India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫేక్ స్కైప్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ‘జాగ్రత్త! మీ పేరుతో డ్రగ్ పార్శిల్స్ వచ్చాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి ఖాతాలకు స్పందించకండి. అప్రమత్తంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
బ్రెజిల్‌లోని దక్షిణ రియో గ్రాండీ డోసుల్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గడచిన వారంలో 75మందికి పైగా ప్రజలు వరదల ధాటికి మృతిచెందారు. మరో 103మంది గల్లంతయ్యారు. 88వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. 16వేలమందికి తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. ఇది తాము మునుపెన్నడూ చూడని విపత్తు అని దేశాధ్యక్షుడు లూలా డ సిల్వ ప్రకటించారు.
AP: రాష్ట్రంలో అటు వైసీపీ, ఇటు కూటమి రెండూ బలంగానే కనిపిస్తున్నాయి. ఫలితాలపై ఇదీ అంచనా అని చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచే నియోజకవర్గాల్లో ప్రభుత్వోద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకం కానున్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్‌కోసం ఉద్యోగులు భారీ ఎత్తున దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరం. వారు ఎటువైపు మొగ్గుతున్నారన్నదే పలు చోట్ల ఫలితాల్ని శాసించే అవకాశం ఉంది.
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. పలు ప్రాంతాల్లో 46కు పైగా టెంపరేచర్ రికార్డు అయింది. నేడు నిర్మల్, ASF, మంచిర్యాల, NZB, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది. 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుజరాత్‌లో ఒక స్థానం ఏకగ్రీవం కాగా, మిగిలిన 25స్థానాలకు, కర్ణాటకలో 14, మహారాష్ట్ర 11, UP 10, MP 8, ప.బెంగాల్ 4, అస్సాం 4, బిహార్ 5, ఛత్తీస్‌గఢ్‌లో 7 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమిత్ షా, జ్యోతిరాధిత్య, దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన జుడీషియల్ కమిషన్ ఇవాళ్టి నుంచి రెండో దఫా విచారణ చేపట్టనుంది. ఈనెల 12 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా, రేపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. అనంతరం ఈనెల 9న HYDలో నీటిపారుదల అధికారులతో భేటీ కానుంది. బ్యారేజీల వైఫల్యాలపై ఇంజినీర్లు, నిర్మాణదారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులిచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంతో పాటు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉ.11 నుంచి మ.12.30 వరకు పాణ్యంలో జరిగే సభకు హాజరవుతారు. మ.1.30 గంటలకు కర్నూలు నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్లి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పు ఇవ్వనున్నారు. కవిత బెయిల్‌పై గత నెల 22న కోర్టులో వాదనలు జరగ్గా.. ఈ నెల 2కు తీర్పు రిజర్వ్ చేశారు. కానీ పలు కారణాలతో ఆరోజు కూడా తీర్పు వాయిదా పడింది.
AP: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం గుంటూరు జిల్లా రేపల్లెలో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి ఇకపై రోజుకు 80 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దర్శనానికి 3, 4 నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.