news

News May 4, 2024

5 కోట్ల మందికి జనసేన ధైర్యాన్ని నూరిపోసింది: పవన్

image

AP: ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురుతిరగాలనిపిస్తుందని, అలాగే ఓటమి జనసేనను బలపడేలా చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. 5 కోట్ల మందికి తమ పార్టీ ధైర్యాన్ని నూరిపోసిందన్నారు. రేపల్లె సభలో మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం ఉంటుంది. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరం. YCP వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీలు కలిసి రావాలి’ అని పిలుపునిచ్చారు.

News May 4, 2024

‘నేపాల్ కరెన్సీపై భారత ప్రదేశాలు’.. అసలు వివాదం ఏంటి?-1/2

image

కొత్త రూ.100 కరెన్సీలో భారత్‌లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలను ప్రింట్ చేయనున్నట్లు నేపాల్ ప్రకటించడం వివాదాస్పదమైంది. బ్రిటిషర్ల కాలం నుంచే ఈ వివాదం ఉంది. కాలాపానీ ప్రాంతంలో ప్రవహించే కాళీ నది ఇరు దేశాలకూ సరిహద్దు. నేపాల్ రాజ్యానికి బ్రిటిషర్లకు మధ్య 1816లో తొలిసారిగా దీనిపై ఒప్పందం జరిగింది. కాళీ నది ప్రవాహ తీరులో మార్పు, నది పుట్టుకపై భిన్నవాదనలు సమస్యగా మారాయి.

News May 4, 2024

‘నేపాల్ కరెన్సీపై భారత ప్రదేశాలు’.. అసలు వివాదం ఏంటి?-2/2

image

1962 ఇండో-చైనా యుద్ధంలో భారత్‌కు మద్దతుగా తమ రాజు మహేంద్ర కాలాపానీని తాత్కాలికంగా వాడుకోమన్నారు అనేది నేపాల్ వాదన. 19వ శతాబ్దం నుంచి ఉన్న అక్కడి రెవెన్యూ, అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ చూపి ఆ ప్రాంతం ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ అంటోంది. 1998లో దీనిపై అధికారిక చర్చలు జరిగినా ఫలించలేదు. 2019లో భారత్ మ్యాప్‌లో ఈ ప్రాంతాలను కేంద్రం చేర్చడంతో వివాదం ముదిరింది. నేపాల్ సైతం తన వెర్షన్ రూపొందించుకుంది.

News May 4, 2024

విజయానికి ఆర్టీసీ బస్సు మెట్టు!

image

ఎన్నికల్లో విజయమే లక్ష్యం. ఏం చేయాలి? ఏ పథకం ప్రకటించాలి? అంటే ప్రస్తుతం పార్టీలకు ముందుగా గుర్తొస్తోంది.. మహిళామణులకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడిదే విజయమంత్రంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఈ స్కీమ్ ప్రకటించిన ఢిల్లీ(ఆప్), పంజాబ్(ఆప్), TN(DMK), కర్ణాటక(కాంగ్రెస్), TG(CONG)రాష్ట్రాల్లో ఆయా పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు APలో TDPని ఈ హామీ అధికారం పీఠం ఎక్కిస్తుందో? లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News May 4, 2024

మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు: CBN

image

జగన్ ప్రజలకు రూ.10 ఇచ్చి, రూ.100 లాక్కున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్టు. ప్రజల భూములపై కన్ను పడింది. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? మన మేనిఫెస్టో చూశాక జగన్ భయపడ్డాడు. ఓటమి ఖాయమని ఆయనకు అర్థమైంది. కూటమి వచ్చాక రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తాం. ఆదాయం పెంచి పేదలకు పంచుతాం’ అని హామీ ఇచ్చారు.

News May 4, 2024

ఈ అభివృద్ధి చంద్రబాబుకు కనిపించడం లేదా?: జగన్

image

చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే అని జగన్ విమర్శించారు. ‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. నా హయాంలో అభివృద్ధి లేదని ప్రచారం చేస్తున్నారు. కొత్తగా 4 ఓడరేవులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఇవి చంద్రబాబుకు కనిపించడం లేదా? నాడు-నేడుతో స్కూళ్లను అభివృద్ధి చేశాం. వాలంటీర్లతో పథకాలు చేరవేస్తున్నాం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం’ అని చెప్పారు.

News May 4, 2024

అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు పాకిస్థాన్ ఏడుస్తోంది: మోదీ

image

గత కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద అని, ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై విలపించేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన వచ్చాక పరిస్థితి మారింది. ఇప్పుడు సాయం కోసం పాక్ ఏడుస్తోంది. అప్పట్లో ప్రభుత్వం శాంతి పేరిట పాక్‌కు ప్రేమ లేఖలు పంపితే.. ఆ దేశం ఉగ్రవాదులను పంపేది. ఇప్పుడు అక్కడి ఇళ్లలోకి దూరి టెర్రరిస్టులను చంపేస్తున్నాం’ అని చెప్పారు.

News May 4, 2024

ప్రజలకు, నాకు మధ్య బీఆర్‌ఎస్ గ్యాప్ సృష్టించింది: తమిళిసై

image

TG: రాష్ట్ర ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ‘రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పెట్టడానికి ప్రయత్నించాను. కానీ అప్పటి BRS ప్రభుత్వం అందుకు సహకరించలేదు. కేంద్ర పథకాలను ప్రజలకు అందించాలనేదే నా లక్ష్యం’ అని సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదంటూ ఎద్దేవా చేశారు.

News May 4, 2024

ఎల్లుండి HYDకు ప్రియాంకా గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు రానున్నారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్‌పల్లి కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో రోడ్‌షో చేస్తారు.

News May 4, 2024

ఢిల్లీలో తొలిసారి.. ఎన్నికల బరిలో థర్డ్ జెండర్

image

లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి రాజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోటీ చేస్తోన్న తొలి థర్డ్ జెండర్ ఇతనే కావడం విశేషం. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను అధికారులు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమకు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు, విద్య, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజన్ కోరుతున్నారు.