు నేర్చుకోవాలి. అన్నిచోట్లా పెద్దన్నా పెద్దన్నా అని వెంటపడితే కుదరదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
TG: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పాసైన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విడతల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
కేంద్రంలో సంకీర్ణం వస్తుందని KCR చేస్తోన్న వ్యాఖ్యలపై PM మోదీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆయన ఎప్పుడూ ఇలాంటి అబద్ధాలే చెబుతారు. GHMC ఎన్నికలయ్యాక KCR నా దగ్గరికి వచ్చారు. NDAలో చేరతా అన్నారు. కానీ మేం విపక్షంలోనే ఉండి పోరాడతాం అని చెప్పా. ఇప్పుడు కాంగ్రెస్-BRS చెరోవైపు బండి(ప్రభుత్వం)ని లాగుతున్నాయి. త్వరలో దాన్ని బీజేపీ చేతిలో పెట్టి వెళ్లిపోతాయి. చూస్తూ ఉండండి’ అని పేర్కొన్నారు.
AP: వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని మండిపడ్డారు. YSR చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
కర్ణాటక, తెలంగాణ.. కాంగ్రెస్‌కు ATMలుగా మారిపోయాయని PM మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందే ఈ 2 రాష్ట్రాల్లో త్వరలో జరగబోతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది. INC, BRS ఒకటే. ప్రస్తుతం కమీషన్ లేకుండా ఏ పనీ జరగట్లేదు. లిక్కర్ స్కామ్‌లో BRS పేరుంది. ఇక టెక్నాలజీ హబ్‌గా ఉన్న కర్ణాటక ఇప్పుడు ట్యాంకర్ హబ్‌గా మారిపోయింది’ అని విమర్శించారు.
RRతో మ్యాచ్‌లో SRH 20 ఓవర్లలో 201/3 స్కోర్ చేసింది. తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 76* రన్స్ బాదారు. ట్రావిస్ హెడ్ 58, అన్మోల్‌ప్రీత్ 5, క్లాసెన్ 42* పరుగులు చేశారు. అవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశారు.
ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని ఆకర్షించడానికి కొత్త ఎత్తులు వేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ జిత్తులు ప్రజలకు తెలుసు. వాళ్లు 5 గ్యారంటీలు తెచ్చినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా ఓటర్ల మనసును మార్చలేరు. నేను వాళ్లలా కాదు. గాలి మాటలు చెప్పను.. చెప్పింది చేసి చూపిస్తా. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే వరకు విశ్రమించను’ అని తెలిపారు.
పెద్దపేగు క్యాన్సర్‌ను అవగాహన, ముందస్తు అప్రమత్తతతో అరికట్టవచ్చు. మలంలో రక్తం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాల్లో ఒకటిగా వైద్యులు తెలిపారు. ఆహారంలో తేడా, మరో కారణంతో రక్తం వచ్చిందని పొరబడకుండా పరీక్షలు చేయించుకోవాలని ఆంకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు అనుకోకుండా బరువు తగ్గడం, పొత్తి కడుపులో నొప్పి, జీవక్రియ అలవాట్లలో మార్పులు వంటి లక్షణాలుంటే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు.
Share It
Sorry, no posts matched your criteria.