news

News May 4, 2024

నా జీవితంలో ప్రేమది కీలకపాత్ర: శోభిత

image

ప్రేమపై నటి శోభితా దూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ప్రేమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాను ఎక్కువగా పక్కవారిపై ఆధారపడతానని చెప్పారు. చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతానని.. సినిమాలో క్యారెక్టర్స్‌లాగా తాను స్ట్రాంగ్ కాదని చెప్పారు. కాగా ఇటీవల విడుదలైన ‘మంకీ మ్యాన్’ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

News May 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 4, 2024

తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ అత్యాచారం చేశాడు: బాధితురాలు

image

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న JDS MP ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అతనిపై అత్యాచారంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. తుపాకీతో బెదిరించి ప్రజ్వల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు JDS మహిళా కార్యకర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం బయటకు చెప్తే తనను, తన భర్తను చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. కాగా ప్రజ్వల్‌ను రక్షించేందుకు కేంద్రం యత్నిస్తోందని CM సిద్దరామయ్య ఆరోపించారు.

News May 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 4, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:32
సూర్యోదయం: ఉదయం గం.5:49
జొహర్: మధ్యాహ్నం గం.12:13
అసర్: సాయంత్రం గం.4:40
మఘ్రిబ్: రాత్రి గం.6:37
ఇష: రాత్రి గం.07.54
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News May 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News May 4, 2024

శుభ ముహూర్తం

image

తేది: మే 4, శనివారం
బ.ఏకాదశి: రాత్రి 08:39 గంటలకు
పూర్వాభద్ర: రాత్రి 10:07 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 05:41 నుంచి 07:23 గంటల వరకు
వర్జ్యం: ఉదయం 05:58 నుంచి 07:26 గంటల వరకు

News May 4, 2024

TODAY HEADLINES

image

AP: చంద్రబాబు సూపర్-6లో రూ.4వేల పెన్షన్ మాయం: సీఎం జగన్
25 ఎంపీ స్థానాలూ గెలుస్తాం: చంద్రబాబు
సీఎం జగన్‌కు వెన్నులో భయం తెప్పించాలి: పవన్
TG:బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది: సీఎం రేవంత్
TG:అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే
మోదీ హయాంలో దేశం నాశనం: కేసీఆర్
HYDను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర: హరీశ్
IPL.. ముంబైపై KKR విజయం

News May 4, 2024

వారికి రేపు, ఎల్లుండి పెన్షన్లు పంపిణీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అయితే బ్యాంకు అకౌంట్లు యాక్టివ్‌‌గా లేని 74,399 మందికి డీబీటీ ద్వారా నగదు జమ కాలేదు. వీరందరికీ నేరుగా నగదును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను పెన్షన్ యాప్‌ నందు అప్‌డేట్ చేశారు. వీరందరికీ పెన్షన్లు అందజేసే ప్రక్రియను 4, 5 తేదీల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

News May 4, 2024

‘కల్కి 2898 ఏడీ’ ప్రీ బిజినెస్ రూ.700 కోట్లు!

image

భారీ అంచనాలతో వస్తోన్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఏకంగా రూ.700కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు డిజిటల్ రైట్స్ సైతం ఓ రేంజ్‌లో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. రూ.200 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

News May 3, 2024

IPL: ముంబైపై KKR విజయం

image

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఓటమి పాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్(56) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 145 పరుగులకే ఆలౌటైంది. KKR బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్, నరైన్, రసెల్ తలో 2 వికెట్లు తీశారు. ఈ పరాజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి.