news

News May 13, 2024

హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్

image

మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని తీర్పులో పేర్కొంది.

News May 13, 2024

రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం: సీఈవో

image

TG: రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 1400 కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉన్నారు. మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయి. శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు రాలేదు. ఈరోజు 400 ఫిర్యాదులు వచ్చాయి. 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’ అని వివరించారు.

News May 13, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు రేపు వర్ష సూచన ఉన్నట్లు APSDMA ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

News May 13, 2024

జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన

image

ఎన్నికలను కవర్ చేస్తోన్న జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతోపాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని గిల్డ్ అన్ని రాజకీయ పార్టీలు, కార్యకర్తలను కోరింది.

News May 13, 2024

రాత్రి పది వరకూ పోలింగ్!

image

AP: పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్నవారు ఓటు వేయవచ్చు. అయితే, రాష్ట్రంలోని పలు కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు భారీగా ఉండటంతో రాత్రి పది వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

News May 13, 2024

ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు: ముకేశ్ కుమార్

image

AP: చిన్నచిన్న ఘటనలు మినహా రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ‘పోలింగ్ భారీగా జరిగింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. మాచర్ల, పుంగనూరు, పల్నాడు ఘటనలపై చర్యలు తీసుకున్నాం. పల్నాడులో 8 బూత్‌లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. డేటా మొత్తం సేఫ్‌గా ఉంది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు’ అని ఆయన వివరించారు.

News May 13, 2024

GT Vs KKR: ఉరుములు, మెరుపులు.. టాస్ మరింత ఆలస్యం

image

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కోల్‌కతా మధ్య జరగనున్న మ్యాచ్‌ టాస్ మరింత ఆలస్యం కానుంది. స్టేడియాన్ని మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులు కొనసాగుతున్నాయి. దీంతో పిచ్‌పై కవర్లు కప్పేశారు. వాతావరణం క్లియర్ అయిన తర్వాతే పిచ్‌పై కవర్లు తొలగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే టాస్ పడనుంది.

News May 13, 2024

మీరు సూపర్ తాత!.. 106ఏళ్ల వయసులో ఓటు

image

బిహార్‌లో 106ఏళ్ల రామ్ నాథ్ సింగ్ అనే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెగుసారాయి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఖమ్హార్‌లో ఉన్న 144వ పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటు వేశారు. ఇదిలా ఉంటే మన హైదరాబాద్‌లోని పాతబస్తీ ఓటర్లు మాత్రం ఓటేసేందుకు ససేమిరా రామంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

News May 13, 2024

మంగళగిరి ప్రజలకు ధన్యవాదాలు: నారా లోకేశ్

image

AP: మంగళగిరి చైతన్యానికి మారుపేరని మరోమారు నిరూపితమైందని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ‘నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం. సా.6 గంటలకు కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల్లో వేచి ఉండటం వెల్లివిరిసిన ప్రజా చైతన్యానికి ప్రతీక. పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న నా మంగళగిరి కుటుంబసభ్యులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News May 13, 2024

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్: CEO

image

TG: ఎన్నికల పోలింగ్‌ నిర్వహణలో భాగంగా శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకూ పూర్తి పోలింగ్ శాతం తెలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయన్నారు. ఈరోజు మొత్తం 400 ఫిర్యాదులు రాగా.. 38 FIRలు నమోదయ్యాయని వివరించారు. 1400 పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లున్నారని పేర్కొన్నారు.