India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ BJP నుంచి MP అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తన చేతిలో రూ.52,920 నగదు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకు అకౌంట్లో రూ.80,304, FD రూ.2,85,60,338, 4 గోల్డ్ రింగ్స్(రూ.2.67లక్షలు), పలు ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం కలిపి సుమారు రూ.3కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. కాగా.. తన సతీమణి ఆస్తులను ఆయన పేర్కొనలేదు.
వైద్య రంగంలో మరో అద్భుతాన్ని సైంటిస్టులు ఆవిష్కరించారు. మనిషి ఆలోచనలను 79% కచ్చితత్వంతో డీకోడ్ చేశారు. ఇందుకోసం T&C చెన్ బ్రెయిన్ మిషన్‌ను కాల్టెక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా ఇద్దరు వ్యక్తుల బ్రెయిన్‌లో చిన్న డివైజ్‌లను అమర్చారు. అవి సిగ్నల్స్‌ను అర్థం చేసుకుని పదాల రూపంలోకి మార్చుతాయి.
AP: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో చేసే బిల్లుల చెల్లింపులను ఆపాలని ఆ లేఖలో కోరారు. బినామీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రావాల్సిన నిధులు బినామీ కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇలా జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
భారతీయ ఐటీ కంపెనీలు H1B వీసా మీద ఇక్కడి ఉద్యోగులను US పంపడం ఒకప్పటి ట్రెండ్. అయితే గతకొన్నేళ్లుగా ఈ ట్రెండ్ నెమ్మదించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. టాప్ 7 కంపెనీల్లో హెచ్1బీ వర్క్ వీసాను వినియోగించుకోవడం 8ఏళ్లలో 56% తగ్గింది. వీసా ఆమోదంలో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో స్థానికులను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయట. టెక్నాలజీ అందుబాటులో ఉండటం కూడా మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘తిరుపతిలో పులివర్తి నానిపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేశారు. మాచర్ల, తాడిపత్రిలోనూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈసీ, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఒక్కరోజు అన్నం తినకుంటే బతకలేమేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇథియోపియాకు చెందిన అంబావ్(26) అనే మహిళ 16ఏళ్లుగా తిండి, నీళ్లు లేకుండా జీవిస్తోంది. తనకు ఆకలి, దాహం లేకపోవడంతో కొన్నేళ్లుగా మరుగుదొడ్డికి వెళ్లే అవసరం కూడా రాలేదని ఆమె అంటున్నారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆమెపై వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించినా ఎలాంటి లోపాలు బయటపడలేదు. అంబావ్ జీవిత రహస్యంపై డాక్టర్ల వద్దా వివరణ లేకపోవడం విశేషం.
పోలింగ్ ముగిశాక ఓట్లు EVMలలో నిక్షిప్తమవుతాయి. ఆ EVMలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. ఆ రూమ్‌లకు మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించరు. ద్వితీయ భద్రతా వలయాన్ని దాటేవారంతా తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలి. ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, RO, పరిశీలకుడి సమక్షంలో వీడియో తీస్తూ స్ట్రాంగ్‌రూం తెరవాల్సి ఉంటుంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు, అభిషేకం నిర్వహించారు. వారి వెంట యూపీ అటవీ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా ఉన్నారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరైన విషయం తెలిసిందే.
AP: వైసీపీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలను లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నా’ అంటూ సీఎం జగన్ పోస్ట్ పెట్టారు.
T20WC ఎంపికపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ టోర్నీకి హార్దిక్‌ను ఎంపిక చేయడం రోహిత్, సెలక్టర్ అగార్కర్‌కు ఇష్టం లేదని ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఐపీఎల్లో అతడి పేలవ ప్రదర్శనే ఇందుకు కారణమని తెలిపింది. అయితే పొట్టి ప్రపంచకప్ తర్వాత T20లకు రోహిత్ వీడ్కోలు పలికే అవకాశం ఉండటం, కెప్టెన్‌గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేకపోవడంతో WCకు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.