news

News May 3, 2024

మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే?

image

మహేశ్ బాబు-రాజమౌళి చిత్ర షూటింగ్ ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ చెప్పారు. రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా.. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తన కోసం సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పాత్రకు తగ్గట్లు మహేశ్ తనని తాను మలుచుకుంటున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News May 3, 2024

మేలో 20 ఏళ్ల నాటి ఉష్ణోగ్రతలు రిపీట్?

image

AP: రాష్ట్ర ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. గత నెలలో టెంపరేచర్ 46 డిగ్రీల సెల్సియస్ తాకగా, ఈ నెల అంతకు మించి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు దాటేయొచ్చంటున్నారు. చివరిగా 2003లో రెంటచింతలలో 49.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News May 3, 2024

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొదట క్రిష్ దర్శకత్వం వహించగా అనివార్య కారణాలతో రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ బాధ్యతలు చేపట్టారు.

News May 3, 2024

టెట్ ఎగ్జామ్‌కు వేరే తేదీలు చూసుకోండి: సీఈవో

image

TG: ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ నిర్వహణపై ఆలోచన చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈవో లేఖ రాశారు. ఓట్లు వేయడానికి ఇబ్బందులు లేకుండా టెట్ పరీక్షలకు వేరే తేదీలను చూసుకోవాలని సూచించారు. ఈ నెల 20-30 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ సూచనప్రాయంగా తెలిపింది. ఇప్పటికే ఎగ్జామ్ తేదీని మార్చాలని అభ్యర్థులు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

News May 3, 2024

నేడు రాయ్‌బరేలీకి సీఎం రేవంత్?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో యూపీలోని రాయ్‌బరేలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కోసం ఆయన వెళ్తున్నట్లు సమాచారం. నామినేషన్ అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు రేవంత్ హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

News May 3, 2024

పవన్ నన్ను సన్మార్గంలో నడిపించారు: రాయుడు

image

AP: తప్పుడు దారిలో వెళ్తున్న తనను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సన్మార్గంలో నడిపారని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఆయన కూటమి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ‘YCPలో ఒక్కడే రాజు.. మిగతా అందరూ బానిసలే. ఆ పార్టీ ఓడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ ఎన్నికల్లో YCPని ఇంటికి పంపాలి. కూటమి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. అందుకే కూటమికి మద్దతు ఇవ్వండి’ అని ఆయన కోరారు.

News May 3, 2024

BREAKING: రాయ్‌బరేలీ బరిలో రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది. అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. వీరిద్దరు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

News May 3, 2024

రాజకీయ పార్టీలకు EC హెచ్చరిక

image

ఎన్నికల వేళ సర్వేలు, పథకాల లబ్ధి సాకులతో ఓటర్ల వివరాలు సేకరిస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఫోన్ల ద్వారా ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్న ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ చర్యలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ప్రచురణకర్తలు, ప్రింటింగ్ వివరాలు లేకపోతే చర్యలు తీసుకోవాలంది.

News May 3, 2024

మారుమూల ప్రాంత చిన్నారులకు టెన్నిస్ శిక్షణ

image

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. అస్సాంలోని మజూలి ద్వీపం, బొంగాయ్‌గాన్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన 25 మంది చిన్నారులకు టెన్నిస్ క్రీడలో శిక్షణ ఇవ్వనున్నారు. కమల్ ఇండియా ఫౌండేషన్(UK)తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. బెంగళూరులోని ఆర్బీటీ అకాడమీలో వీరికి శిక్షణ ఇస్తారు. చిన్నారులకు వసతితో పాటు విద్య అవసరాలను దాత సహకారంతో బోపన్న పర్యవేక్షిస్తారు.

News May 3, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR పేరు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ CM KCR పేరు వెలుగులోకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ మాజీ OSD రాధాకిషన్ రావు వాంగ్మూలంలో KCR పేరును ప్రస్తావించారు. ‘విపక్షాల ఎత్తుగడలను ముందుగానే తెలుసుకుని చిత్తు చేయడానికి తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులతో టాస్క్‌లు చేయించాం. KCRతోపాటు BRS నేతలకు ముప్పుగా ఉన్న వారిని గుర్తించి లొంగదీసుకున్నాం. కొన్ని సివిల్ వివాదాలు కూడా సెటిల్ చేశాం’ అని ఆయన వాంగ్మూలంలో చెప్పారు.